Home Unknown facts ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలువబడే 12 శివలింగాలు ఉన్న అద్భుత ఆలయం

ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలువబడే 12 శివలింగాలు ఉన్న అద్భుత ఆలయం

0

మన పురాణాల ప్రకారం ఆత్మలింగం చేజార్చుకొని ఆ లింగం కోసం విశ్వ ప్రయత్నం చేసిన రావణుడికి శివుడు వచ్చి వైద్యం చేసిన ప్రదేశం ఇదేనని, ఇంకా మార్కండేయుడు యమపాశం నుండి తప్పించుకొని చిరంజీవిత్వం పొందినది ఇకడేనని, అలాగే సతి సావిత్రి కథ కూడా ఇక్కడే జరిగిందని చెబుతారు. మరి ఇక్కడ వెలసిన ఈ ఆలయంలోని విశేషాలు ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Dwadasa jyothirlingalugaa

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో పర్లి అనే రైల్వే స్టేషన్ కి సుమారు 6 కి.మీ. దూరంలో వైద్యనాథేశ్వరస్వామి ఆలయం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం ప్రముఖమైనది. ఈ ఆలయం చాలా పెద్దది. గర్భగుడికి ముందు పైన ఉన్న శిఖరం సుమారు 60 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ గర్భాలయంలో సుమారు నాలుగు అడుగులు ఉన్న పానవట్టము దాని మధ్యలో రెండు అడుగుల ఎత్తు ఉన్న శివలింగ మూర్తి ప్రతిష్టితులై చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ శివలింగమూర్తికి వెనుక ఉన్న గోడలో మూడు అడుగుల గూడు అందులో పార్వతీదేవి ప్రతిష్టించబడి ఉన్నారు. ఇక్కడి ఆలయం లో అమ్మవారు స్వామివారితో పాటే గర్భగుడిలో ఉండుట ప్రత్యేకత. అందుకే ఈ ఆలయాన్ని అపూర్వ కాశి అని పిలుస్తారు. ఈ ఆలయంలోని స్వామివారు అనారోగ్యాలను దూరం చేసే వైద్యుడని, వైద్యనాదేశ్వరుడని భక్తుల నమ్మకం. ఈ దేవాలయం చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలువబడే 12 శివలింగాలు ప్రతిష్టించబడి ఉన్నాయి.

ఇక పురాణానానికి వస్తే, శివుడి అనుగ్రహం తో ఆత్మలింగాన్ని సొంతం చేసుకున్న రావణుడు లంకకి వెలుతుండగా శివుడు ఒక షరతు పెడతాడు, ఏంటంటే ఆ శివలింగం ఎక్కడైతే కింద పెడతావో అక్కడే ఉండిపోతుంది దాన్ని ఎంత బలంతో పెకిలించాలని చుసిన అది అక్కడ నుండి రాదు అని చెప్పడంతో, రావణుడు ఆ శివలింగాన్ని నేల మీద పెట్టకుండా లంకకి తీసుకొని వెళుతుండగా, ఆ శివలింగం అతని దగ్గర ఉంటె ఎవరు జయించలేరని తలచిన దేవతలు వినాయకుడిని పంపగా వినాయకుడు బ్రాహ్మణా రూపంలో వెళ్తాడు.

అయితే రావణుడు వెళుతుండగా దారిలో సంధ్యావందనం సమయం కాగా, ఎదురుగా కనిపించిన బ్రాహ్మణా బాలునికి ఆత్మలింగాన్ని అప్పజెప్పి, వెంటనే సంధ్యావందనం తరువాత తిరిగి వస్తానని అప్పటివరకు ఆ శివలింగాన్ని కింద పెట్టవద్దని జాగ్రత్తగా చెప్పి దగ్గరలో ఉన్న నదికి సంధ్యావందనానికి వెళ్తాడు. ఆ తరువాత ఆ బాలుడు శివలింగం చాలా బరువుగా ఉందని మోయలేకపోవుతున్న అని శిలింగాన్ని నేలపైన పెడుతున్న అని గట్టిగ చెబుతూ నేలపై పెట్టి వెళ్ళిపోతాడు.

అప్పుడు పరుగు పరుగున వచ్చిన రావణుడు ఎంత ప్రయత్నించినా శివలింగం పైకి రాలేదు, అతని శరీరమంతా కూడా రక్తసిక్తమై గాయాల పాలైంది. ఆ సమయంలో రావణుడు చేసిన శివతాండవ స్తోత్రానికి ప్రసన్నుడైన శివుడు ప్రత్యేక్షమై అతని గాయాలకు వైద్యం చేసి ఆ శివలింగం ఇక కదలదని అందుకే రావణుడే ప్రతిరోజు అక్కడకి వచ్చి సేవించుకోవాల్సిందిగా ఉపదేశించి అక్కడే జ్యోతిర్లింగ రూపుడై వెలిసాడు.

రావణుడికి వైద్యం చేసినందుకు స్వామికి వైద్యనాథుడు అనే పేరు వచ్చినట్లుగా తెలియుచున్నది.

Exit mobile version