పచ్చి కొబ్బరి కంటే ఎండు కొబ్బరితోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయట!

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. కొబ్బరి నీళ్ళే కాదు అందులో ఉండే కొబ్బరి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలామంది లేత కొబ్బరిని ఇష్టంగా తింటారు. అయితే లేత కొబ్బరి కంటే ఎండు కొబ్బరి తోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఇందులో ఉన్న నీటి శాతం మొత్తం ఆవిరి అవుతుంది, కాబట్టి ఈ కొబ్బరి తియ్యగా ఉంటుంది. అలాగే, ఇందులో పోషకాలు, రోగ నిరోధక గుణాలు ఎక్కువ.

coconutఇది జీర్ణం అవటానికి కొంత సమయం పట్టినా కూడా దీనితో ప్రయోజనాలు ఎక్కువ. పైగా… ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కూడా. ఎండు కొబ్బరి స్వీట్స్ తయారీ లోను, కూరల లోను, పొడిగా చేసి వాడుకోవచ్చు. ఎండు కొబ్బరిని ఎక్కువగా మసాలా కూరలు చేయడానికి వాడుతారు. ఈ ఎండు కొబ్బరి తోనే కొబ్బరి నూనే ను తాయారు చేస్తారు. ఎండు కొబ్బరి లో ఫైబర్, కాపర్, మ్యాంగనీస్, సెలీనియం తో పాటు అనేక న్యూట్రియంట్స్ ఉన్నాయి.

dry coconut sweetరోజూ చిన్న ఎండుకొబ్బరి ముక్క తింటే… అందులోని ఫైబర్ వల్ల… గుండె కు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన గుండె కు చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్ స్తాయి ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్తాయి ని పెంచుతుంది . ఫలితంగా గుండె కు రక్తాన్ని చేరవేసే రక్త నాళాలు బలపడి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. పురుషులు రోజూ 38 గ్రాములు, మహిళలు రోజూ 25 గ్రాములు తినాలి.

heart diseaseఎండు కొబ్బరి లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గుండెకు చాలా మంచిది.
రోజూ ఎండుకొబ్బరి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి దూరంగా ఉంటుంది. క్యాన్సర్ ఉన్న వాళ్లు కూడా ఎండు కొబ్బరి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎండుకొబ్బరి తినడం వల్ల పేగులో క్యాన్సర్,ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

cancerమితంగా ఎండు కొబ్బరి తింటే, జీర్ణ సంభంద వ్యాధులు దరి చేరవు. అల్సర్ కూడా తగ్గుతుంది. ఎండు కొబ్బరిని తరచూ ఆహరం లో తీసుకుంటే శరీరం లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే సెలీనియం సేలనో అనే ప్రోటీన్స్ ను పెంచడం వలన అనేక వ్యాధులను దూరం చేస్తుంది. సెలీనియం మగ వారిలో వీర్య కణాల వృద్దికి సహాయ పడుతుంది.

food indigestionఎండుకొబ్బరి వలన మెదడు పని తీరు మెరుగు పడుతుంది. ఎండుకొబ్బరి లోని పోషకాల వలన మెదడులో మైలీన్ అనే న్యూరో ఉత్పత్తి పెరిగి మెదడును చురుకు గా ఉంచుతుంది. మెదడు లోని నరాల వొత్తిడి ని తగ్గిస్తుంది. పక్షపాతం నుండి కాపాడుతుంది. మతి మరుపు సమస్యలు దూరం అవుతాయి.

brain sharpకీళ్ల నొప్పులు, ఎముకలు పెళుసుబారిపోవడం లాంటి సమస్యలు ఉంటే…ఎండుకొబ్బరి సరైన పరిష్కార మార్గం. తలనొప్పి తో బాధపడుతున్న వారు రోజు ఒక ముక్క ఎండు కొబ్బరి తినడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎక్కువగా వేడి చేయటం వలన నోటి పుండ్లు, ఇన్ఫెక్షన్ ల నుండి ఎండుకొబ్బరి తినడం వలన ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే ఆయిల్ అనేది ఈ పుండ్ల కు పూత లాగా పని చేస్తుంది.

joint painsమహిళలు ఒక వయసు తరువాత అనీమియా కు గురి అవుతుంటారు. రక్తం లేక పాలి పోవడాన్ని అనీమియా అంటాము. ఐరన్ ఎక్కువగా ఉండే ఎండుకొబ్బరి ని వాడటం వలన రక్త లేమి సమస్య తగ్గుతుంది . దేనివలన ఇన్ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. ఎండుకొబ్బరి తో బెల్లం కలిపి తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,630,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR