కరోనా వ్యాక్సిన్ వేసేటప్పుడు రక్తం గడ్డకడుతుందా ?

కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. జనవరిలోనే దేశ వ్యాప్తంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల పంపిణీ ప్రారంభం కాగా, మార్చి నుంచి రెండో దశలో కరోనా వ్యాక్సిన్లు ఇస్తున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశంలో రెండో కీలక అడుగు పడింది. కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేయాలంటే భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడంతోపాటు టీకాలు తీసుకోవడం తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్తొలి దశలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకోవాలా వద్దా అనే అనుమానాలు కొందరిలో ఉండేవి. కానీ ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుని ప్రజలలో కరోనా టీకాలపై నమ్మకాన్ని పెంచారు. కరోనా నుండి తప్పించుకొని ప్రాణాలతో బయటపడాలంటే టీకాలు వేయించుకోవడం తప్పనిసరి కాబట్టి టీకాలు వేసుకోడానికి ప్రజలు ముందుకొస్తున్నారు. అయినప్పటికీ టీకాల విషయంలో కొంతందికి సందేహాలు, బయలు ఉండనే ఉన్నాయి.

కరోనా వ్యాక్సిన్వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, జ్వరాలు, రక్తం గడ్డ కట్టడం లాంటివి జరుగుతున్నాయని ఇంకా ఎన్నో అపోహలు ఉన్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. వ్యాక్సిన్ వేసుకున్నవారు ప్రాణాలు పోగొట్టుకోవడం ఈ వదంతులకు మరింత బలం చేకూర్చాయి. వాస్తవానికి వ్యాక్సిన్ వేసుకునే సమయానికే కరోనా సోకడం వలన ప్రాణహాని జరిగించి తప్ప వ్యాక్సిన్ వేసుకున్నందుకే చనిపోయారనడానికి ఆధారాలు లేవు. ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టిన ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళ కలిగించింది. అయితే రక్తం గడ్డకట్టడానికి స్టాఫ్ నిర్లక్ష్యమే కారణమని తాజా అధ్యయనంలో తేలింది.

కరోనా వ్యాక్సిన్కోవిడ్-19 వ్యాక్సిన్ వేసేప్పుడు సూది మందు గుచ్చేతీరులో తేడాల వల్ల రక్తంలో గడ్డలు కట్టే ప్రమాదం ఉందని, అందువల్లే కోవిడ్‌ టీకా తీసుకున్న కొంతమందిలో బ్లడ్‌ క్లాట్స్‌ కనిపించాయని నూతన అధ్యయనం వెల్లడించింది. తప్పుగా ఇంజెక్షన్‌ ఇచ్చేటప్పుడు కండరంలోకి ఎక్కించాల్సిన మందు పొరపాటున రక్తనాళాల్లోకి ఇంజెక్ట్‌ అవుతుందని, అందువల్ల తేడా చేస్తుందని మ్యూనిచ్‌ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్‌ సహా పలు టీకాల విషయంలో ఈ రక్తంలో గడ్డల(పోస్ట్‌ వ్యాక్సినేషన్‌ థ్రోంబాటిక్‌ థ్రోంబోసైటోపెనిక్‌ సిండ్రోమ్‌– టీటీఎస్‌ లేదా వ్యాక్సిన్‌ ఇండ్యూస్డ్‌ ఇమ్యూన్‌ థ్రోంబాటిక్‌ థ్రోంబోసైటోపీనియా– వీఐటీటీ) ఫిర్యాదులు వినిపించాయి. అయితే ఇది టీకాలో సమస్య కాదని, టీకా ఎక్కించడంలో సమస్యని తాజా నివేదిక తెలిపింది.

కరోనా వ్యాక్సిన్ఇంజక్షన్‌ నీడిల్‌ను కండరంలోకి చేరేంత లోతుగా పంపించకుండా పైపైన గుచ్చినప్పుడు టీకామందు కండరంలోకి బదులు రక్తంలోకి నేరుగా వెళ్తుంది. సూది మందు ఇచ్చే సమయంలో చేతిపై చర్మాన్ని వత్తి పట్టుకోకూడదు. ఇంట్రామస్కులార్‌ ఇంజెక్షన్లు(కండరాల్లోకి పంపే సూదిమందు) ఇచ్చేటప్పుడు ఏమాత్రం చర్మాన్ని పించప్‌(వత్తి పట్టుకోవడం) చేయకుండా సాఫీగా ఉన్న చర్మంపై టీకానివ్వాలి. లేదంటే సూది మొన కేవలం చర్మాంతర్గత కణజాలం వరకే చేరుతుంది. దీంతో టీకా మందు కణజాలంలోకి పీల్చుకోవడం జరగదు. పైగా కొన్నిమార్లు ఇలా చేయడం వల్ల సూదిమొన రక్తనాళాల్లోకి వెళ్తుంది. అప్పుడు టీకా మందు రక్తంలోకి ప్రవేశించి క్లాట్స్‌ కలిగించే ప్రమాదం ఉంది. అందుకే టీకా ఇచ్చేముందు సూది గుచ్చిన అనంతరం పిస్టన్‌ను వెనక్కు లాగి చెక్‌ చేసుకోవడం ద్వారా సూది మొన రక్తనాళంలోకి చేరలేదని నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్కరోనా టీకా తీసుకున్న వారిలో కొందరికి స్వల్పంగా జ్వరం వస్తుంది. మరికొందరిలో టీకా తీసుకున్న చోట కాస్త నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో తలనొప్పి, వికారం, బలహీనంగా ఉన్నట్లు ఒకట్రెండు రోజులు అనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితి రెండు రోజులు అలాగే ఉంటే మాత్రం ఆ వ్యక్తి కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలని నిపుణులు సూచించారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR