సన్ బర్న్ తో కమిలిన చర్మానికి సింపుల్ హోం రెమిడీస్

ఏ కాలంలో అయినా చర్మానికి రక్షణ కల్పించడం చాలా ముఖ్యం, వేసివి కాలం వచ్చేసింది. ఈ వేసవికాలంలో చర్మం మీద డైరెక్ట్ గా uv కిరణాలు, మరియు దుమ్మ ధూళి వల్ల చర్మానికి హాని కలుగుతుంది. అంతే కాదు వేసవిలో ఎండల వల్ల వచ్చే చమటతో కూడా చర్మం పాడవుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా చర్మం మీద తగినంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వేసవిలో వేడి చర్మాన్ని ప్రభావితం చేస్తుంది.

Home Remedies To Remove Sun Tanకాబట్టి ఎండలోకి వెళ్లేటప్పుడే కాదు.. ఏ సమయంలో అయినా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మంచి పద్ధతి. దీనివల్ల యూవీ కిరణాల బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అయితే ఎంత ప్రయత్నించినా మన శరీరంపై సన్ బర్న్, ట్యాన్ వంటివి కనిపిస్తూనే ఉంటాయి. వీటి కోసం కెమికల్స్ ఉపయోగించడం కాకుండా ఇంట్లోనే కొన్ని పదార్థాలను ఉపయోగించి ట్యాన్ తొలగించుకునే వీలుంది.

Home Remedies To Remove Sun Tanపెరుగుకి చర్మాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. అంతే కాదు ఇది ట్యాన్ ని కూడా తొలగిస్తుంది. అందుకే దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ట్యాన్ వల్ల నల్లబడిన భాగాల్లో రాసి అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

Home Remedies To Remove Sun Tanకలబంద మన శరీరంలోని మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. పిగ్మంటేషన్ ని తగ్గించేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. అందుకే దీన్ని రెగ్యులర్ గా రాసుకుంటూ ఉండడం వల్ల మీ చర్మం డీటాన్ కావడం మాత్రమే కాదు, ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.

Home Remedies To Remove Sun Tanసొరకాయ రసం కూడా నలుపుదనాన్ని పోగొడుతుంది. దీనికోసం ఎండలోకి వెళ్లి రాగానే ట్యాన్ బారిన పడిన ప్రాంతంలో ఈ రసాన్ని రుద్ది పది నిమిషాలు ఉంచుకొని కడిగేసుకోవాలి. మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Home Remedies To Remove Sun Tanకూరగాయలు కూడా ట్యాన్ బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. ఇందులో ముఖ్యంగా కీర ముక్కలు, క్యాబేజీ ఆకులను వాడవచ్చు. ఇందుకోసం ఈ రెండింటినీ ఫ్రిజ్ లో ఉంచి వాడడం వల్ల మరింత ఫలితం ఉంటుంది. చల్లని క్యాబేజీ ఆకులను నల్లగా మారిన చర్మంపై కప్పి పావు గంట పాటు ఉంచి ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కీరా గుజ్జును కూడా నల్లబడిన ప్రాంతంలో రుద్ది పావుగంట తర్వాత కడిగేయడం వల్ల నలుపు తొలగిపోతుంది.

Home Remedies To Remove Sun Tanగంధం దాని ఔషద గుణాలతో అతి ప్రాచీన కాలం నుండి ప్రాచుర్యం పొందింది. గంధం పొడి లేదా పేస్ట్ మలినాలు మరియు మృత కణాలను తొలగించటానికి ఒక సహజమైన చర్మ ప్రక్షాళనగా పనిచేస్తుంది. మచ్చలు మరియు బొబ్బలను నయం చేయటంలో సహాయపడుతుంది. ఒక స్పూన్ గంధంలో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ మరియు కొబ్బరి నీరు కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

Home Remedies To Remove Sun Tanఎర్ర పప్పును చర్మ సంరక్షణలో ఉపయోగించవచ్చు. దీనివల్ల ట్యాన్ కూడా సులభంగా తొలగిపోతుంది. దీనికోసం టేబుల్ స్పూన్ పప్పును మిక్సీలో బరకగా పట్టి అందులో టొమాటో రసం కలబంద గుజ్జు కలిపి నల్లబడిన ప్రాంతం మొత్తం పట్టించాలి. అరగంట అలాగే ఉంచుకొని తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల రెండుమూడు రోజుల్లో ప్రభావం కనిపిస్తుంది.

Home Remedies To Remove Sun Tanపప్పుతో కలిపి కాకుండా కేవలం టొమాటో రసాన్ని రుద్దినా మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం టొమాటో రసాన్ని ట్యాన్ బారిన పడిన ప్రాంతంలో రుద్దాలి. లేదంటే టొమాటోని ముక్కలుగా చేసుకొని ఆ ముక్కతో నల్లబడిన ప్రాంతాన్ని మసాజ్ చేసుకుంటే మరీ మంచిది. ఇలా పది నిమిషాల పాటు రుద్దుకొని ఆ తర్వాత ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. ఆపై కడిగేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR