కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందే సులువైన మార్గాలు

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే సమస్య కడుపునొప్పి. కడుపునొప్పి రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వికారం, గ్యాస్‌, అసిడిటీ రావడంతోపాటు జీర్ణం కాని ఆహారాలను తినడం, ఫుడ్‌ పాయిజనింగ్‌ అవడం, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం.. వంటి అనేక కారణాల వల్ల కడుపు నొప్పి వస్తుంటుంది. కడుపునొప్పి అంటే అంతా తేలికగా తీసుకుంటారు కానీ నిజానికి కడుపునొప్పి వస్తే ఎవరో పొట్టలో గట్టిగా గుద్దినట్లు లేదా ఒక కత్తి పెట్టి మెలితిప్పినట్లు అన్పిస్తుంది. ఒక్కోసారి నొప్పి భరించలేని స్థాయిలో ఉండొచ్చు. ఆ సమయంలో ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ మింగుతూ ఉంటారు. దాని వలన తక్షణ ఉపశమనం లభిస్తుందేమో కానీ తరువాత సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు. అందులోనూ ఎక్కువ సమయం మందుల మీద బ్రతకలేము అక్కడే ఇంటి చిట్కాలు తెరపైకి వస్తాయి. మన వంటింట్లో దొరికే ఔషధాలతో యిట్టె కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కడుపు నొప్పికడుపునొప్పికి టోస్ట్ చాలా మంచిదని అందరికీ తెలుసు. కానీ మాడిపోయిన టోస్ట్ మరింత మెరుగైన చిట్కా. కడుపులో ఇబ్బందిపెట్టే విషపదార్థాలను మాడిపోయిన టోస్ట్ లోని మసి పీల్చుకుంటుంది. కడుపునొప్పికి వెంటనే తగ్గించేస్తుంది. ఒకవేళ మాడిపోయిన టోస్ట్ ని అలా తినలేకపోతే దానిపై జెల్లీ రాసుకుని తినవచ్చు.

కడుపు నొప్పివంటింట్లో అందుబాటులో ఉండే అద్భుతమైన ఔషధం అల్లం. కడుపు నొప్పిని తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో అల్లం కొద్దిగా వేసి బాగా మరిగించాలి. ఆ కషాయాన్ని తాగితే కడుపునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. లేదా నేరుగా రెండు టీస్పూన్ల అల్లం రసంను కూడా సేవించవచ్చు. దీంతోనూ సమస్య తగ్గుతుంది. తక్షణ ఉపశమనం లభిస్తుంది.

కడుపు నొప్పిసాధారణంగా అజీర్ణం కారణంగా కడుపునొప్పి వస్తూ ఉంటుంది. అందుకని పుదీనా ఆకులను కొన్నింటిని తీసుకుని నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతుండాలి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాస్‌ నీటిలో ఒక టీస్పూన్‌ నిమ్మరసం, ఒక టీస్పూన్‌ బేకింగ్‌ సోడాలను కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. గ్యాస్‌ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

కడుపు నొప్పిఆపిల్ సిడర్ వెనిగర్, ఎక్కిళ్ళు మరియు గొంతునొప్పికి మాత్రమే కాక కడుపునొప్పికి కూడా మంచి చిట్కాలా పనిచేస్తుంది. ఒక చెంచా యాపిల్ సిడర్ వెనిగర్ ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి ఒక చెంచా తేనె కూడా జతచేయండి. దీన్ని తాగండి, ఇది మీ పాడైన కడుపును, అజీర్తిని తగ్గించి, నొప్పిని కూడా తగ్గించవచ్చు.

కడుపు నొప్పిదాల్చిన చెక్క పొడిని నీటిలో వేసి మరిగించి అనంతరం నీటిని వడకట్టి ఆ నీరు వేడిగా ఉండగానే తాగేయాలి. దీని వల్ల కూడా కడుపునొప్పి, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. లేదా భోజనం చేసిన తరువాత ఒకటి, రెండు లవంగాలను నోట్లో వేసుకుని నములుతూ ఆ రసాన్ని మింగాలి. లవంగాలు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. దాంతో కడుపు నొప్పి తగ్గుతుంది.

కడుపు నొప్పికడుపునొప్పిగా ఉన్నప్పుడు, ఏ పాల ఉత్పత్తి తినాలనిపించకపోవచ్చు. కానీ పెరుగు కడుపునొప్పికి చాలా మంచిది. ఒక కప్పు పెరుగు తింటే చాలు కడుపునొప్పి నుండి ఉపశమనం పొందొచ్చు. పెరుగులో ఉండే ప్రోబయాటిక్ లక్షణాలు, బ్యాక్టీరియా మీ శరీర రోగనిరోధకశక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వులేని సాధారణ పెరుగును ఏ ఫ్లేవర్ లేకుండా తీసుకుంటే కడుపునొప్పికి చక్కగా పని చేస్తుంది.

కడుపు నొప్పిదగ్గు, గొంతు గరగర ఉన్నప్పుడు వాముని తీసుకుంటూ ఉంటాం. కానీ కడుపునొప్పికి కూడా వాము అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చెంచా వాము విత్తనాలను ఉప్పు లేదా పంచదారతో కలిపి గ్లాసుడు గోరువెచ్చని నీరుతో మింగేయండి. రెండు నిమిషాలలోనే మీ ఉబ్బరం తగ్గి, కడుపు నొప్పి తగ్గటం మొదలవుతుంది. జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలా కాచి తాగుతుంటే గ్యాస్‌, అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి.

కడుపు నొప్పిఆల్కా సెట్జర్ వంటిదే బేకింగ్ సోడా, ఇది హార్ట్ బర్న్ ను మరియు అజీర్తిని నివారిస్తుంది. కడుపు నొప్పి నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసి త్రాగడం వల్ల వెంటనే మంచి ఫలితం ఉంటుంది. అంజీర్‌ పండ్లను తింటున్నా, కలబంద గుజ్జును సేవించినా, తులసి ఆకులను నమిలినా, కొబ్బరి నీళ్లు, అరటిపండ్లను తీసుకున్నా కడుపు నొప్పి, జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు.

కడుపు నొప్పికడుపు నొప్పిగా ఉన్న ప్రదేశంలో కొద్దిగా వేడి కలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చ. దానికోసం హీట్ ప్యాడ్ ఉపయోగించడం మంచిది. హీట్ ప్యాడ్ అందుబాటులో లేకపోయినట్లైతే కాటన్ వస్త్రం మరియు బియ్యం తీసుకోవాలి. ఒక కప్పు బియ్యంను పాన్ లో వేసి బాగా వేడి చేసి ఆ బియ్యంను కాటన్ క్లాత్ లో వేసి, నోటితో గాలిని ఊపుతూ నొప్పి ఉన్న ప్రదేశంలో వెచ్చవెచ్చగా వేడి పట్టించాలి. ఇలా చేయడం వల్ల కూడా కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR