పైల్స్ సమస్యను నివారించే సులువైన పద్దతులు

ఇటీవల చాలామంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తీసుకోకపోవడం, ఎక్కువ సేపు ఒకేచోట కదలకుండా కూర్చోవడం, బరువు అధికంగా ఉండడం మొదలైన కారణాల వల్ల ఈ ఫైల్స్ వస్తూ ఉంటాయి. తీవ్రమైన మలబద్ధకంతో మల విసర్జన చేస్తున్నప్పుడు మలద్వారం వద్ద రక్తనాళాలు ఉబ్బిపోయి చిట్లుతాయి.

Piles Problemమలంతో పాటు రక్తం కూడా కలిసి బయటకు పడుతుంది. ఈ సమస్యని అర్షమొలలు లేదా మొలవ్యాధి అని అంటారు. ఈ సమస్య ఒకసారి వచ్చిందంటే మల విసర్జన సాఫీగా జరుగదు. ఆ ప్రదేశంలో తీవ్రమైన నొప్పి, మంట, రక్తస్రావం ఉంటాయి. ఈ సమస్య తీవ్రమైతే ఆపరేషన్ చేసి వాటిని తీసేస్తుంటారు. దానికంటే వాటిని ఇంట్లోనే తగ్గించుకోవడం మంచిది.

Piles Problemమన వంటగదికి మించిన హాస్పిటల్ లేదని ఆయుర్వేద వైద్యులు చెబుతూనే ఉంటారు. కాకపోతే ఇంట్లో ఉండే ఎన్నో పదార్థాలు ఏ సమస్యకు ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇంట్లోనే సులువుగా లభించే కొన్ని పదార్థాలతో పైల్స్ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. ఇది స్వయంగా ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా వారి చేత చెప్పబడిన హోమ్ రెమిడి. మరి రెమడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాసు ఆవు పాలను తీసుకోవాలి. ఈ పాలు వేడిచేసి చల్లార్చిన సరే లేదా పచ్చిపాలు తీసుకున్న సరే. ఒక నిమ్మకాయ తీసుకొని సగానికి కట్ చేసి ఈ పాలలో రసాన్ని మొత్తం పిండాలి. తర్వాత ఒక స్పూన్ ని తీసుకొని బాగా కలిపి వెంటనే తాగేయండి. నిమ్మరసాన్ని పాలల్లో పిండిని వెంటనే పాలు విరిగి పోకముందే తగేయాలి అప్పుడే ఇది చాలా బాగా పనిచేస్తుంది.

Piles Problemదీన్ని పొద్దున్నే పరగడుపున ఖాళీ కడుపుతో చేయవలసి ఉంటుంది. 7 రోజులు ఈ ప్రయోగాన్ని చేయవలసి ఉంటుంది. ఇలా చేయడం వలన రక్తంతో లేదా రక్తం లేకుండా వచ్చే పైల్స్ సమస్యలన్నీ దాదాపుగా నయం అవుతాయి. మొలల సమస్యకు నిమ్మకాయ మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం నిమ్మకాయలో ఉండే సిట్రస్ మలాన్ని మెత్తగా చేసి మల ద్వారానికి సంబంధించిన అన్ని రోగాలను నయం చేస్తుంది.

Piles Problemఅంతేకాదు పాలు, నిమ్మకాయ మలబద్ధకం సమస్యను తగ్గించి, మలవిసర్జనను సులభతరం చేస్తాయి. అందుకే పాలు, నిమ్మకాయ కాంబినేషన్ పైల్స్ సమస్యకు ఒక వరం లాగా పనిచేస్తుంది. అయితే ఈ చిట్కా పాటిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్య నుండి త్వరిత ఉపశమనం ఉంటుంది. పైల్స్ సమస్య ఉన్నా లేకపోయినా ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలి.

Piles Problemమరీ ముఖ్యంగా ఈ రెమిడీ వాడుతున్న వాడుతున్నంత కాలం శరీరంలో నీటి కొరత తగ్గకుండా చూసుకోవాలి. భోజనం చేసే గంట ముందు నుండి తిన్న గంట తర్వాత వరకూ నీటిని త్రాగ కూడదు. ఇది మినహాయించి రోజూ కొద్ది కొద్దిగా నీటిని తాగవచ్చు. నీళ్లు ఎక్కువగా తాగడం వలన పైల్స్ సమస్య మాత్రమే కాదు, ఏ ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పైల్స్ సమస్యలు దూరం చేయడానికి ఫాస్ట్ ఫుడ్స్ మరియు డీప్ ఫ్రై చేసిన పదార్థాలు అలాగే స్పైసీ కారం మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. ఇవి మన కడుపులో వేడిని మంటలను ఉత్పత్తి చేస్తాయి ఈ కారణం చేత పైల్స్ సమస్య రావడం జరుగుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR