ప్రపంచంలో ఎక్కువమంది సందర్శించే ఖజురహో గురించి కొన్ని నిజాలు

0
2247

ప్రపంచంలోనే ఒక అద్భుతం ఖజురహో. మన దేశంలో ఆగ్రా తరువాత ఎక్కువమంది సందర్శించే క్షేత్రం ఖజురహో. అయితే ఖజురహో లో ఉన్న ఆలయాలన్నీ కూడా ఒకేవిధంగా ఉండటం విశేషం. ఒకప్పుడు దాదాపు 85 దేవాలయాలు ఉండగా ప్రస్తుతం 22 దేవాలయాలు ఉన్నవి. మరి ఖజురహో ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

kajurahoమధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తర్పూర్ జిల్లా కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఖజురహో ఉంది. ఇక్కడ 22 దేవాలయాల సమూహం అనేది ఉంది. ఈ ఆలయ నిర్మాణ సమూహాలు యునెస్కోవారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి. ఇక్కడ ఉన్న ఆలయాలు అన్ని కూడా హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. ఖజురహో అనేది సంస్కృతం నుండి వచ్చినది. సంస్కృతంలో ఖజూర్ అంటే ఖర్జురము అని అర్ధం. ఈ దేవాలయాల సమూహం తొమ్మిదవ శతాబ్దం నాటిది. వీటిని చెందేలా వంశపు రాజులూ నిర్మించినట్లుగా తెలియుచున్నది.

kajurahoఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఖర్జురవాహక అని పిలిచేవారు. ఇక్కడ ఒకప్పుడు ఖర్జురా ఎక్కువగా పండేవని, ఇక్కడ ప్రవేశద్వారానికి రెండు ప్రక్కల రెండు బంగారు ఖర్జురా చెట్లు ఉండేవని అందుకే ఈ ప్రాంతానికి ఖర్జురావాహక అనే పేరు వచ్చినది చెబుతారు. అయితే క్రీ.శ. 16 వ శతాబ్దంలో ఖజురహో వైభవం అంత కూడా కనుమరుగవ్వగా, 19 వ శతాబ్దంలో తిరిగి బ్రిటిష్ హయాంలో మరల కనుగొనబడింది. భారతీయ శృంగార తత్వాన్ని చాటిచెప్పే విధంగా ఇక్కడి శిల్పకళా సౌందర్యం ఉంటుంది.

kajurahoఇక్కడ ఉన్న ఆలయాలు అన్ని కూడా ఒకేరకంగా ఉంటాయి. ప్రతి ఆలయ నిర్మాణశైలీ, గోడలమీద ఉన్న శిల్పం, శిఖరాల ఆకారాలు అన్ని కూడా ఒకేవిధముగా ఉంటాయి. ఇక ఖజురహో లో చూడవలసిన ఆలయాలు మూడు దిక్కులలో ఉన్నాయి. అందుకే ఇక్కడ ఉన్న ప్రదేశాలను దక్షిణ ప్రాంతం, తూర్పు ప్రాంతం, పశ్చిమప్రాంతం అని పిలుస్తుంటారు. ఇక్కడ అన్ని దిక్కులలో పశ్చిమ దిక్కులో ఆలయాలు అనేవి ఎక్కువగా ఉంటాయి.

kajurahoతూర్పు ప్రాంతంలో, పార్శ్యనాధ ఆలయం, శాంతినాధ ఆలయం, ఘంటాయి ఆలయం, వామన ఆలయం, జవరి ఆలయం, బ్రహ్మ ఆలయం, హనుమాన్ ఆలయాలు ఉంటాయి.

kajurahoపశ్చిమ ప్రాంతంలో, చౌసెట్ యోగిని ఆలయం, మహాదేవ ఆలయం, మాతంగేశ్వర ఆలయం, చిత్రగుప్త ఆలయం, విశ్వనాథ ఆలయం, నంది ఆలయం, ప్రతాపేశ్వర ఆలయం, పార్వతి ఆలయం ఉంటాయి. దక్షిణ ప్రాంతంలో, చతుర్భుజ ఆలయం, ధులదేవ్ ఆలయాలు ఉంటాయి.

kajurahoఖజురహో లో చూడవలసిన ఆలయాలు మూడు దిక్కులలో ఉండగా, ఇక్కడి ఒక్కో ఆలయంలో ఉన్న శిల్పకళా సౌందర్యం ప్రతి ఒక్క పర్యాటకుడిని ఆకట్టుకుంటుంది.

kajuraho

SHARE