Home Health చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అవుతుందా? కారణాలు తెలుసుకొని ఈ చిట్కాలు పాటించండి!

చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అవుతుందా? కారణాలు తెలుసుకొని ఈ చిట్కాలు పాటించండి!

0

జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మేకప్ చేసుకొని రెడీ అయిన తరువాత దానికి తగినట్టు హెయిర్ స్టైల్ ని కొద్దిగా మారిస్తే చాలు లుక్ పూర్తిగా మారిపోతుంది. అందుకే హెయిర్ మీద దృష్టి పెట్టాలి. దాని సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. రాలిపోవడం దగ్గర నుండీ తెల్లబడడం వరకూ నివారించాలి. వ‌య‌సుతో పాటు జుట్టు తెల్ల‌బ‌డ‌టం స‌హజం. కానీ ఈ రోజుల్లో చిన్న వ‌య‌సులోనే చాలామందికి జుట్టు తెల్ల‌బ‌డుతుంది. మూడు ప‌దుల వ‌య‌సుకు రాక‌ముందే వెంట్రుక‌ల‌కు క‌ల‌ర్ డై వేసుకోవాల్సి వ‌స్తుంది.

white hairసాధారణంగా వయస్సు పెరిగిన తర్వాత కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.అందువల్ల తల వెంటుకలు తెల్లగా మారతాయి. కానీ, ఈ సమస్య ముందుగానే వస్తే చిన్న వయస్సులోనే ఈ తెల్ల వెంటుకలు వస్తాయి. ఒక్క‌సారి జుట్టు తెల్ల‌బ‌డితే అది తిరిగి న‌ల్ల‌బ‌డ‌టం ఉండ‌ద‌ని ఇంత‌వ‌ర‌కు అనుకున్నారు. కుదుళ్ల‌లోని మూల‌క‌ణాల్లోని మార్పుల వ‌ల్లే జుట్టు తెల్ల‌బ‌డుతుంది కాబ‌ట్టి మ‌ళ్లీ న‌ల్ల‌బ‌డే ప్ర‌స‌క్తే లేద‌ని భావించారు. కానీ ఇలా తెల్ల‌బ‌డిన జుట్టును ఎలాంటి రంగు వేసుకోకుండానే మ‌ళ్లీ న‌ల్ల‌బ‌డేలా చేయొచ్చట‌.

అయితే, ఈ తెల్ల వెంట్రుకల సమస్యను ముందుగా గుర్తించినప్పుడే దానిని పరిష్కరించడం సాధ్యమవుతుంది. కొంత మందిలో ముందుగానే మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకే వారి జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. ఇక చాలా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. మారుతున్న మ‌న లైఫ్‌స్టైల్‌తో పాటు కాలుష్యం ఇలా చాలా కార‌ణాల‌తో వెంట్రుక‌ల‌కు తెల్ల‌బ‌డతాయి.

అందంగా కనిపించాలన్న ఉద్దేశ్యంతో జుట్టుకి రకరకాల రసాయనాలు వాడుతుంటారు. అవన్నీ జుట్టుపై దుష్ప్రభావాలు చూపుతాయి. అందుకే యవ్వనంలో ఉండగానే జుట్టు తెల్లబడడం మొదలవుతుంది. ముఖ్యంగా జుట్టును స్ట్రెయిట్ చేయాలన్న ఉద్దేశ్యంతో వేడిని వెదజల్లే సాధనాలను వాడుతుంటారు. అవి జుట్టుకి చాలా హాని చేస్తాయి. వాటివల్ల జుట్టు విఛ్ఛిన్నం అయిపోయి కుదుళ్ళ వద్ద బలహీనంగా మారతాయి. తద్వారా జుట్టు రాలిపోతుంది. ఇంకా, జుట్టు తెల్లబడడానికి ఇది ప్రధాన ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల మీ జుట్టును వీలైనంత సహజంగా ఉంచండి.

జుట్టు తెల్లబడడానికి మరో ముఖ్య కారణం ఒత్తిడి. ఒత్తిడికి ఎక్కువ గురయ్యేవారు జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. జుట్టు తెల్ల‌బ‌డ‌టానికి ఒత్తిడికీ సంబంధం ఉంటుంద‌ని నిర్ధ‌రించిన పరిశోధకులు అలా ఒత్తిడితో తెల్ల‌బ‌డిన జుట్టును తిరిగి న‌ల్ల‌గా చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. త‌మ ప‌రిశోధ‌న‌లో భాగంగా కొంత‌మందిని ఎంపిక చేసుకుని వారిని ఒత్తిడికి గుర‌య్యేలా చేశారు. అలా చేసిన‌ప్పుడు వారిలో రంగు మారిన కొన్ని వెంట్రుక‌ల్ని గుర్తించామ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. త‌ర్వాత కొన్నాళ్ల‌కు అదే వ్య‌క్తుల్ని స‌ర‌దాగా గ‌డిపి ర‌మ్మ‌ని సెలవు మీద పంపించారంట‌.

వారు తిరిగి వ‌చ్చిన త‌ర్వాత రంగుమారిన వెంట్రుక‌ల్ని ప‌రిశీలించ‌గా అవి న‌ల్ల‌బ‌డ్డాయ‌ని.. ప్రోటీన్ల‌లోనూ మార్పు క‌నిపించింద‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. అంటే 30 నుంచి 50 ఏళ్ల వ‌య‌సులోపు ఒత్తిడితో జుట్టు తెల్ల‌బ‌డితే.. ఆ ఒత్తిడి త‌గ్గ‌గానే మ‌ళ్లీ వెంట్రుక‌లు న‌ల్ల‌బ‌డ‌తాయ‌ని నిర్ధారించారు. అందుకే వీలైనంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈకాలంలో అది కష్టమే అంటారా? ధ్యానం ప్రాక్టీస్ చేయండి.

మంచి పోషకాలతో కూడిన ఆహారం ఆరోగ్యాన్ని మాత్రమె కాకుండా వెంట్రుకల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా మంచి జుట్టుకి తగిన పోషకాలను తీసుకోవాలి. అప్పుడే మన జుట్టు కుదుళ్లలో ఈ మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. జంక్ ఫుడ్ అస్సలు ముట్టుకోవద్దు. బయట దొరికే చిరుతిళ్ళు తినకపోవడమే మంచిది. ఆహారంలో పప్పుపు, మొలకలు, పండ్లు, పచ్చి కూరగాయలు చేర్చండి. అలాగే కొన్ని సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కూడా ఈ తెల్ల జుట్టు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. అలాగే పాంటోథెనిక్ ఆమ్లం అని కూడా పిలువబడే ఈ విటమిన్ B 5 జుట్టు తెల్లబడే ప్రక్రియను ఆలస్యం చేసే అవకాశం చాలానే ఉంది.

కాబట్టి వైద్యుల సూచన తీసుకుని.. ప్రతి రోజూ కూడా 100-200 మిల్లీగ్రాముల కాల్షియం పాంతోథెనిక్ ఆమ్లం తీసుకోవడం ద్వారా ఈ తెల్ల జుట్టు సమస్యను చాలా ఈజీగా అధిగమించవచ్చు. అయితే, ఈ సప్లిమెంట్లను ఇష్టానుసారం తీసుకోకూడదని, వైద్యులు సూచించే బ్రాండ్లు, మోతాదుల ప్రకారమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించండి.చిన్న తనం నుంచే తీవ్రంగా బాధ పడుతున్నఈ తెల్ల జుట్టు సమస్యని ఈజీగా అదిగమించండి. విటమిన్ ‘B 12’, టీ అధికంగా తీసుకోవటం, కాఫీ, కారపు ఆహారాలు మరియు వేయించిన ఆహారాలు తీసుకోవటం వలన జుట్టు త్వరగా నెరుస్తుంది.

Exit mobile version