ఎండుద్రాక్ష తో ఫేస్ ప్యాక్..

డ్రై ఫ్రూట్స్ చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ వాటిలోని ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి కావాల్సిన శక్తినిస్తాయి. అందులో చాలామంది ఎక్కువగా ఇష్టపడేవి ఎండు ద్రాక్ష. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా లభించే ఎండు ద్రాక్షను పరిమితంగా తింటే..ఏ అనారోగ్య సమస్య మనల్ని వెంటాడదు. ఎండు ద్రాక్ష ఏడాది పొడుగునా దొరుకుతుంది. ఎండు ద్రాక్ష ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఎండు ద్రాక్ష పరిమితంగా తింటే ఫ్యాట్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా దరి చేరవు.

  • జీర్ణప్రక్రియను మెరుగుపర్చుకోడానికి ఎండుద్రాక్ష చాలా ఉపయోగపడుతుంది. ఇందులో పైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం పోయి..తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. పేగులు, పొట్టలో విష వ్యర్ధాలుంటే పోతాయి. మరోవైపు ఎసిడిటీకు ఎండు ద్రాక్షలు చెక్ పెట్టగలవు. ఇందులో ఉండే ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియంలు కడుపులో ఉండే యాసిడ్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. దాంతో ఎసిడిటీ తలెత్తదు.
  • గుండెకు ఎండుద్రాక్ష చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎండుద్రాక్షలో ఉండే పొటాషియం కండరాలు..గుండె కండరాల కణాలకు మేలు చేకురుస్తుంది. ఎండు ద్రాక్ష రెగ్యులర్‌గా తింటే గుండె సంబంధిత సమస్యలు రావు. అన్నింటికంటే ముఖ్యం ప్రాణాంతకమైన కేన్సర్‌కు  చెక్ పెట్టవచ్చు. ఎండుద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్ కణాల్ని నిలువరిస్తాయి. చర్మకణాల్లో ప్రవేశించే కేన్సర్‌ను ప్రారంభంలోనే నిలువరించగలవు. కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా, పుండ్లు పెరగకుండా ఆపగలవు.
  • ఎండుద్రాక్షలో ఉండే పాలీ ఫెనాల్స్ అనే ఓ ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ కళ్లను కాపాడుతుంది. కేటరాక్ట్ సమస్యకు పరిష్కారం ఎండుద్రాక్షే. అటు చర్మానికి ఇవి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, సెలెనియం, జింక్‌లు యాంటీ ఏజీయింగ్ ప్రాసెస్‌లో పని చేస్తాయి. చర్మం పాడవకుండా, చర్మ కణాలు దెబ్బ తినకుండా చేస్తాయి. తద్వారా ముసలితనం రాకుండా చేయగలవు. అయితే ఇన్ని ప్రయోజనాలున్నాయి కదా అని పరిమితికి మించి తినకూడదు. రోజుకు 15-20 తీసుకుంటే చాలు.
  • ఇక ఇప్పటి వరకు ఎండు ద్రాక్షతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని తెలుసుకున్నాం.. కానీ, ఎండు ద్రాక్ష ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా. ఎండు ద్రాక్షను ఉపయోగించడం ద్వారా మీ చర్మాన్ని మెరిసేటట్లు ఎలా చేసుకోవచ్చో ఇఫ్పుడు తెలుసుకుందాం.
  • రైసిన్ ఫేస్ ప్యాక్.. మీరు ఇంట్లోనే చాలా సులభంగా రైసిన్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి, 4 చెంచాల ఎండుద్రాక్షను తీసుకొని వాటిని నీటిలో నానబెట్టి ఉంచండి. ఉదయం లేవగానే ఎండు ద్రాక్షను జల్లెడ పట్టి మెత్తగా పేస్ట్ చేయాలి. దీని తరువాత, తేనె, ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిని కొద్దిగా కలపాలి. తరువాత దాన్ని ముఖం మీద అప్లై చేసి, కనీసం 20 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌తో మొటిమల సమస్య నుంచి విముక్తి పొందుతారు. దీనితో పాటు, ఇది ముఖంపై ఉన్న ఫైన్ లైన్లను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. మొటిమలు, వడదెబ్బను తొలగించడంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
  • ఎండు ద్రాక్ష ఫేస్ టోనర్‌: రైసిన్ ఫేస్ టోనర్‌ను తయారు చేయడానికి, ముందుగా, రెండు టేబుల్ స్పూన్ల ఎండుద్రాక్షను తీసుకొని వాటిని ఒక గిన్నెలో నీళ్లుపోసి నానబెట్టాలి. దీని తరువాత, ఉదయాన్నే లేచి, నీటిని వడపోసి, అందులో 2 చెంచాల నిమ్మరసం వేయండి. దానికి రోజ్ వాటర్ కూడా కలపండి. స్ప్రే బాటిల్‌లో ఉంచుకోవాలి. దీనిని ఫేస్ టోనర్‌గా వాడుకోవాలి. ఇది మీ చర్మాన్ని డీప్ క్లీన్ చేయడం ద్వారా హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
  • రైసిన్ జెల్రై: సిన్ జెల్ రెడీ చేయడానికి , ముందుగా ఒక గిన్నె నీటిలో 6 స్పూన్ల ఎండుద్రాక్షలను నానబెట్టాలి. దీని తర్వాత, ఎండుద్రాక్షను వేరు చేసి, వాటిని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌కు అలోవెరా జెల్‌ను జోడించాలి. దీని తర్వాత విటమిన్-ఇ క్యాప్సూల్ కూడా కలపాలి. ఎండు ద్రాక్ష నీరు పోసి మిక్స్ చేసుకోవాలి. ఎయిర్ టైట్ డబ్బాలో నిల్వచేసుకోవాలి. జెల్ అవసరమైనప్పుడు ఈ రైసిన్ జెల్ ఉపయోగించండి. ఇది చర్మంలోని ఇన్ఫెక్షన్‌ని తొలగిస్తుంది. అనేక రకాల చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR