ఊడుగ చెట్టుని ఎప్పుడైనా చూసారా?

ఈకాలం వాళ్ళకి జోలపాట అంటే లాలి… లాలి అని పాడటమే తెలుసు. కానీ అమ్మమ్మల కాలంలో ఎక్కువగా వినిపించేది “ఊడుగు చెట్లాకు ఉయ్యాల గట్టి,
ఊపమని మీ అమ్మ ఊరు తిరిగొచ్చు!” అంటూ పాడేవారు. ఆ తరం వాళ్ళకి ఊడుగు చెట్టు గురించి, దాని ఉపయోగాల గురించి బాగా తెలుసు. ప్రస్తుతం ఆ మచ్చుకైనా కనిపించడం కరువైంది. మహాత్తరమైన ఊడుగ చెట్టు ఈ చెట్టు కన్నా శక్తివంతమైనది వేరొకటి లేదని చెప్పుకోవాలి. తెల్ల ఊడుగ, నల్ల ఊడగ, ఎర్ర ఊడుగ అని వివిధ రకాలు ఉన్నాయి. అందులో నల్ల ఊడుగ దొరకడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి.

ooduga fruit and treeఇక ఈ ఊడుగ చెట్టుకు ఒక విచిత్రమైన స్వభావం ఉంది. ఊడుగు కాయలు భాగా పండి క్రింద పడిపోతాయి. ఇలా క్రింద పడినవి ఆరుద్రనక్చత్రం రోజున వచ్చే ఉరుములు మెరుపులకి ఈ క్రింద పడిన గింజలు తిరిగి చెట్టుకెళ్లి అతుక్కుపొతాయి. కొన్ని సమయాల్లో ఈ ఉరుముల మెరుపులకి ఈ గింజలు ఎక్కడివక్కడ ఒకదానివెనుక ఒకటి చీమలు బారినట్టు పారుకుంటా పోతాయి. క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు చేసేవారు ఈ గింజలను మాయలు మంత్రాలూ చేయడానికి ఉపయోగిస్తారు.

ooduga fruit and treeఒక బట్ట కింద పరచి కొన్ని రకాల పూజల ద్వారా ఈ ఎగిరే గింజలను బట్ట మీద పడేలా చేసి ఈ గింజలతో నూనె తీసి మాయలు మంత్రాలకు ఉపయేగించేవారట. మనుషులు మాయమయ్యే విద్యలు కూడా ఈ గింజలతో ఎన్నో రకాలుగా ఉన్నాయి. అలాంటి ఊడుగ ఆరోగ్య ప్రయోజనాలకు ఎలా ఉపయోగపడుతుంది? దీని వేరు చెక్క మిక్కిలి చేదుగా , వెగటుగా, కారంగా ఉండి వేడి చేస్తుంది. రక్త విరేచనాలు , క్రిమి రోగం , కుష్టు ,వ్రణాలు,సుఖరోగాలు, చర్మ రోగాలు, విడువని జ్వరాలు, ఉబ్బు రోగాలు, పాము విషం, పిచ్చి కుక్క విషం, ఎలుక విషం మొదలైన అనేక సమస్యలను అద్భుతంగా నివారిస్తుంది. మొండి చర్మ రోగాలకు ఇది పెట్టింది పేరు.

1 . ఎలుక విషానికి విరుగుడు:
ఊడుగా వేరు
గొర్రె మూత్రం
ఆవు నెయ్యి – 1 స్పూన్

ratఊడుగా వేరును గొర్రె మూత్రంతో మెత్తగా నూరి రసం పిండాలి. ముద్దను కటువైన వేసి కట్టు కడుతూ ,రసాన్ని నాలుగు ,ఐదు చుక్కల మోతాదుగా మాత్రమే 1 స్పూన్ ఆవు నెయ్యి కలిపి సేవించాలి.

2 . ఆర్ష మొలలు తగ్గడానికి:

ఊడుగ వేరు బెరడు – 30 gm
దోరగా వేయించిన మిరియాలు – 10 gm కలిపి,కొంచెం నీటితో మెత్తగా నూరి ,బఠాణి గింజలంత గోళీలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. పూటకు 1 మాత్ర చొప్పున రెండు పూటలా మంచినీటితో సేవించాలి. ఇలా చేస్తే 40 రోజుల్లో మొలలు కరిగిపోతాయి.

skin problems3 . తేలు కాటుకు మందు
ఊడుగు గింజలు – 1 భాగం
ముషిని చెట్టు గింజలు – 1 భాగం
పొంగించి ఇంగువ – 1 భాగం
అశ్వగంధ దుంపలు – 1 భాగం
గచ్చకాయల లోపలి పప్పు – 1 భాగం
చిత్రమూలం వేరు పై బెరడు – 1 భాగం
తెల్ల జిల్లేడు వేరు పై బెరడు – 1 భాగం
జిల్లేడు పాలు – తగినంత
అన్నింటినీ కలిపి మెత్తగా నూరి చిటికెన వేలంత బారుగా కణికలు చేసి నీడలో బాగా గాలికి ఆరబెట్టి ,బాగా ఎండిపోయిన తర్వాత నిలువ చేసుకోవాలి. తేలు కుట్టినప్పుడు ఈ కనికను నీటితో అరగ దీసి ,ఆ గంధాన్ని కుట్టిన చోట పూసి గుడ్డ పొగ వేయాలి.

scorpionతెల్ల ఊడుగ చెట్టుకు పూజ చేసి చిన్న వేరు ముక్కను తెచ్చి కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక చిన్న సీసాలో పోసి నిలువ చేసుకోవాలి. పాములున్న ప్రాంతాలలో తిరిగేవారు ఆ సీసాను జేబులో పెట్టుకోవచ్చు. ఏ విషజంతువైనా కాటు వేస్తే వెంటనే ఒక చిన్న ముక్కను నొట్లో వేసుకుని బుగ్గన పెట్టి,నిదానంగా నములుతూ ఆ రసం మింగుతుండాలి. దీనివల్ల విషం హరించిపోతుంది. ఇది ప్రథమ చికిత్సగా కూడా ఉపయోగపడి ప్రాణాలను కాపాడుతుంది. ఊడుగ ఆకులను ముద్దలాగా నూరి నొప్పులపైన వేసి బట్టతో కట్టు కడుతూ ఉండాలి. తద్వారా నొప్పులు , వాపులు తగ్గిపోతాయి.

snakeతెల్ల ఊడుగ చెట్టు వేర్ల బెరడు పొడి
జాజికాయ పొడి
జాపత్రి పొడి
లవంగాల పొడి సమాన భాగాలుగా కలిపి పలుచని నూలు బట్టలో వస్త్ర ఘాళితం చేసి నిలువ ఉంచుకోవాలి.

skin problemsపూటకు 1 గ్రాము మోతాదుగా , 1 చెంచా తేనె తో కలిపి , వ్యాధి తీవ్రతను బట్టి రెండు లేదా మూడు పూటలా ఆహారానికి అరగంట ముందు సేవించాలి.అలవాటైన తర్వాత క్రమంగా కొద్ది కొద్దిగా పెంచుతూ 1 గ్రాము నుండి 2 లేక 2 1/2 గ్రాముల చూర్ణం వరకు పెంచుకుంటూ వాడుతుండాలి. ఇలా చేయడం వలన అన్ని రకాల చర్మ రోగాలు క్రమంగా అద్రుశ్యమై పోయి చర్మ సౌందర్యం కలుగుతుంది.ఊడుగతైలం, పాలు, నెయ్యి కలిపి అందులో ఏ చెట్టుగింజలైనా నానవేసి తీసి నాటి చేపమాంసపునీటితో తడుపుతూ వుంటే వెంటనే మెక్కలు పుట్టుకొస్తాయి. తామర గింజలను ఊడుగతైలములో భావనచేసి దానిని నీళ్ళలో వేస్తే అది పూలతోకూడ పుట్టి ఆశ్చ్యర్యాన్ని కలిగిస్తుంది. నీటిలోపుట్టేవి గాని, మెట్టపాంత్రాల్లొ పుట్టెవి గాని ఏ గింజలనైనా ఊడుగనూనెలో భావనచేసి నాటితే అవి వెంటనే మెలుస్తాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR