ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారపదార్ధాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా ?

మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చాము అంటే అవి పాడవకుండా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెడతాము. అలాగే మనం తినే ఆహార పదార్థాలను, నీళ్లు, పాలు, పెరుగు వంటివి చెడిపోకుండా ఉండేందుకు, చల్లగా ఉండేందుకు ఫ్రిడ్జ్ లో పెడతాం. అయితే కొన్ని కూరగాయలు, ఆహార పదార్థాలు మరి కొన్నిటిని ఫ్రిడ్జ్ లో అస్సలు ఉంచకూడదు. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయలు:

eating refrigerated foods cause health problemsఒక్కోసారి మనం వంటకి సరిపోయే దానికన్నా ఎక్కువ మొత్తం లో ఉల్లిపాయలు కోయడం ద్వారా వాటిని మళ్ళీ వంట చేయడానికి ఉపయోగించాలని ఫ్రిడ్జ్ లో ఉంచుతాం. కానీ ఆ తరిగిన ఉల్లిపాయల వాసన ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహార పదార్థాల పైన ప్రభావం ఉంటుంది. ఇది అనారోగ్యాలకు దారి తీస్తుంది.

బంగాళదుంప:

eating refrigerated foods cause health problemsబంగాళాదుంపలను చల్లటి ప్రదేశం లో లేదా ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల అందులో చక్కెర శాతం ఎక్కువగా పెడుగుతుంది.దీనివల్ల కూర రుచి మారుతుంది. అందుచేత వీటిని వంటరూమ్ లొనే గాలి తగిలే స్థలంలో ఉంచుకోవడం మంచిది.

పచ్చళ్ళు:

eating refrigerated foods cause health problemsకాలానికి తగ్గట్లు పచ్చళ్ళు పెట్టుకుంటాం. ఇవి చెడిపోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పచ్చళ్ళు పెట్టడం ద్వారా ఆ చల్లదనానికి ఉరగాయ త్వరగా చెడిపోతుంది.

తేనె:

eating refrigerated foods cause health problemsఎన్ని సంవత్సరాలైన చెడిపోని ఆహార పదార్థం తేనె. దీనిని ఫ్రిడ్జ్ లో అసలు ఉంచకండి. దానివల్ల తేనె యొక్క రుచి మారుతుంది. తేనెని అల్మారాలో లేక ఇంట్లో భద్రమైన ప్రదేశం లో పెట్టుకోవాలి.

పుచ్చకాయలు:

eating refrigerated foods cause health problemsవేసవిలో చాలా వరకు చల్లగా ఉండేందుకు పుచ్చ కాయలు తింటాం. బయటకి వెళ్ళినపుడు రెండు మూడు తీసుకువచ్చి ఫ్రిడ్జ్ లో పెడతాం. పుచ్చకాయలని కొస్తే వాటిని ఒక బాక్స్ లేదా గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టండి. అలాగే కోయని పుచ్చకాయలు ఉంటే చల్లదనం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. కానీ కోసిన పుచ్చకాయను అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.

అరటి పండ్లు:

eating refrigerated foods cause health problemsఅరటి పండ్లని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అందులో ఉండే ఎంజైమ్స్ తగ్గిపోతాయి. దీనితో అరటి పండ్లు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అరటి పండ్లని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.

బ్రెడ్: 

eating refrigerated foods cause health problemsమనం బ్రెడ్ పాకెట్ ఓపెన్ చేసాక మిగిలిపోయినది ఫ్రిడ్జ్ లో పెడతాం. దీనివల్ల బ్రెడ్ గట్టి పడి తినలేని స్థితికి వస్తాయి అందువల్ల కవర్ మూసి పెట్టాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR