సంక్రాంతి పండుగ రోజు దాన ధర్మాలు చేయాలి అంటారు… ఎందుకో తెలుసా??

సంక్రాంతి అంటే కొత్త వెలుగులు. ముఖ్యంగా సంక్రాంతి రోజున గాలిపటాల వేడుక నిర్వహించడం అనేది విధి. ఇక ఈ పండుగను పూర్వం మన పెద్దలు దాదాపు 33 రోజలపాటు ఘనంగా జరుపుకునేవారు.. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఈ పండుగను 3 రోజులపాటు మాత్రమే నిర్వహించుకుంటున్నారు. అయితే భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి.. సాగరులకు శాప విమోచనం చేయించింది ఈ రోజే అని శాస్త్రాలు చెబుతున్నాయి
మన జీవితంలో కష్టాలు, బాధలు తొలగిపోయి, కొత్త వెలుగులు వెలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.
సూర్యుడు ధనుర్మాసం నుంచి మకరరాశిలోకి ఈరోజు ప్రవేశిస్తాడు.
కాబట్టి ఈ పండుగను మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు. సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ అని జరుపుకుంటారు. అయితే ఇంత విశిష్టత కలిగిన ఈ పండుగ రోజు కొన్ని పనులను కచ్చితంగా చేయాల్సి ఉంటుంది.
ఈ పనులను చేయడం ద్వారా అదృష్టం మన వెంటే ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే సంక్రాంతి రోజు తప్పకుండా చేయాల్సిన పనులు ఏమిటో  తెలుసుకుందాం…
సంక్రాంతి పండుగ రోజు ఉదయం నిద్రలేచి నీరు పారుతున్న కాలువలో స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. వీలైతే సూర్యదేవునికి దీపాన్ని వెలిగించి పూజ చేయటం వల్ల పుణ్య ఫలం లభిస్తుంది.
అంతేకాకుండా ఈ పండుగ రోజు ఎవరైనా మనల్ని దానం అడిగితే తప్పకుండా వారికి మనకు తోచినంత దానం చేయాలి. సంక్రాంతి పండుగ రోజు ఈ విధంగా దానం చేయటం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. సంక్రాంతి పండుగను రైతుల పండుగ అని కూడా పిలుస్తారు. రైతులు పండించిన పంటలు ఇంటికి చేరడంతో రైతులు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.
అదేవిధంగా తమ ఇంటికి వచ్చే హరిదాసు, బసవన్నలకు ధాన్యాలను దానధర్మాలు చేయడం ద్వారా గత జన్మ దారిద్య్రాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. అందుకోసమే సంక్రాంతి పండుగ రోజు మనకు చేతనైన దానధర్మాలు చేయడం వల్ల సుఖ సంతోషాలతో గడుపుతారని పండితులు తెలియజేస్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR