భోగేశ్వర స్వామికి భోగేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

వరంగల్ లో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్ రైల్వే స్టేషన్ కి మూడు కిలోమీటర్ల దూరంలోని మట్టెవాడ ప్రాంతంలో వుంది. ఈ ఆలయానికి ‘భోగేశ్వరాలయం’ అనే పేరు రావడం వెనుక ఓ పురాణ కథ అమలులో వుంది. ప్రతిరోజూ రాత్రిపూట ఒక పాము ఇక్కడికొచ్చి ఈశ్వరుని సేవించేదట. భోగిచేత సేవించబడినవాడు కాబట్టి.. ఈ ఆలయానికి ‘భోగేశ్వరుడు’ అని పేరొచ్చిందని అంటుంటారు.

భోగేశ్వర స్వామివరంగల్, చుట్టుపక్కలవారిలో ఎంతమంది ఈ ఆలయాన్ని దర్శించివుంటారు? అయితే ఈ ఆలయం చాలా పెద్దదనో, శిల్ప సంపదతో అలరారుతోందనో అనుకోకండి. మరి ఈ ఆలయం గొప్పతనాన్ని చెప్పేముందు ఈ ఆలయంవున్న ప్రాంతంగురించికూడా తెలుసుకుందాం. పూర్వం ఓరుగల్లును కాకతీయులు పాలించారని అందరికి తెలిసిన విషయమే. కాకతీయులగురించి జరిగిన పరిశోధనలలో తేలిన విషయం.. ఏమిటంటే పూర్వం ఈ ప్రాంతం పేరు మటియవాడ అయి వుండవచ్చునని.. మటియ అనే శబ్దానికి వ్యాపారమని అర్ధమట. అలాగే ప్రస్తుతం హనుమకొండకి పూర్వనామం అనుమకొండట. అనుమడు, కొండడు అనే ఇద్దరు ఎఱుకరాజులు ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి అనుమకొండ అనే పేరు వచ్చింది.

భోగేశ్వర స్వామిఈ అనుమకొండలోనే కాకతీయరాజులు కట్టించిన ప్రసిద్ధి చెందిన వెయ్యిస్తంభాలగుడి, భద్రకాళి, పద్మాక్షి అమ్మవార్ల దేవాలయాలు వున్నాయి. ఆ కాలంలోనే ఈ అనుమకొండ ప్రసిధ్ధికెక్కినదనడానికి ఈ దేవాలయాలే నిదర్శనం. చారిత్రాత్మకమైన ఓరుగల్లు – అనుమకొండల నడుమ ప్రజల సౌకర్యార్ధం అభివృధ్ధిచెందిన వ్యాపార స్ధలం ఈ మటియవాడ. కాలక్రమేణా మట్టెవాడ అయివుంటుంది. అలాంటి వ్యాపారకేంద్రంలో వెలసిన ఆలయం ఈ భోగేశ్వరాలయం. అయితే ఇక్కడి విశేమేమిటంటే స్వామి కొలువైన తీరు. శివలింగం కింద లింగం – అలా 11 లింగాలు వున్నాయట. ఇవి కనబడవు. పానవట్టముమీద పైనున్న లింగభాగాన్ని జరపటానికి వీలుగా ఉంది. పానవట్టము క్రింది భాగం బోలుగా వుంటుంది. ఇక్కడ అడుగుభాగంలో శివలింగం కింద మేరు ప్రస్తారంలో శ్రీ చక్రం వున్నదట.

భోగేశ్వర స్వామిశీచక్రం బిందు స్ధానంలో మరొక చిన్న రాతి శివలింగం ఉంది. అంటే అక్కడ ఒక పెద్ద శ్రీ చక్రం, ఆ శ్రీచక్రబిందు స్ధానంలో ఒక లింగం, శ్రీ చక్రాన్ని కప్పివేస్తూ నిర్మించిన పెద్దపానవట్టము, ఆ పానవట్టముమీద కదల్చడా lనికి వీలుగా చెక్కిన మరొక శివలింగము వున్నాయి. దానికింద పదకొండు శివ లింగాలు వున్నాయని, అందుకే ఈ భోగేశ్వర స్వామికి ఒక్కసారి అభిషేకంచేస్తే ఏకాదశరుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుందంటారు. ఈ లింగాలలో మధ్యది సువర్ణలింగంట. ఇంకొక విశేషం ఏమిటంటే ఇక్కడ ఎన్ని బిందెలనీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసినా, ఆ నీరు ఒక్కచుక్కయినా బయటకిరాదు. ఎక్కడికి పోతున్నాయో ఎవరికీ తెలియదు.

భోగేశ్వర స్వామిఈ లింగానికి వెనుక భాగాన పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ప్రతిష్టించబడింది. ఈ దేవాలయం ప్రసిధ్ధిచెందకపోవడానికి వాస్తుదోషాలు కొన్ని వున్నాయని చెబుతారు. స్వామి ఉత్తర ముఖంగా వున్నాడు. అంటే పూజించేవారు దక్షిణ ముఖంగా వుండి చెయ్యాలి. అది శాస్త్ర సమ్మతం కాదంటారు. నైఋతిలో బావి వుందన్నారుకానీ వాస్తుదోషం కారణంగా దానిని మూసేశారట.

భోగేశ్వర స్వామిఆలయ ప్రవేశద్వారం ఈశాన్యంలో ఉంది. ఇదికూడా వాస్తు శాస్త్ర విరుధ్ధమే. ఈ దేవాలయంలో క్షేత్రపాలకుడైన గణపతి విగ్రహం ఒకటి ఈ ప్రాంతంలోనే ఎక్కడో బోర్లపడివున్నదనీ, దానిని కనుక్కుని పునరుధ్ధరిస్తే ఈ దేవాలయం పూర్వ వైభవాన్ని పొందుతుందనీ శ్రీ శివానందమూర్తిగారి అభిప్రాయమట. ఈ ఆలయంలో శివరాత్రి వగైరా పర్వదినాలలో ప్రత్యేక పూజలే కాక మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంరోజున ద్వార దర్శనం వుంటుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR