బొంత జెముడు మొక్కను ఎప్పుడైనా చూసారా?

మన పూర్వికులు ప్రకృతిలోని అనంత సంపదను మనకు అందించారు. ఈ ప్రకృతిలో భాగమైన మనకు ఏ సమస్య వచ్చినా ఇక్కడే సమాధానం దొరుకుతుంది. ఇప్పుడంటే ప్రతి చిన్నదానికి మందులు చేసుకుంటున్నాం కానీ ఒకప్పుడు మాత్రం ఇంట్లో పెరటిలోని మొక్కలతో వైద్యం చేసుకునేవారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కొన్ని మొక్కలు, వాటి ఔషధ గుణాలను గుర్తుంచుకొని ఏ వ్యాధికి ఏది ఉపయోగపడుతుందో వాటిని ఉపయోగించేవారు. ఇప్పటికీ రసాయన మందులు నివారించలేని ఎన్నో వ్యాధులకు చెట్లలో ఉన్న ఔషధ గుణాలు శాశ్వత పరిష్కారాలుగా నిలుస్తున్నాయి. అటువంటి ఔషధ గుణాలని ఇచ్చే అద్భుతమైన చెట్టు బొంత జెముడు.

Euphorbia antiquorumఇది ఒక ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం యుఫోర్బియా యాంటికోరం. ఇది యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది ఆంధ్రప్రదేశ్‍లోని కొండ దిగువ ప్రాంతాలైన గలసనేలల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఇది సుమారు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టును గీరినప్పుడు తెల్లని పాలు కారుతాయి. ఇది కొమ్మలు కొమ్మలుగా పైకి ఎదుగుతుంది. ఇది పైకి ఎదిగేకొద్దీ కింది కొమ్మలు రాలిపోతుంటాయి. ఈ చెట్టు ముళ్ళను కలిగి ఉంటుంది. ఈ చెట్టు కాండం, త్రిభుజాకారంలో ఉండే ఆకుల వంటి కొమ్మలు చాలా మృదువుగా ఉంటాయి. ఇది అడవి ప్రాంతాలలో కనిపించే ఒక అందమైన చెట్టు.

Euphorbia antiquorumబొంతజెముడు చెట్టు ప్రయోజనాలు చాలా వున్నాయి. వాత నొప్పులకి, వాయునొప్పులకి, నరాల నొప్పులకి బొంత జెముడు తైలం అద్బుతంగా పనిచేస్తుంది.
బొంతజెముడు పాలు 100గ్రా
జిల్లేడు పాలు లేదా ఆకుల రసం 100గ్రా
వాము చూర్నం 100గ్రా
గరిక రసం 100గ్రా
ఈ నాలుగు వస్తువులు తీసుని బాగా కలిపి ఒక లీటర్ నల్లనువ్వుల నూనె లొ కలిపి ఒక పాత్రలో అన్ని కలిపి వేసి పొయ్యి మీద పెట్టి మెల్లగా పై వస్తువులు ఆవిరి అయిపొయి నూనె మాత్రం మిగిలేలా కాచుకొని ఈ నూనెని నొప్పులకు వాడితే చాలా బాగా పనిచేస్తుంది.

joint painsఈ బొంత జెముడు చెట్టుతో పలు ఉపయోగాలు ఉన్నప్పటికీ… అవన్నీ మనమే తయారు చేసుకొని వాడుకోవడం మంచిది కాదు. వైద్యుల పర్యవేక్షణలో వాడటం మంచిది. ఇక ఇదే కోవకి చెందిన నాగజెముడు మొక్క చాలా భయంకరంగా అనేక ముళ్ళను కలిగి ఉంటుంది. నాగుపాము పడగ విప్పినపుడు తల భాగం ఏ ఆకారంలో ఉంటుందో ఈ చెట్టు కాండం మొత్తం అదే పద్ధతి లో ఉంటుంది. అందుకే ఈ రకం మొక్కలను నాగజెముడు అని అంటారు. దీనినే పలక జెముడు అని కూడా అంటారు. ఈ పలకజెముడుని మెక్సికన్లు సంప్రదాయ ఆహారం వాళ్ళు సలాడ్లు, సాస్ చేసుకొని తింటారు.

Euphorbia antiquorumదీని పనులను జామ్ ల తయారీలో వాడతారు. విత్తనల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఇ ఉండడం వల్ల చర్మ సంబంధిత ఉతపత్తులలో వాడతారు. పండ్లలో విటమిన్ సి మరియు ఆంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన మధుమేహం, క్యాన్సర్ నివారణకు మంచిది. ఈ చెట్టుంతా ముళ్ళతో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పండును తీసుకోవాలి. ఈ పండుకు కూడా వందల సంఖ్యలో అనేక చిన్న ముళ్ళుంటాయి. ఏ మాత్రం తగిలినా అనేక ముళ్ళు గుచ్చుకుంటాయి. పండు లోపల చక్రాకరం లాంటి పెద్ద ముళ్ళు ఉంటుంది. ఈ పండుకు ఉండే కనిపించి కనిపించని సన్నని ముళ్లు ఉంటాయి. ఆజాగ్రత్తగా ఉంటే అనేక ముళ్ళు గుచ్చుకుని విపరీతమైన నొప్పిని కలుగజేస్తాయి.

cures cancerఈ పండును తినడం అనేక సమస్యలతో కూడుకున్నందు వలన ఈ పండును తినడం కన్నా ఊరకుండడం మేలు లేదా తినకూడదనే అభిప్రాయం భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఉంది. పైగా ఈ చెట్లు వుండే ప్రాంతాలలో కంచెలుగా, చిక్కుగా ఉన్నందువలన పాములు సంచరిస్తుంటాయి. అప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR