పరికి చెట్టుని ఎప్పుడైనా చూసారా..? పరికి చెట్టు కూడ రేగి చెట్టులాగానె వుండి చిన్నదిగా వుంటుంది. పల్లెటూర్లలో పరిక కాయలు విరివిగా లభిస్తాయి. ఈ చెట్లు పొలాల గట్ల ఇరువైపులా కనిపిస్తాయి. ఈ చెట్టును పరికి కంప చెట్టు, పరికి కాయల చెట్లు అని పిలుస్తారు. దీని వృక్ష శాస్త్రీయ నామం జిజిఫ్స్ ఓఎంలోపలియా, ఆంగ్ల నామం జాకాల్ జుజుబీ. పరిక కంప చెట్టు చెట్టంతా ముళ్ళతో ఉంటుంది, ఈ ముళ్ళు చిన్నవిగా ఉన్నప్పటికి గట్టిగా, పదునుగా, గాలం వలె వంకర తిరిగి ఉంటాయి. మామూలుగా 5 అడుగులు ఎత్తు పెరిగే ఈ చెట్లు ఇతర చెట్లను ఆధారం చేసుకొని సుమారు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
ఈ చెట్ల కాయలు చాలా చిన్నవిగా బటానీల కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. పచ్చివి ఆకుపచ్చ రంగులోను, దోరవి ఎరుపు రంగులోను, బాగా మాగినవి నలుపు రంగులోను ఉంటాయి. ఈ కాయలను విత్తనాలలో సహ నమిలి తింటారు. బాగా మాగిన కాయలు పుల్లగా, తీయగా బాగా రుచిగా ఉంటాయి. ఈ పండ్లలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కాయలను విత్తనాల తో సహా నమిలి తినవచ్చు. ఈ కాయలు తింటే గొంతు నొప్పి తగ్గుతుంది. చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ చెట్టు కాయలు విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
ఈ పండ్లను తరచూ తింటూ ఉంటే తలనొప్పి రాదని పెద్దలు చెబుతూ ఉంటారు. జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది. నరాల వ్యాధులు రాకుండా చేస్తుంది. గాయాలను పుండ్లను మాన్పించే చేసే శక్తి ఈ పనులకు ఉంది. తరచుగా ఈ పండ్లను తింటూ ఉంటే క్యాన్సర్ రాకుండా చేస్తుంది. పరికి కాయలే కాదు పరిక కంప చెట్టు ఆకులు బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. ఈ చెట్టు ఆకులు, బెరడు ను ఏ విధంగా ఉపయోగిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలను నయం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పరికి కాయల చెట్టు ఆకులను దంచి ముద్దగా నూరుకోవాలి. ఆ మిశ్రమాన్ని పుండ్లు, గాయాలు ఉన్నచోట వేసి కట్టు కట్టాలి. ఇలా చేస్తే పుండ్లు, గాయాలు త్వరగా మానిపోతాయి. గజ్జి తామర దురద ఉన్నవారు ఈ ఆకులను ముద్దగా నూరి వాటి రసాన్ని రాస్తే ఫలితం కనిపిస్తుంది.. చర్మ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.. ఒక గ్లాసులో వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగిస్తారు. ఈ ఆకుల కషాయం ను నోట్లో వేసుకుని పుక్కిలించి ఉసేస్తే నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ళ వాపును తగ్గిస్తుంది. అన్ని రకాల దంత సమస్యలకు ఈ ఆకుల కషాయం అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ చెట్టు కాండం బెరడును గొంతు నొప్పికి ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడును శరీరానికి టాన్ చేయడానికి ఉపయోగిస్తారు. పరికి కాయల చెట్టు బెరడు ను ఎండ బెట్టుకుని దంచి పొడి చేసుకోవాలి. ఈ చెట్టు బెరడును పొడి చక్కటి స్క్రబ్ లా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు బెరడును ఒక గ్లాస్ నీటిలో బాగా మరిగించి కషాయం లో తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని తాగితే అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఈ బెరడు లో విటమిన్ సి ఉంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధులు నయం చేస్తుంది.