వర్క్ ఫ్రమ్ హోమ్ తో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దాదాపు ఎడాదిన్నర నుంచి పలు రంగాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఇప్పటికీ పలు సంస్థలు నష్టాల నుంచి తేరుకోలేకపోతున్నాయి. అయితే.. కరోనా ప్రారంభమైన నాటినుంచి వర్క్‌ ఫ్రమ్ హోమ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు పెద్ద సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు.. అన్నీ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే.

స్ట్రెస్చాలా కంపెనీల ఉద్యోగులు గతేడాది మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే రోజూ ఇంట్లోనే ఉంటూ, ఉద్యోగం చేస్తూ.. కాలు బయటకు పెట్టకుండా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ స్ట్రెస్ తగ్గించడానికి, ఆరోగ్యానికి మేలు చేసే చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెక్‌‌ పిల్లో :

స్ట్రెస్చైర్‌‌‌‌లో ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల మెడ పట్టేసినట్లుగా ఉంటుంది. ఇలాంటప్పుడు మెడనొప్పి తగ్గాలంటే నెక్‌‌పిల్లో వాడొచ్చు. కుర్చీలో కూర్చుని నెక్‌‌పిల్లో వాడితే రిలాక్సింగ్‌‌గా ఉంటుంది. తలకు, మెడకు ఎలాంటి ఒత్తిడి కలిగించకుండా మెత్తగా ఉంటుంది ఈ పిల్లో.

బబుల్‌‌ డోర్‌‌‌‌మ్యాట్‌‌ :

స్ట్రెస్రోజంతా ఇంట్లోనే ఉండటం వల్ల కూడా అలసటగా అనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బయటికెళ్లి టైమ్‌‌ స్పెండ్‌‌ చేసే అవకాశం లేదు. ఇలాంటప్పుడు ఇంట్లోనే కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వాటిలో ‘బబుల్‌‌ డోర్‌‌‌‌మ్యాట్‌‌’ ఒకటి. రెగ్యులర్‌‌‌‌ డోర్‌‌‌‌ మ్యాట్స్‌‌కు బదులు ఇవి వాడితే చాలా మంచిది. ఈ డోర్‌‌‌‌ మ్యాట్స్‌‌పైన బబుల్స్‌‌ లాంటివి ఉంటాయి. వీటిపైన పాదాలు ఉంచితే, మెల్లిగా ఒత్తిడి తగ్గించి పాదాలు రిలాక్స్ అయ్యేలా చేస్తాయి.

జెల్‌‌ ఐ మాస్క్‌‌ :

స్ట్రెస్ఎక్కువసేపు ల్యాప్‌‌టాప్‌‌, కంప్యూటర్‌‌‌‌ వంటి డిజిటల్‌‌ స్క్రీన్స్‌‌పై పనిచేయడం వల్ల కళ్లు చాలా అలసిపోతాయి. దీనివల్ల తలనొప్పి, యాంగ్జైటీ, నిద్రలేమి వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా రిలాక్సింగ్‌‌ జెల్‌‌ ఐ మాస్క్‌‌ వాడాలి. కళ్లపై ఈ మాస్క్‌‌ పెట్టుకుంటే చాలా కూల్‌‌గా, రిలాక్సింగ్‌‌గా అనిపిస్తుంది.

ఫుట్‌‌ రెస్ట్‌‌ స్టూల్‌‌ :

స్ట్రెస్చైర్‌‌‌‌ లేదా సోఫాలో కూర్చున్నప్పుడు పాదాలు కూడా రిలాక్స్ అవ్వాలంటే ఫుట్‌‌ రెస్ట్‌‌ స్టూల్ వాడాలి. బీన్‌‌ బ్యాగ్స్‌‌లో ఇలాంటివి దొరుకుతున్నాయి. ఎక్కువసేపు పనిచేసి అలసిపోయినప్పుడు వీటిపై కాళ్లు చాపి రిలాక్స్‌‌ అవ్వొచ్చు.

ఇక ఆహారం విషయానికి వస్తే : 

వేపిన బఠాణీలు :

స్ట్రెస్బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. ఈ స్నాక్ త్వరగా పాడవ్వదు. పైగా మన బాడీకి అవసరమైన అమైనో యాసిడ్స్ బఠాణీల్లో ఉంటాయి. పైగా వీటిలో కేలరీలు తక్కువ. అందువల్ల వేపిన బఠాణీలు రోజుకో అరకప్పు తింటే మంచిదే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మధ్యమధ్యలో వీటిని తింటే రిలాక్స్ అవ్వడమే కాదు ఆకలి తీర్చుకోవచ్చు కూడా.

డ్రైఫ్రూట్స్, పప్పులు (Nuts) :

స్ట్రెస్వర్క్ ఫ్రమ్ హోంలో ఆకలి తీర్చే మరో హెల్తీ ఫుడ్ పప్పులు. అంటే డ్రై నట్స్ అన్నమాట. బాదం, జీడిపప్పు, పిస్తా, వేరుశనగ గింజలు వంటివి ఆకలిని తగ్గిస్తాయి. చక్కటి ఎనర్జీ ఇస్తాయి. ఇంటి దగ్గర పనిచేసేవారు డ్రైఫ్రూట్స్, పప్పుల వంటివి తినడం తేలికగా ఉంటుంది. పని ఆపకుండా తినేందుకు ఇవి వీలుకల్పిస్తాయి. ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, రెండ మూడు జీడిపప్పు గింజలు, వాల్ నట్స్, ఫిగ్స్ వంటివి మధ్యమధ్యలో తింటే ఆకలికి చెక్ పెట్టినట్లవుతుంది. పైగా ఇవి బాడీలో చెడు కొవ్వును కూడా తగ్గిస్తాయి.

డార్క్ చాక్లెట్లు :

స్ట్రెస్తక్కువ ఫ్యాట్ ఉండే మిల్క్, ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పని చేసీ చేసీ అలసటగా ఫీలైతే ఓ డార్క్ చాకొలెట్ తింటే చాలు వెంటనే మూడ్ మారుతుంది. ఈ చాక్లెట్లు రోజుకొకటి తింటే పర్వాలేదు ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఓట్స్ :

స్ట్రెస్ఈమధ్య ఎక్కువ మంది ఓట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఓట్స్, బార్లీ ఫ్లేక్స్‌కి వీట్, రాగి ఫ్లేక్స్ కలిపి తింటే మంచి కాంబినేషన్ అవుతుంది. ఇవి మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పుకోవచ్చు. ఎనర్జీ పెరగాలంటే మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR