డ్రై ఫ్రూట్స్ – నట్స్ అతిగా తీసుకోడం వలన కలిగే అనర్ధాలు

ఈ మధ్య ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది. అందుకే చాలా మంది వారి రోజువారి డైట్ లో డ్రై ఫ్రూట్స్ ని భాగం చేసుకుంటున్నారు. ఆరోగ్యానికి మంచిది అని వైద్యుల సలహాతో చాలా మంది తింటున్నారు. అయితే నట్స్ (గింజలు), డ్రై ఫ్రూట్స్ (ఎండు ఫలాలు) రోజుకు ఎన్ని తీసుకోవచ్చు అంటే వైద్యులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. అన్నీ వయసుల వారు ఒకే రకంగా వీటిని తీసుకోవద్దు అంటున్నారు.

Dry Fruitsయువత 25 నుంచి 30 గ్రాములు తీసుకోవచ్చు. బాదం, ఆక్రోట్, పిస్తా, వేరుశెనగ, జీడిపప్పు, పుచ్చ గింజలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వీటిలో కేలరీలు ఎక్కువ కాబట్టి మోతాదుకి మించి తీసుకోవద్దు. రోజుకు ఇరవై నుంచి ముప్పై గ్రాములకు మించకుండా ఈ నట్స్ తీసుకోవచ్చు. అలాగే వాకింగ్ చేయడం జిమ్ వర్క్ అవుట్లు చేసే వారు కూడా ఇలా 25 గ్రాముల నుంచి 20 గ్రాములు తీసుకోవచ్చు.

Dry Fruitsరోజూ ఒకటే కాకుండా రొజు ఓ రకం తీసుకుంటే మంచిది. ఇక కిస్మిస్, ఖర్జూరం, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ తీయగా ఉంటాయి. ఇందులో చక్కెర ఎక్కువ. అందుకే వీటిని తక్కువగా తీసుకోండి. రోజు ఖర్జూరం అంజీర్ రెండు మాత్రమే తినండి. కిస్ మిస్ 10 తీసుకోండి. షుగర్ లెవల్ పెరగదు, ఒక వేళ పళ్లు లేని వారు తీసుకోవాలి అనుకుంటే దీనిని పొడి చేసుకుని పాలల్లో వేసుకోవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR