మట్టికుండలో నీళ్లను తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలో తెలుసా

ఇపుడయితే రిఫ్రిజిరేటర్లు వచ్చేశాయి. అలా వేసవి ఎండకి బయటకు వెళ్లి లోపలికి రాగానే ఫ్రిజ్ లోని చల్లటి నీళ్లు తాగేస్తుంటారు. కానీ మట్టికుండలోని మంచినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నీటి నుండి లభించే విటమిన్లు, ఖనిజాలు, ముఖ్యంగా మట్టి కుండలలో నిల్వ ఉంచిన నీరు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.

Drinking pot water is very healthyకుండలో పోసిన నీళ్లు వంద శాతం ప్యూరిఫైడ్‌ చేసిన నీటితో సమానం అని నిపుణులు స్వయంగా పరిశోధన చేసి నిరూపించారు. ప్యూరిఫైడ్‌ నీటిని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. కుండలో ఉన్న లక్షణాల కారణంగా నీటిలో ఉన్న మళినాలు కుండ పీల్చుకుంటుంది. నీటిని పూర్తి స్వచ్చంగా చేస్తుంది. కుండ నీటితో పాటు రాగి చెంబులోని నీరు కూడా చాలా మంచిదని నిరూపితం అయ్యింది. అందుకే కుండలో నీరు చాలా మంచిది.

Drinking pot water is very healthyమట్టి కుండలో అంతటి మహిమ ఉంది కనుకనే మన పూర్వీకులు రహదారుల్లో కూడా మట్టి కుండలో నీళ్ళు ఉంచి అందరికి ఉచితంగా నీరు, మజ్జిగ ఇచ్చేవారు. అసలు మట్టి కుండలో ఉన మహత్తు ఏమిటో తెలుకున్న తరువాత మీరు తప్పకుండా కుండలో నీళ్ళు తాగుతారు…

నీళ్లు సహజంగా చల్లబడతాయి :

Drinking pot water is very healthyకుండలో నీళ్లు నేచురల్ గా కూల్ గా మారుతాయి. వేసవి సీజన్లో వేడి నుండి ఉపశమనం పొందడానికి కుండనీళ్లు ఎంతగానో సహాయపడుతాయి. ముఖ్యంగా వేసవిలో కరెంట్ కోత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఫ్రిడ్జ్ వాటర్ కంటే కుండలోని నీరు తాగడం మంచిది. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ మరియు ఎకో ఫ్రెండ్లీ కాబట్టి, వేసవిలో కుండలోని వాటర్ తాగడం మంచిది.

ఇమ్యూనిటి గుణాలు అధికంగా ఉంటాయి:

Drinking pot water is very healthyమంటి కుండలో నీళ్లు పోసి తాగడం వల్ల నీళ్లలోని సహాజ మినిరల్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి అందించి ఎనర్జీని అందిస్తాయి. కుండలో నీరు నిల్వ చేసినప్పుడు ఇమ్యూనిటి గుణాలను అధికంగా పెంచుతుంది. ఈ వాటర్ తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి.

ఆల్కలైన్ నేచర్ :

ఈరోజుల్లో వాతావరణం, కాలుష్యం వల్ల వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి, ఆల్కలైన్ క్షీణించి ఆరోగ్యం ప్రమాదకర స్థితికి చేరుకుంటుంది. మట్టితో తయారుచేసిన కుండలోని నీరు తాగడం వల్ల నేచురల్ గా ఆల్కలైన్ పొందుతారు. మంట్టి కుండలో నీరు నిల్వ చేయడం వల్ల , ఇది ఆరోగ్యానికి సహాయపడే మంచి ఆల్కలైన్ వాటర్ గా రూపాంతరం చెందుతుంది.

Drinking pot water is very healthyహానికర కెమికల్స్ ఉండవు:

చాలా వరకూ ప్లాస్టిక్ బాటిల్స్ ను టాక్సిక్ కెమికల్స్ తో తయారుచేయడం వల్ల అందులో ఉన్న నీళ్లు హానికరంగా తయారు అవుతుంది. అదే మట్టి కుండలో నీరు నిల్వ చేసి తాగడం వల్ల వాటర్ ప్యూరిఫై అవ్వడం మాత్రమే కాదు, శరీరానికి ఎలాంటి హాని జరగకుండా సహాయపడతాయి.

మెటబాలిజం పెంచుతుంది:

Drinking pot water is very healthyమంటి కుండలో నీరు నిల్వ చేసి తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.

గొంతుకు మంచిది:

Drinking pot water is very healthyజలుబు, దగ్గు, ఆస్త్మాతో బాధపడే వారు ఫ్రిడ్జ్ లోని వాటర్ కంటే కుండ వాటర్ ను తాగడం మంచిది. ఈ వాటర్ వల్ల ఎలాటి సైడ్ ఎఫెక్ట్స్ , గొంతు నొప్పి ఉండదు.

సన్ స్ట్రోక్ ను నివారిస్తుంది:

Drinking pot water is very healthyమట్టితో తయారుచేసిన కుండలో నీళ్లు నిల్వ చేసి తాగడం వల్ల వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మట్టి కుండలోని నీటితో ముఖం కడిగితే వేసవిలో ఎండ నుండి మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR