Ekkada Brahmana Pandithulu Kaadhu Dalitha Pandithulu Untaaru

పూర్వం నుండి నుండి కూడా దళితులని తక్కువ జాతిగా చూస్తూ దూరం పెట్టేవారు. కానీ ఆ దేవుడికి ఎవరైనా ఒక్కరే అనే విషయాన్ని అందరికి ఒక ఉదాహరణగా ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు. మరి ఈ ఆలయంలో దళిత పండితులు ఎందుకు ఉన్నారు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.Dalitha Pandithuluఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, ఉప్పులూరులో శ్రీ చెన్నకేశవాలయం ఉంది. ఇది అతి ప్రాచీన ఆలయమని చెబుతారు. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే వేదమంత్రాలు చెవులకి ఇంపుగా వినిపిస్తాయి. అయితే ఈ మంత్రోచ్చారణ అనేది బ్రహ్మణ పండితులది కాదు, దళిత పండితులది. ఆ స్వామివారికి నిత్య నైవేద్య ధూపదీపాలు వీరే నిర్వహిస్తారు. ఇలా దేవాలయాలకు దళిత దాసులు అర్చకులుగా ఉండటం చాలా అరుదు. Dalitha Pandithuluఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే, పల్నాడులో ధూప, దీప, నైవేద్యాలతో నిత్య పూజలందుకునే చెన్నకేశవస్వామి ఆలయంలో పల్నాటి యుద్ధ సమయంలో దాడులు జరిగాయి. ఆ సమయంలో స్వామిని కాపాడుకోవడానికి కన్నమదాసు సంతతికి చెందిన తిరువీధి నారాయణదాసు, అతని సోదరులు కలిసి స్వామి ప్రతిమను సింహాచలం తరలించి స్వామికి అప్పల స్వామి అని పేరు మార్చారు. అక్కడి నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు చేరుకున్నారు. Dalitha Pandithulu
అప్పుడు ఈ గ్రామంలో ఒక మర్రి చెట్టు నీడలో ప్రతిమను ఉంచి, స్వామికి నైవేద్యం తీసుకురావడానికి గ్రామంలోకి వెళ్లారు. అదేసమయంలో ఈ గ్రామంలో కొందరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అప్పుడు దళితులు మన గ్రామంలోకి అడుగుపెట్టినందుకు ఇలా జరిగిందని భావించిన గ్రామస్థులు నారాయణదాసు, అతని సోదరులను నిర్బదించారు. ఇక ఆ రోజు రాత్రే సింహాచల అప్పన్న గ్రామా పెద్దలకు కలలో కనిపించి వారు నిరపరాదులు వారిని విడిచిపెట్టండి. గ్రామంలోని మర్రిచెట్టు క్రింద నా ప్రతిమ ఉంది, నన్ను ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించి నాకు దీప నైవేద్యాలు దళిత దాసులే అర్చకులుగా ఉండాలని ఆదేశించాడు. Dalitha Pandithuluఇలా ఆ స్వామివారి ఆజ్ఞ ప్రకారం గ్రామా పెద్దలు 1335 లో ఈ ప్రాంతంలో అప్పలస్వామి ఆలయం నిర్మించి ప్రతిష్టించి అర్చకులుగా వారికీ స్థానం కల్పించారు. నిజానికి విగ్రహాం చెన్నకేశవుడిదే కాబట్టి 1868 లో ఈ అప్పలస్వామి కి పూర్వపు నామమైన చెన్నకేశవస్వామిగా మరల నామకరణం చేసారు. Dalitha Pandithuluఇలా వెలసిన ఈ స్వామివారి ఆలయం ఇప్పటికి అదే ఆచారాన్ని అనుసరిస్తుందని స్థానికులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR