పెర్ఫ్యూమ్ అనారోగ్య కారణిగా మారుతుందా ఎందువలన ?

నిత్య జీవితంలో సువాసనలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇవి మన నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. చిటికెలో మన మనస్సులోని ఆలోచనలు మార్చేస్థాయి. అప్పుడప్పుడు మనం ఒత్తిడికి గురౌతుంటాం. డిప్రెషన్ అవుతుంటాం అలాంటప్పుడు మంచి వాసనలు చూడడం వల్ల మన శరీరంలోని సువాసనలతో మనం చేసే పనుల్లో మనసును కేంద్రీకరించగలుగుతాం.

perfumeఈ మధ్య కాలంలో పెర్‌ఫ్యూమ్స్‌ ఉపయోగం క్రమంగా పెరుగుతుంది. ధనిక, పేద అని తేడా లేకుండా పెర్‌ఫ్యూమ్స్‌ వాడుతున్నారు. ఏ పార్టీకి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా అక్కడి ఆవరణం అంతా పెర్‌ ఫ్యూమ్‌ వాసనతో నిండిపోతుంది. ఇకపోతే లిఫ్ట్స్ లో గాలికి బదులు ముక్కు సెంట్‌ వాసనలను ఆస్వాదిస్తుంది. అయితే ఈ పెర్‌ఫ్యూమ్‌ వలన అనేక వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

perfumeరసాయనాలతో తయారైన సెంట్‌, పెర్‌ఫ్యూమ్‌ వాడటం వల్ల ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. రకరకాల పూల ఫ్లేవర్లతో తయారుచేస్తున్నట్లు చెప్పే కంపెనీలు… వాటిలో కలుపుతున్న ప్రమాదకర రసాయనాల వివరాలు మాత్రం బయటపెట్టవంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల‌ పెర్‌ఫ్యూమ్స్ వాడేవారిలో 2శాతం మంది విష ప్రభావాలు ఎదుర్కొంటున్నారు.

perfumeసెంట్స్‌ ఉపయోగించే సమయంలో అవి చర్మానికి తగలడం, వాటి వాసనతో అలర్జీలు, కాంటాక్ట్‌ డర్మటైటిస్‌, ఎగ్జిమా అనే చర్మ వ్యాధులు, మైగ్రేన్‌ తరహా తలనొప్పుల తో పాటు అనేక రకాల చర్మవ్యాధులు వస్తువులున్నాయని చర్మవైద్య నిపుణులు చెబుతున్నారు.

perfumeఅంతేకాదు అధికంగా సెంట్, పెర్‌ఫ్యూమ్‌ వాడడం వల్ల డిప్రెషన్ సమస్య పెరుగుతుంది. అది నానాటికీ ఎక్కువై, వైద్యానికి కూడా అందనంత స్థాయికి చేరుతుందంటున్నారు పరిశోధకులు. అందువల్ల వీలైనంతవరకూ సెంట్లు, పెర్‌ఫ్యూమ్స్‌ కి దూరంగా ఉండమంటున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR