కొవ్వుని సులభంగా కరిగించే వంటింటి దినుసులు

0
1162

ఈ రోజుల్లో చాలా మంది అనారోగ్యకరమైన కేలరీలతో నిండిన జంక్ ఫుడ్ తింటున్నారు. చాలా మందికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం సాధ్యం కాదు. కాబట్టి, సౌకర్యవంతంగా లభించే ప్యాక్డ్ ఆహారం లేదా జంక్ ఫుడ్ తింటునారు. ఫలితంగా, అధిక కొవ్వు, లెక్క లేని కేలరీలు శరీరంలో చేరిపోతున్నాయి. పొట్ట దగ్గర కొవ్వు(బెల్లీ ఫ్యాట్) అనేది ఒక సౌందర్య సమస్య మాత్రమే కాదు,ఇది ఒక ఆరోగ్య సమస్యగా మారింది. కొవ్వు, అధిక బరువు మరియు ఊబకాయం దీర్ఘకాలంలో చాలా హానికరం.

Easy Home remedies to reduce fatవీటి వల్ల పరిస్థితులు క్లిష్టంగా మారే అవకాశం ఎక్కువ. ఇది గణనీయంగా వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే మన వంటింట్లోనే వాడే కొన్ని పదార్థాలు కొవ్వుని కరిగిస్తాయి వాటిలో ముఖమైనవి….

వేడి నీరు: ఉదయం లేవగానే 2 గ్లాసుల వేడినీరు త్రాగటం వలన ఒంటిలో ఉండే మలినాలు,కొవ్వు కరిగిపోతుంది.

Easy Home remedies to reduce fatజీలకర్ర : జీలకర్ర కొవ్వుని కరిగించటం లో ముఖ్యమైనది. గ్లాసెడు నీటిలో రెండు చెంచాల జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వడగట్టి తాగేయండి.ఇలా చేస్తే అనవసరంగా కూరుకు పోయిన కొవ్వు కరుగుతుంది.

Easy Home remedies to reduce fatతేనె : మనం తినే ఆహారంలో చెక్కర బదులుగా తేనె ను వాడండి. ఇది ఆరోగ్యానికి చాల మంచిది.

Easy Home remedies to reduce fatఅవిసె గింజలు: అవిసె గింజలు తినడం వలన పొట్ట చుట్టూ ఉండే ఫ్యాటీ ఆమ్లాలు కరుగుతాయి.

Easy Home remedies to reduce fatగ్రీన్ టీ: గ్రీన్ టీ లో కేట్చిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పొట్ట దగ్గర ఉన్న కొవ్వును కరిగించడానికి బాగా పని చేస్తాయి. అందువల్ల ఎక్కువగా గ్రీన్ టీ తాగుతూ ఉండాలి.

Easy Home remedies to reduce fat

అల్లం: పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో అల్లం బాగా పని చేస్తుంది. దీన్ని మీరు రోజూ తినే ఆహారంలో ఉండేలా చూసుకోండి.

Easy Home remedies to reduce fatదాల్చినచెక్క: పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఇది బాగా పని చేస్తుంది. ఈ విషయం పలు పరిశోధనల్లో వెల్లడైంది. కొద్దిపాటి వేడి నీటిలో తేనె, దాల్చిన చెక్కను కలుపుకుని తాగితే ఉదర ప్రాంతంలో ఉంటే ఫ్యాట్ కరిగిపోతుంది.

Easy Home remedies to reduce fatవీటితో పాటు కొలస్ట్రాల్ ఉండే ఆహారాన్ని తగ్గించాలి. స్కిప్పింగ్ (తాడు ఆట) ఆడటం మూలంగా మన ఒంట్లో కొవ్వు త్వరగా కరిగిపోతుంది. జంక్ ఫుడ్ తినడం తగ్గించుకుంటే మంచిది. దానితో పాటు ప్రతిరోజు కనీసం అరగంట సమయం వ్యాయామం లేదా యోగ వంటి వాటికీ కచ్చితంగా కేటాయించాలి. రాత్రి పూట త్వరగా భోజనం చేయాలి. భోజనం చేసిన వెంటనే నిద్ర పోకూడదు. అన్నానికి బదులుగా రాత్రి బోజనమ్లో రోటి,పుల్కా లాంటివి తినటం మంచిది. అన్నింటికీ మించి కచ్చితంగా బరువు తగ్గాలని సంకల్పంతో ఉండాలి. ఉదాహరణకి సినీ నటి విద్యుల్లేఖ కేవలం లాక్ డౌన్ కాలంలోనే 20 కిలోల బరువుని తగ్గించుకున్నారు.

SHARE