Home Health యాలకుల నీటిని తాగి చూడండి.. కొద్ది రోజుల్లోనే మీలో తేడా గమనించొచ్చు!

యాలకుల నీటిని తాగి చూడండి.. కొద్ది రోజుల్లోనే మీలో తేడా గమనించొచ్చు!

0

భారతీయులు పురాతన కాలం నుండి సుగంధద్రవ్యాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. ఆయుర్వేదంలో, వంటలో కూడా సుగంధద్రవ్యాలను ఎలా వాడాలో అనే జ్ఞానం మన పూర్వీకులకు ఉంది. అందులో భాగంగానే యలకులను ఇప్పటీకీ వాడుతూ వస్తున్నాము. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. యాలకులు చక్కని రుచిని, వాసనను అందిస్తాయి. అయితే యాలకులను వంటల్లో ఉపయోగించడం కంటే కూడా యాలకుల నీటిని తాగడం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

cardamomరోజూ పరగడుపునే ఒక గ్లాస్‌ మోతాదులో యాలకుల నీటిని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణ సమస్యలు ఉన్నవారు రోజూ యాలకుల నీళ్లను తాగుతుండాలి. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్‌, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణక్రియను సక్రమంగా ఉండేలా చేస్తుంది. ఈ నీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన దీర్ఘకాల సమస్యలన్నీ కూడా వెంటనే దూరమవుతాయి.

షుగర్‌ సమస్యతో బాధపడుతున్న వారికి యాలకుల నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. మన బాడీలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు..యాలకుల నీరు అనేది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. రోజూ పరగడుపునే ఈ నీళ్లను తాగడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. డయాబెటిస్‌ పూర్తిగా నియంత్రణలో ఉంటుంది.

ఇక బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా యాలకుల నీరు తాగాల్సిందే. బరువు తగ్గడంతో యాలకుల నీరు చాలా సహాయపడుతుంది. ఈ నీటిలో చాలా ఎక్కువ మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.అలాగే శరీరంలో నిల్వ ఉన్న ఎక్సట్రా కొవ్వును కూడా తొలగించడం ద్వారా బరువును నియంత్రించడంలో ఎంతగానో సహాయపడతాయి.

అలాగే కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా చాలా మంచిది. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నవారు యాలకుల నీరు అనేది తీసుకోవాలి. ఈ నీరు మన శరీరంలో వుండే కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. అందువల్ల గుండె జబ్బులను దూరంగా ఉంచేందుకు బాగా సహాయపడుతుంది.ఇక మన శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా వెంటనే తగ్గిస్తుంది. రాత్రి పడుకో బోయే ముందు ఒక యాలకుల నీళ్లు ఒక గ్లాసు తాగితే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది.

యాల‌కుల నీరు తాగ‌డం వలన నిస్స‌త్తువ ఆమ‌డ దూరం వెళ్లిపోతుంది. ఉద‌యాన్నే నిద్ర లేవ‌డంతోనే హుషారుగా అనిపిస్తుంది. అలాగే యాల‌కుల నీటిలో ఉండే అనేక స‌ద్గుణాలు చ‌ర్మాన్ని కొద్ది రోజుల్లోనే కాంతివంతంగా చేస్తాయి. ఈ తేడాను స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు. యాలకుల నీరు చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికి కూడా సహాయ పడుతుంది. ఎముకలు కూడా బలంగా మారుతాయి.

మరి ఈ యాలకుల నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. యాలకుల నీరు చేయడానికి ముందుగా ఒక లీటరు నీటిని తీసుకోవాలి. అందులో ఒక 5 నుంచి 6 యాలకులను బాగా దంచి వేయాలి. ఆ నీటిని రాత్రంతా కూడా ఉంచాలి. పొద్దున్నే లేచిన తరువాత ఈ నీటిని బాగా మరిగించాలి. ఆ నీరు బాగా ఇంకి పోయి దాదాపు 3/4 ఉన్నప్పుడు గ్యాస్ ఆపి వేయాలి. ఆ తరువాత ఈ నీటిని ఫిల్టర్ చేసి రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తాగుతూ ఉండాలి.

నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. అయితే ఉత్తి నీళ్లు తాగ‌డం చాలా బోర్‌. ఎలాంటి టేస్టు ఉండ‌దు. కాబట్టి దానికి కాస్తంత యాల‌కుల రుచి త‌గిలితే అలాంటి ఇబ్బంది ఉండ‌దు. అందుకే ప‌ర‌గ‌డుపునే ఒక లీట‌ర్ గోరువెచ్చ‌ని నీటిలో కాస్తంత యాల‌కులు వేసుకొని తాగడం అలవాటు చేసుకోండి. పూర్తిగా బాటిల్ ఖాళీ చేయ‌వ‌చ్చు.

Exit mobile version