Home Health మందు తాగేటప్పుడు ఈ స్టఫ్ తింటే లివర్ పాడవదట!

మందు తాగేటప్పుడు ఈ స్టఫ్ తింటే లివర్ పాడవదట!

0
ఈ రోజుల్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, పార్టీ జరిగినా మందు తాగాల్సిందే. ఇక పెళ్లిళ్లు, రిసెప్షన్లు, బర్త్ డే పార్టీలు మందు లేకుండా పూర్తవవు. ఏ నలుగురు ఫ్రెండ్స్ కలిసినా మందు పార్టీలు అవుతూనే ఉంటాయి. ఇక మందు కొట్టే అలవాటు రోజు లేదు కానీ  అప్పుడప్పుడు పార్టీ లకి వెళ్ళినప్పుడు మాత్రమే  తాగుతాము అనే వాళ్ళు చాలామందే ఉంటారు.
ఎంత తాగినా మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ కొంతమంది ఎవరెంత చెప్పినా వినకుండా మద్యం సేవిస్తుంటారు. అప్పుడప్పుడు తాగినా ఆల్కహాల్ వల్ల లివర్ సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే అలాంటి బెంగ అవసరం లేకుండా హ్యాపీ గా మందు తాగేయొచ్చు అంటున్నారు పరిశోధకులు. ఒక చిన్న చిట్కా పాటిస్తే ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు. అదేమిటో ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం…
మందు కొట్టేటప్పుడు పక్కన స్టఫ్ పెట్టుకొని తాగుతుంటారు. దానిలోకి చిప్స్, ఫ్రైస్, పకోడీ, పికిల్ లాంటివి వాడుతుంటారు. అయితే స్టఫ్ గా పాచి మిర్చి నంజుకోవడం వలన కాలేయం కి ఎలాంటి సమస్యలు రావని సలహా ఇస్తున్నారు పరిశోధకులు. ఎంతో మందిపై  అధ్యయనాలు  చేసిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు.ఆఫ్రికన్ ట్రైబల్స్ పై  చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది.
ఆఫ్రికాలోని ప్రజలు మందు తాగే సమయంలో సైడ్ డిష్‌గా గ్రీన్ చిల్లీస్‌ని వాడుతుంటారు. వీరిని పరీక్షించగా వారికి ఎలాంటి లివర్ సంబంధిత సమస్యలు లేవని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి. అదే పచ్చిమిర్చి తీసుకోకుండా తాగిన  వారిలో మాత్రం కాలేయ సమస్యలు ఎక్కువగా కనిపించాయి. విశాఖ ఆంధ్రా వర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లు సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో మన దేశీయ పచ్చిమిర్చిలో కూడా ఎన్నో రసాయనాలు ఉన్నాయని తేలింది.
మిర్చిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి లివర్ పాడవకుండా చేస్తాయి. దీంతో లివర్ కి ఎలాంటి  సమస్య రాదు. కాబట్టి.. తాగే సమయంలో కాసిన్ని పచ్చిమిర్చి ముక్కలు నంజుకోండి  అంటూ సలహా ఇస్తున్నారు. అయితే…ఇదే అదనుగా తీసుకుని  ఇక మా ఆరోగ్యానికి  ప్రమాదం  లేదంటూ సీసాలకి  సీసాలు మందు. కేజీల కొద్దీ పచ్చిమిర్చి తినేయవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు . ఇది కేవలం అప్పుడప్పుడు మోతాదు మించి తాగకుండా ఉన్నప్పుడు మాత్రమే చేయాలనీ చెబుతున్నారు.
ఇక మద్యం సేవించే సమయంలో మంచింగ్‌గా కొన్ని ఆహారాలను తీసుకుంటే అనారోగ్యం పాలు కాక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. మందు తాగేటప్పుడు మంచింగ్ కోసం ఏది పడితే అది తినేయడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. చాలా కొద్దిమంది మాత్రమే కొన్ని ప్రత్యేకమైన మంచింగ్ తీసుకుంటుంటారు. అయితే మీరు తీసుకునే మంచింగ్ కారణంగానే హ్యాంగోవర్ వస్తుందన్న విషయం తెలుసుకోరు.
మద్యపానంలో మంచింగ్ గా కొన్ని ఆహారాలను అస్సలు ముట్టుకోవద్దు. మరీ ముఖ్యంగా వైన్ తాగేవాళ్ళు కొన్ని ఆహారాలను తీసుకోకపోవడమే మంచిది. వైన్ సేవించే కొంతమంది చాక్లెట్‌ను మంచింగ్‌గా తీసుకుంటారు. కానీ అది సరైన కాంబినేషన్ కాదు. చాక్లెట్ కారణంగా కడుపులో గ్యాస్ పెరుగుతుంది. ఇంకా అసిడిటీ పెరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి చాక్లెట్ ఎంత బాగున్నప్పటికీ దూరం పెట్టేయండి.
మద్యం తాగిన తర్వాత పొరపాటున కుడా కాఫీ తాగవద్దు. ఇది మంచి కలయిక కాదు. దీనివల్ల మరుసటి రోజు ఉదయం వాంతులు అయ్యే అవకాశం ఎక్కువ. మద్యం తాగినవారు హ్యాంగోవర్‌ బారిన పడటానికి ఇది ప్రధాన కారణం కావచ్చు.
బీన్స్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల వైన్ తాగేటపుడు బీన్స్, కాయధాన్యాలు మొదలగు వాటిని ముట్టుకోవద్దు. దీనివల్ల మీ శరీరానికి ఒకరకమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అందువల్ల శరీరం మద్యాన్ని సరిగ్గా గ్రహించదు.
వేయించిన ఆహారాలతో పాటు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను వైన్‌తో పాటు తీసుకోవద్దు. వీటివల్ల చాలా తొందరగా శరీరంలోని నీరు తగ్గిపోతుంది. దానివల్ల మీలో శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీనికి బదులు గ్రిల్డ్ చికెన్ బాగుంటుంది.
మద్యం తాగేసమయంలో బ్రెడ్ తినడం అత్యంత చెత్త కలయిక అని చెప్పవచ్చు. మద్యపానం సేవించేటపుడు బ్రెడ్ అస్సలు తినకూడదు. శరీరంలోని నీటిశాతాన్ని తగ్గించి డీహైడ్రేట్ చేస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండడమే మంచిది.

Exit mobile version