ఫ్రిడ్జ్ నుండి చెడు వాసన వస్తుందా..? ఈ చిట్కాలు పాటించండి!

వింత వింత వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత కాలంలో శుభ్రత అనేది చాలా ముఖ్యం. అందులోనూ మనం తినే ఆహార పదార్ధాలు ఉండే ఫ్రిడ్జ్ యొక్క శుభ్రతను అస్సలు విస్మరించకూడదు. కానీ రిఫ్రిజిరేటర్‌ను శుభ్రపరచడం అనేది మనం అంత పెద్దగా పట్టించుకోము. అసలు చాలా మంది ఫ్రిడ్జిలోనుండి దుర్వాసన వచ్చేవరకు కూడా దానిని శుభ్రం చెయ్యాలని ఆలోచించరు. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇళ్లు అంటే చాలా అరుదుగా ఉంటుంది. టెక్నిలోజి పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం ఎక్కువవుతోంది. వారికి కావలసిన పదార్థాలు తాజాగా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఇంట్లో ఫ్రిజ్ తప్పనిసరి అనుకుంటారు. దానిలో వారికి కావలసిన పదార్థాలు నింపేసి పెడతారు. దింతో ఫ్రిజ్ డోర్ తెరిచిన ప్రతిసారి ఏదో ఒక రకమైన చెడు వాసన వస్తుంటుంది.
ఫ్రిజ్ ను ప్రతి రోజూ శుభ్రం పరచడం అంటే కష్టమైన పని కానీ అందుకు ముందు జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే చెడు వాసనలు లేకుండా ఫ్రిడ్జ్ ని ఉపయోగించుకోవచ్చు. ఆ చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం…
ఫ్రిడ్జ్ లో నుండి వాసన రాకుండా ఉండాలంటే వండిన పదర్థాలను ఒక ట్రేలో పెడితే, వండని పదార్థాలను మరొక ట్రేలో పెట్టాలి. అలాగే పాలు, పెరుగు, నెయ్యి వంటివి సపరేట్ గా పెట్టుకోవాలి. ఫ్రిజ్ లో ఏ పదార్థాలను ఎక్కడ పెట్టుకోవాలి కంపెనీ వారు గుర్తించి ఉంటారు. కాబట్టి వాటి ప్రకారం సర్ధకొన్నట్లైతే మీ ఫ్రిజ్ లోని పదార్థాలకు ఎటువంటి హానీ జరగదు. ముఖ్యంగా పాలకు సంబందించిన ఉత్పత్తులను ఫ్రిడ్జిలో ఒలకకుండా చూడాలి. ఒక ఒలికితే వెంటనే తుడిచేయాలి లేదంటే చేడు వాసనను వెదజల్లడమే లేకుడా లోపల ఉన్న వేరే పదార్థాల మీద కూడా ఈ ఎఫెక్ట్ చూపిస్తది. వేడివేడిగా ఉండే ఆహార పదార్థాలను, పాలను కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. బాగా చల్లారనిచ్చి ఆ తర్వాత పెట్టాలి.
ఫ్రిజ్‌ లో ఆహార పదార్థాలను కూరగాయలను ఏమాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెట్టరాదు. ఫ్రిజ్‌లోపల గాలి ప్రవేశించేలా కొంత ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. ఫ్రిడ్జిలో ఆకుకూరలు పెడుతున్నప్పుడు కడిగి పూర్తిగా ఆరిపోయాక పెట్టాలి, తడితడిగా ఉన్నపుడు పెడితే త్వరగా కుళ్లిపోతాయి. తొడిమలు తీసిన మిరపకాయలను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో వుంచితే అవి కుళ్ళిపోతాయి. కనుక పచ్చి మిర్చిని తొడిమలు తీసాక ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఆకు కూరలను వేళ్ళను కత్తిరించి తడిపోయేలా బాగా ఆరబెట్టి కట్లను విడదీసి పాలథిన్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి.
ఫ్రిడ్జ్ వాసన రాకుండా ఉండాలంటే చాలా రోజులుగా నిల్వ ఉన్న పదార్థాలు ఉంచొద్దు. ఒకే వస్తువును ఫ్రిడ్జిలో చాలా రోజులు ఉంచిన కూడా అది చెడిపోతది. దాని వల్ల ఇతర పదార్థాలు కూడా చెడిపోయి వాసన వచ్చే అవకాశం ఉంటది. అందుకే మనం రెగ్యులర్ గా వాడే పదార్థాలను మాత్రమే ఫ్రిడ్జిలో పెట్టాలి.
ఆహారాలు నిల్వ ఉంచేటప్పుడు తప్పనిసరిగా వాటి మీద మూతలు తప్పకుండా కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి. ముఖంగా మసాలాలకు సంబందించినవి. ఎందుకంటే మసాలాలు అతి త్వరగా చెడిపోతుంటాయి. ఘాటు వాసనలున్న పదార్థాలను నిల్వ చేసే ముందు వాటిని సరైన డబ్బాల్లో పెట్టి మూత పెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటి వాసనలు బయటకు రాకుండి ఇతర పదార్థాలకు ఎటువంటి హాని చేయకుండా ఫ్రిజ్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఆహార పదార్థాలు, పాలు, పెరుగు, రుబ్బినపిండి లాంటివి ఉంచిన పాత్రల మీద మూతపెట్టాలి.
ఫ్రిడ్జ్ నిండుగా పెట్టిన వాసన రాకుండా ఉండాలంటే బేకింగ్ సోడాను తీసుకొని రంద్రాలున్న ఒక డబ్బాలో తీసుకోని ఫ్రిడ్జిలో ఒక మూలాన పెట్టాలి దీనివల్ల సువాసన రాకుండా ఉండడమే కాదు, ఫ్రిడ్జ్ లోని వస్తువులను తాజాగా ఉంచుతుంది. నిమ్మకాయలు కోసి ఒక మూలన పెట్టిన ఫ్రిడ్జ్ వాసన రాదు. చెడు వాసనలు రాకుండా నిర్మూలించడానికి , కొన్ని కాటన్ బాల్స్ లో వెనిలా ఫ్లేవర్ చల్లి,ఒక చిన్న డిష్‌లో ఉంచి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. వెనిలా బదులు ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్ కూడా వాడుకోవచ్చు.
అంతేకాదు క్రమం తప్పకుండా రెండు నెలలకు ఒకసారి క్లీన్ చేయాలి. ఫ్రిడ్జ్ లో ఉండే కఠినమైన మరకలను తొలగించడానికి టూత్‌పేస్ట్ ఉపయోగించవచ్చు. ఇది సున్నితమైన రాపిడి కలిగి ఉంటుంది మరియు ఆహ్లాదకరమైన వాసన కలిగి ఉంటుంది. లేదా ఇంట్లో తయారు చేసిన ఆల్-పర్పస్ క్లీనర్‌ను కూడా ఫ్రిడ్జ్ క్లీన్ చెయ్యడానికి ఉపయోగించవచ్చు.  ½- కప్ వెనిగర్ మరియు ¼- కప్ బేకింగ్ సోడా… స్ప్రే బాటిల్ లోకి పోయాలి, లేదా ఒక గిన్నె నుండి స్పాంజిలో ముంచి ఫ్రిడ్జిని శుభ్రం చెయ్యండి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,520,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR