చిగుళ్ల వాపు తగ్గించేందుకు సులువైన మార్గాలు

సరైన ఓరల్ హైజీన్ లేకపొతే చిగురు దగ్గర ప్లేక్ ఏర్పడుతుంది. అది నెమ్మదిగా జింజివైటిస్ గా మారుతుంది. దానివల్ల చిగుళ్ళ వాపు, రక్తం కారడం వంటి సమస్యలొస్తాయి. ఈ జింజివైటిస్ ని వెంటనే ట్రీట్ చేయకపోతే ఇన్ ఫెక్షన్ పెరిగి పెరియోడాంటైటిస్ గా మారుతుంది. ఒక్కోసారి లుకేమియా, హీమోఫీలియా ఉన్నా కూడా చిగుళ్ళనించి రక్తం వస్తుంది. విటమిన్ సీ, విటమిన్ కే లోపాలున్నా, హార్మోనల్ తేడాలున్నా, కట్టుడుపళ్ళున్నా కూడా ఈ సమస్య వస్తుంది.

reduce Gums Swellingచిగుళ్ల వాపుకి కారణాలు:

పోషకాల లోపం:

reduce Gums Swellingఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలు అవసరం అవుతాయి. శరీరంలో విటమిన్ బి12, విటమిన్ సి లోపిస్తే చిగుళ్ళు వాపులు వాస్తాయి. చిగుళ్ళు మరయు దంత సంరక్షణలో విటమిన్ సి ప్రధాన పాత్ర పోసిస్తుంది. విటమిన్ బి12 దంతక్షయాన్ని మరియు చిగుళ్ళ వాపును దూరం చేస్తుంది.

ప్రెగ్నెన్సీ :

reduce Gums Swellingప్రెగ్నెన్సీ సమయంలో చిగుళ్ళ వాపులు సర్వసాధారణం ఎందుకంటే శరీరంలో హార్మోన్ల అసమతుల్యతలు, శరీరంలో హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల చిగుళ్ళకు రక్తసరఫరా క్రమంగా పెరగుతుంది. దీని కారనంగా చిగుళ్ళలో చీకాకు కలుగుతుంది. చిగుళ్ళ వాపుకు దారితీస్తుంది. శరీరంలో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల చిగుళ్ళ వాపుకు కారణం అయ్యే ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిసామర్థ్యం తగ్గుతుంది. ఆ కారణంగా చిగుళ్ళ సమస్యలు, చిగుళ్ళ వాపు వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఇన్ఫెక్షన్స్:

కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మరియు వైరస్ వల్ల చిగుళ్ళలో వాపు వస్తుంది. చిగుళ్ళలో వాపుకు కారణం హెర్పస్ మరియు థ్రష్ అనే ఇన్ఫెక్షన్స్.

చిగుళ్ళ వాపు లక్షణాలు :

  • చిగుళ్ళ నుండి రక్తస్రావం
  • నొప్పి
  • నోటి దుర్వాసన
  • చిగుళ్ళు ఎర్రగ మరియు వాచి ఉండటం
  • దంతాల మధ్య సందులు ఏర్పడటం

చిగుళ్ళ వాపుకు చికిత్స:

రెండు వారాలు మించి చిగుళ్ళలో వాపు ఉంటే వెంటనే దంతవైద్యులను సంప్రదించాలి. వైద్యులు చిగుళ్ళ వాపుకు గల కారణాలను గుర్తించి , నోటి పరిశుభ్రత కు వాడే లిక్విడ్స్ సూచింపవచ్చు. ఇవి చిగుళ్ళవాపును తగ్గించడంతో పాటు, పాచిని కూడా తగ్గిస్తాయి.

reduce Gums Swellingచిగుళ్ళ వాపు తీవ్రంగా ఉన్నప్పుడు శస్త్రచికిత్సను సిఫారస్సు చేస్తారు. సర్జరీలో స్కాలింగ్ మరియు రూట్ ప్లానింగ్ వంటివి ఉంటాయి. ఈ ప్రక్రియలో దంతవైద్యుడు వ్యాధిగ్రస్తులైన వారిలో చిగుళ్ళుకు సంబంధించిన వ్యాధిని దూరం చేస్తారు, దంతాలపై పేరుకున్న గార మరియు దంతాలపై పాచీ, దంతాల మొదళ్ళలో ఏర్పడ్డ పాచిని తొలగించి మిగిలిన చిగుళ్ళు నయం అయ్యేలా చికిత్స చేస్తారు.

చిగుళ్ళవాపుకు హోం రెమెడీస్:

కొన్ని రకాల హోం రెమెడీస్ చిగుళ్ళవాపు లక్షణాలను తొలగించి నొప్పి నుండి ఉపశమనం కలగిస్తాయి.

సాల్ట్ వాటర్ తో నోటి పరిశుభ్రత:

reduce Gums Swellingపరిశోధన ప్రకారం, సాల్ట్ వాటర్ చిగుళ్ళ వాపును తగ్గించడానికి, నయం చేసే గుణాన్ని కలిగిఉంటుంది. ఎందుకంటే ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల చిగుళ్ళ వాపుకు కారణమయ్యే నోట్లో బ్యాక్టీరియా పెరగడకుండా మరియు చిగుళ్ళలో ఉన్న బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.

టర్మరిక్ జెల్ :

reduce Gums Swellingనేషనల్ జర్నల్ ఆఫ్ మాక్సిలోఫేసియల్ సర్జరీ పరిశోధనల్లో వెల్లడించిన ప్రకారం టర్మరిక్ జెల్ నోట్లోని పాచిని మరియు చిగుళ్ళ వాపును నివారిస్తుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి.

కలబంద:

reduce Gums Swellingజర్నల్ ఆఫ్ క్లీనికల్ మరియు ఎక్సిపిరిమెంటల్ టెంటిస్ట్రీ పరిశోధనల ప్రకారం చిగుళ్ళ వాపు చికిత్సలో అలోవెర మరో ప్రభావంతమైన హోం రెమెడీ.

కోల్డ్ మరియు వార్మ వాటర్ కంప్రెసర్:

reduce Gums Swellingచల్లని మరియు వేడి నీటి కాపడం వల్ల చిగుళ్ళ వాపు, నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

ప్రత్యేకమైన నూనెలు:

యూరప్ జర్నల్ ఆఫ్ డెంటిస్ట్రీ పరిశోధన ప్రకారం పుదీనా నూనె, థైమ్ ఆయిల్, టీట్రీ ఆయిల్స్ నోటి వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములను నివారించడంలో ప్రభావితంగా పనిచేస్తాయని కనుగొన్నారు.

టీ బ్యాగ్స్:

reduce Gums Swellingహైబిస్కస్ టీ, గ్రీన్ టీ లో ఆస్ట్రిజెంట్ ట్యానిన్స్ ఉంటాయి. అలాగే అల్లం టీ మరియు చామంతి టీలలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. టీలలో ఉండే టానిన్స్ చిగుళ్ళ వాపుకు సంబంధించిన చీకాకును నివారిస్తుంది.

చిగుళ్ళవాపుకు మరికొన్ని నివారణ చర్యలు:

  • రోజుకు రెండు సార్లు బ్రష్ చేయండి.
  • రోజూ పాచిని తొలగించండి.
  • బ్రష్ చేసిన తర్వాత , పాచిని తొలగించిన తర్వాత దంతాల్లో ఇరుకున్న , దాగున్న ఆహార పదార్థాలను మౌత్ వాష్ తో తొలగించండి.
  • స్వీట్స్ తక్కువగా తినండి.
  • దంతవైద్యులను తరచూ కలుస్తుండండి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR