శరీరాన్ని డీ హైడ్రేషన్ నుండి కాపాడుకోవాలంటే ఇవి తప్పక పాటించండి

వేసవిలో శరీరం డీ హైడ్రేషన్ కి గురి కావడం సర్వ సాధారణం. అలా జరగకుండా ఉండాలంటే, రోజుకు రెండు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. దాహం అనిపించినప్పుడల్లా నీరు తాగుతూ ఉండాలి. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, తులసి, పుదీనా లాంటి ప్రత్యేకమైన ఆకులు నీటిలో వేయడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్‌లు, ఖనిజాలు నీటిని మరింత శక్తివంతంగా తయారుచేస్తాయి. ఇవి డీహైడ్రేషన్ నుంచి కాపాడటమే కాకుండా శరీరంలోని మలినాలనూ తొలగిస్తాయి.

Dehydration Prevention Tipsఅలాగే వేసవిలో దొరికే పండ్లు తీసుకోవడం వల్ల కొంతవరకు డీ హైడ్రేషన్ నుండి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు దొరికే పుచ్చకాయ, కర్బూజ, వంటివి తినడం వల్ల దాహాన్ని తీర్చుకోవచ్చు. డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. కీరదోస కాయను అధికంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది దాహం తీరుస్తుంది. కీరదోసలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో తేమ శాతం పెరిగి వేడి తగ్గుతుంది.

  • వేసవిలో డీ హైడ్రేషన్ కి గురవకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు:
  • ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి.
  • ఎండలోకి తప్పనిసారిగా వెళ్లేవారు సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ వాడాలి.
  • పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.
  • రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి.
  • ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. పలుచని బట్టలు వేసుకోవాలి.
  • వేసవిలో భయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి
  • వేసవికాలంలో ఆల్కహాల్, సిగరెట్, కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండండి.
  • డోకులు, వాంతులు, అలసట, తలనొప్పి వంటివి రాకుండా చూసుకోవాలి.

Dehydration Prevention Tipsరోజుకు ఐదారు సార్ల కంటే ఎక్కువ నీళ్ల విరేచనాలు కావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడపునొప్పి, 101 డిగ్రీల ఫారెన్‌హీట్‌ కంటే ఎక్కువగా జ్వరం ఉండడం, ఐదారు గంటలుగా మూత్రవిసర్జన నిలిచిపోవడం, చర్మం పొడిబారి పోవడం, ఏడ్చినా కన్నీరు రాకపోవడం వంటివన్నీ ఒంట్లో నీరు తగ్గిపోయిందన్న దానికి నిదర్శనం. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యుడిని వెంటనే సంప్రదించాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR