ఈ 3 మిస్టరీల వెనుక అసలు నిజం ఏంటనేది తెలుసా?

ప్రపంచంలో ఆశ్చర్యాన్ని కలిగించే వింతలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని మిస్టరీల వెనుక అసలు నిజం ఏంటనేది ఇప్పటికి ఎవరు కూడా కచ్చితంగా చెప్పలేకపోయారు. మరి అందులో ఆశ్చర్యాన్ని కలిగించే మూడు వింతల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. నో రిటర్న్ ఐలాండ్ :

Ilandకెన్యాలోని రుడోల్ఫ్ సరస్సు దగ్గర ఒక ఐలాండ్ ఉంది. దీన్నే నో రిటర్న్ ఐలాండ్ అని అంటారు. ఈ ఐలాండ్ కొన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది. అయితే ఈ ఐలాండ్ చూడటానికి వెళ్ళినవారు అక్కడికి వెళ్లడమే తప్ప మళ్ళీ తిరిగిరాలేదని చెబుతున్నారు. అందుకే ఎవరు నివసించని ఈ ఐలాండ్ కి నో రిటర్న్ ఐలాండ్ అనే పేరు వచ్చినది చెబుతారు. ఒక ఇద్దరు బ్రిటిష్ సైంటిస్టులు 1935 లో ఐలాండ్ లోకి వెళ్లారట. ఆలా వెళ్లిన వీరు వెనకకి తిరిగిరావడంతో వీరి వెంట వచ్చిన బృందం విమానం ద్వారా ఎంత వెతికినప్పటికీ వారి ఆచూకి లభించలేదట. ఇలా వారి ఆచూకీ కోసం వెతుకుతుండగా ఐలాండ్ లో ఒక నిర్మానుష్య గ్రామం కనిపించదట. ఒకప్పుడు ఇక్కడ ముషులు నివసించేవారని ఆ తరువాత ఇక్కడి వారందరు చనిపోవడంతో గ్రామం నిర్మానుష్యం అయిందని ఆ శాపం కారణంగానే ఇక్కడికి ఎవరు వెళ్లిన తిరిగి రావడంలేదని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటె ఒకప్పుడు ఇక్కడ ఎవరు నివసించేవారు, ఎందుకు ఇక్కడి గ్రామం ఆలా నిర్మానుష్యంగా మారింది, ఐలాండ్ లోకి వెళ్ళినవారు ఎందుకు తిరిగి రావడం లేదు అనేది ఇప్పటికి అంతుపట్టని విషయమే.

కోస్టారికన్ డ్రగ్ బాల్:

mystery

కోస్టారికన్ డ్రగ్ బాల్ అనే ప్రాంతంలో 1930 లో ఇక్కడ గుండ్రంగా ఉండే రాళ్ళూ కనిపించాయి. ఇవి చిన్న సైజు నుండి 8 అడుగుల ఎత్తులో 16 టన్నుల బరువు ఉండే రాళ్ళూ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఇవి అన్ని కూడా గుండ్రంగా ప్రతి రాయి కూడా ఒక ఆకారాన్ని కలిగి ఉండగా ఇవి 17 వ శతాబ్దానికి చెందినవిగా పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ కాలంలో ఇంతబరువైన ఈ రాళ్ళని సరిగ్గా అలాంటి ఆకారం రావడానికి ఎలా తయారుచేశారనేది ఇప్పటికి ఎవరికీ అర్ధం అవ్వని విషయమే.

256 సంవత్సరాలు బ్రతికిన మనిషి:

Mystery Manఈరోజుల్లో సాధారణంగా మనిషి 100 సంవత్సరాలు బ్రతికితే అదే ఒక వింత. చెంగ్డూ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న వు చుంగ్ చై న్యూయార్క్ టైమ్స్ తో తెలిపిన కథనం ప్రకారం. చైనాలో జన్మించిన లి చింగ్ యుయెన్ అనే వ్యక్తి 256 సంవత్సరాలు బ్రతికినట్లు తెలిపారు. ఈయన 1827సం.లో 150 పుట్టినరోజు , 1877 సం.లో 200 పుట్టిన రోజు జరుపుకున్నట్లు చైనీస్ గవర్నమెంట్ రికార్డులో నమోదైనట్లు తెలిపింది. అయితే ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ 1928 ఆదారాలతో సహా వెలుగులో తెచ్చింది. ఈ కథనాన్ని 1930 లో ప్రచురించింది. చింగ్‌కు 24 మంది భార్యలు, 200 మంది పిల్లలు ఉన్నారు. అతను మొత్తము 11 తరాలను చూశాడని వెల్లడించారు. మరి ఇన్ని సంవత్సరాలు జీవిచడం అసలు సాధ్యమయ్యే పనేనా, అతడు మాత్రమే ఇన్ని సంవత్సరాలు ఎలా జీవించగలిగాడు అంటే దానికి కచ్చితమైన జవాబు లేదు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR