డస్ట్ ఎలర్జీ తగ్గించే ఇంటి చిట్కాలు!

మీ చుట్టూ ఉన్నవాళ్లలో ఎవరికైనా డస్ట్ ఎలర్జీ ఉందా? డస్ట్ ఎలర్జీ ఉన్నవారి అవస్థలు అన్నీ ఇన్ని కావు. కొంచెం దుమ్ము లేసినా కానీ హ‌చీ.. హ‌చీ.. అని తుమ్ముల‌ను వరుస పెట్టి తుమ్మాల్సిందే. తినే వాటిలో కూడా రిస్టిక్ష‌న్స్ పెట్టుకోవ‌ల‌సిందే. లేక‌పోతే ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఒక్కసారైనా ఆదమరిచి వ్యవహరించామో డ‌స్ట్ అల‌ర్జీ ఎఫెక్ట్ మారీ దారుణంగా త‌యార‌వుతుంది.
  • డస్ట్ అలర్జీ రావడానికి ముఖ్య కార‌ణం దుమ్ము. ఈ అల‌ర్జీకి కొంద‌రిలో బొద్ధింకలు కూడా కార‌ణం అవుతాయి. ఫంగస్, దుమ్ము వల్ల ఈ అలర్జీ మ‌రింత‌ పెరుగుతుంది. అలాగే కొన్ని ర‌కాల రేణువుల నుంచి కూడా ఈ స‌మ‌స్య పెరుగుతుంది. పూలు, చెట్లు, గడ్డి నుంచి కూడా డ‌స్ట్ అలర్జీక్ రియాక్షన్స్ వ‌స్తాయ‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు.
  • డస్ట్ అలర్జీ ఉంటే గాలిలోని ఉన్న దుమ్ము, ధూళీ కణాల కారణంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. దీంతో వరుసగా తుమ్ములు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, కళ్ల వాపు, ముక్కు, గొంతులో దురద, దగ్గు, తలనొప్పి, అలసట, బలహీనత వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఫలితం అంతగా ఉండదు.
  • ఈ సమస్యకు పరిష్కారం వెతకాలంటే అసలు ఈ డస్ట్ అలర్జీ ఎలా వస్తుందో ముందుగా తెలుసుకోవాలి. ఇందుకు కారణం డస్ట్ మైట్స్. ఇందులో ఉండే సూక్ష్మ జీవులు గాలిలో ఉండే పుప్పొడి కణాలు, జంతువుల వెంట్రుకలు, చుండ్రు, ఫంగస్ ఇలా అనేక రకాల బ్యాక్టీరియా కూడా అలర్జీకి కారణమవుతాయి. అయితే ఈ డ‌స్ట్ అల‌ర్జీకి మ‌న ఇంట్లో ఉండే వాటితోనే చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
  • కలబంద రసం అలర్జీని తగ్గిస్తుంది. ముందుగా కలబంద ఆకు తీసుకుని దాని తొక్కను తీసివేయాలి. ఆ తర్వాత దానిపై ఉండే పసుపు పొరను కూడా తొలగించాలి. అందులో నుంచి జెల్ తీసి మిక్సీలో వేసి ఒక కప్పు నీరు కలిపి మిక్సీ పట్టాలి. అనంతరం ఆ రసాన్ని తాగాలి. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. బ్యాక్టీరియా, ఫంగస్ సమస్యలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇవి అలర్జీల వలన కలిగే సమస్యలను తగ్గిస్తాయి.
  • అలాగే డస్ట్ అలర్జీని తగ్గించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగాలి. ఇందులో కొన్ని చుక్కల తేనె కూడా కలుపుకోవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్‏లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అలర్జీని తగ్గించడంలో సహాయపడతాయి.
  • అలర్జీని తగ్గించుకునేందుకు యాకలిప్టస్, లావెండర్ నూనె కూడా ఉపయోగించవచ్చు. వేడి నీటిలో 4-5 చుక్కల యూకలిప్టస్, లావెండర్ నూనెను వేసి పీల్చుకోవాలి. ఈ రెండు నూనెలు శోథ నిరోధక, అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది మంట, నొప్పిని తగ్గించడంలో సహయపడతాయి.
  • అలర్జీని తగ్గించడానికి తేనె సహయపడుతుంది. ప్రతి రోజు నేరుగా రెండు చెంచాల తేనెను తీసుకోవాలి. తేనెను ఒక కప్పు నీటిలపో కలపి తీసుకోవచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అలర్జీని తగ్గించడంలో సహాయపడతాయి.
  • అలర్జీని తగ్గించడానికి పసుపు, నల్ల మిరియాలు సహయపడతాయి. ఇందుకోసం ఒక కప్పు పాలలో అర టీ స్పూన్ కలపాలి. ఆ తర్వాత పాలను వేడిచేయాలి. ఆతర్వాత పాలను కాస్త చల్లార్చి అందులో చిటికెడు నల్ల మిరియాలు, కొన్ని చుక్కల తేనె కలిపి తీసుకోవాలి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అలర్జీని తగ్గిస్తాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR