కరోనా నుండి రికవరీ కోసం పాటించాల్సిన వ్యాయామాలు

దేశవ్యాప్తంగా కరోనా సెంకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కోరల్లో చిక్కుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. చికిత్స కోసం లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. గతేడాది కరోనా పుణ్యామా అని అనేక మంది ఉపాధి కోల్పోయారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు కరోనా సోకితే చికిత్స మరింత భారంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కుంగిపోకుండా ఈ పరిస్థితిని నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. అయితే ఆవిరి పెట్టడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది అని కొన్ని సర్వేల్లో తేలింది.

కరోనాఆవిరి చికిత్స :

కరోనావైరస్ సంక్రమించిన వారు ప్రతీరోజు ఆవిరి పట్టడం ( Steam Inhalation ) వల్ల త్వరగా కోలుకున్నారట. రీసెర్చ్ కోసం మొత్తం 105 వాలంటీర్లను ఎంపిక చేశారట. వీరిని రెండు టీమ్లుగా డివైడ్ చేశారు. కోవిడ్-19 లక్షణాలు కనిపించని వారికి ప్రతీరోజు మూడుసార్లు ఆవిరి చికిత్స చేశారట. దాంతో 3 రోజుల్లోనే వారు కోలుకున్నారట.

కరోనా*మరో వైపు లక్షణాలు కనిపించే వారిలో ప్రతీ మూడు గంటలకు ఒక సారి 5 నిమిషాల పాటు ఆవిరి పట్టారట. దాంతో వారు కూడా కోలుకున్నారట. ఇదంతా ఆవిరి పట్డడం వల్లే జరిగింది అని తెలిపారు. ఈ స్టీమింగ్ లో వారు విక్స్, అల్లం, పసుపు వంటివి ఉపయోగించారట. ఇదే కాకుండా కొన్ని రకాల ఎక్సర్‌సైజెస్‌ ల వల్ల కూడా ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అవేంటో తెలుసుకుందాం.

వాల్ పుష్:

వాల్ పుష్వాల్ పుష్ కూడా మీకు మంచి హెల్ప్ చేస్తుంది. మామూలు పుష్ అప్స్ కంటే వాల్ పుషప్స్ సులువుగా చేయొచ్చు. ఈ వ్యాయామ పద్ధతుల్ని కనుక మీరు పాటించారంటే మీ మజిల్స్ మరియు శరీర పై భాగాలు ఆక్టివేట్ గా ఉంటాయి. ఇలా మీరు ఈ వాల్ పుషప్స్ చేసి ప్రయోజనాలన్నీ పొందవచ్చు. కరోనా నుండి వేగంగా రికవరీ అవడానికి ఈ ఎక్సర్‌సైజ్ మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి ఈ వ్యాయామాన్ని కూడా చేసి చూడండి.

స్టాండింగ్ మార్చ్:

స్టాండింగ్ మార్చ్స్టాండింగ్ మార్చ్ నిజంగా ఒక మంచి వ్యాయామం. దీనిని చేయడం వల్ల మీకు బలం మరియు స్టామినా వస్తుంది. మీరు ఒక వేళ బాగా బలహీనంగా ఉండి నుంచుని చేయలేక పోతే మీరు గోడ లేదా కుర్చీ సహాయం తీసుకోవచ్చు ఇలా సపోర్ట్ తీసుకుని కూడా ఈ వ్యాయామ పద్ధతిని అనుసరించవచ్చు. ఈ వ్యాయామం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి మీరు సమయం దొరికినప్పుడు ఈ వ్యాయామ పద్ధతిని చేయండి దీనితో మీకు మంచి రిలీఫ్ ఉంటుంది.

సింగిల్ లెగ్ లిప్ట్:

సింగిల్ లెగ్ లిప్ట్ఇది కూడా మీకు మంచి వ్యాయామ పద్ధతి. దీని కోసం మీరు కింద పడుకుని మొదట ఒకేసారి కాలు ఎత్తి ఆ పోస్టర్‌లో ఉండాలి. మీరు కనుక ఈ వ్యాయామం చేస్తే మీకు లెగ్ మజిల్స్ బాగుంటాయి అలానే ఫిట్‌గా ఉండడానికి వీలు అవుతుంది కాబట్టి మీరు ఈ వ్యాయామ పద్ధతులు కూడా పాటించవచ్చు.

సైడ్ స్టెప్:

సైడ్ స్టెప్దీని కోసం ముందు మీరు నిటారుగా నిలబడాలి. ఆ తర్వాత మీరు కొద్దిగా ఎడమవైపునకి మీరు స్టెప్ తీసుకోవాలి. ఆ తర్వాత కుడి వైపుకు కూడా ఒక స్టప్ తీసుకోవాలి. ఈ విధంగా మీరు కనుక సైడ్ స్టెప్ చేస్తే మీరు అలసట తగ్గించుకో వచ్చు మరియు బలాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలా సామర్థ్యం కూడా పెరుగుతుంది. బాలెన్స్డ్‌గా ఉండొచ్చు కాబట్టి మీరు దీనిని కూడా ప్రయత్నం చేసి చూడండి.
ఈ వ్యాయామ పద్ధతుల్ని కనుక మీరు రెగ్యులర్‌గా పాటిస్తే తప్పకుండా మీరు కరోనా నుండి స్పీడ్‌గా రికవర్ అవ్వచ్చు

సిట్ టూ స్టాండ్:

సిట్ టూ స్టాండ్ఇలా నిల్చుని కూర్చుని చేయడం వల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది అయితే ఈ వ్యాయామం పద్ధతిలో మీరు కుర్చీకి ఎడ్జ్‌లో కూర్చుని మీ చేతులు ముందుకు చాపి వేగంగా లేవాలి. ఆ తర్వాత మళ్లీ కూర్చోవాలి.. ఆ తర్వాత మళ్లీ లేవాలి.. ఇలా రిపీట్ చేయడం వల్ల మీ బాడీ స్ట్రెంత్ పెరుగుతుంది.

ప్రాణాయామం :

నడుము నిటారుగా పెట్టి కూర్చొని కుడి చేతి బొటన వేలితో కుడివైపు ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రం గుండా ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు ఉంగరపు వేలితో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి కుడి రంధ్రం గుండా శ్వాస వొదలాలి. మళ్ళీ కుడి ముక్కు రంధ్రం నుండి శ్వాస తీసుకొని ఎడమ వైపు నుండి వొదలాలి. ఇలా రెండు నిమిషాల పాటు చేయాలి. చివరికి రెండు ముక్కు రంధ్రాల గుండా శ్వాస తీసుకొని నెమ్మదిగా వొదిలిపెట్టాలి. ఇంకా లంగ్స్ కెపాసిటీ పెంచే ప్రాణాయామాలు చెయ్యాలి.

ప్రాణాయామంచూసారా ఈ వ్యాయామాలు.. వీటిని కనుక మీరు పాటిస్తూ ఉంటే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. కరోనా నుండి స్పీడ్‌గా రికవరీ అవడానికి నిజంగా సహాయం చేస్తాయి. అని నిపుణులు చెప్పడం జరిగింది. కానీ వైద్యుని సలహాలు కచ్చితంగా పాటించాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,640,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR