Home Unknown facts శనివారం ఆంజనేయస్వామిని పూజించాలని ఎందుకు చెబుతారు ?

శనివారం ఆంజనేయస్వామిని పూజించాలని ఎందుకు చెబుతారు ?

0

ధర్మ రక్షణ కోసం రాముడు జన్మిస్తే అయన నమ్మిన బంటు హనుమంతుడు ధర్మ సేవ కోసం అవతరించాడు. ధైర్యానికి నిజమైన భక్తికి నిదర్శనం అయినా హనుమంతుడు లేని గ్రామం అంటూ ఉండదు. మరి హిందువుల ఆరాధ్య దైవం అయినా హనుమంతుడి అవతారాలు ఎన్ని? పంచముఖ హనుమాన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1 hanumanthudi rupalenni panvchamukha hanuman gurinchi telusaమహావిష్ణువు దశావతారాలు ధరిస్తే, హనుమంతుడు తొమ్మిది రూపాలు ధరించాడు. అవి ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, వింశతి భుజ ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, అష్టదశ భుజ ఆంజనేయస్వామి, సువర్చలాంజనేయ స్వామి, చతుర్భుజ ఆంజనేయస్వామి, ద్వాత్రింశద్భజ ఆంజనేయస్వామి మరియు వానరాకార ఆంజనేయస్వామి.

ఇక శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. పంచముఖి హనుమంతుడికి రెండు రకాల రూపాలున్నాయి. మొదటి రూపంలో అన్ని తలలు హనుమంతుడివే కాగా, రెండవ రూపంలో ఐదుతలలు హయగ్రీవుడు, నరసింహుడు, హనుమంతుడు, వరాహ మరియు గరుడ తలలు కలిగి ఉంటాయి. వీటిల్లో హయగ్రీవ, నరసింహ, వరాహాలు మహావిష్ణువు అవతారాలు. అందుకని పంచముఖి హనుమంతుడిని మహావిష్ణువు మరియు హనుమానుడి కలిపిన అవతారంగా పూజిస్తారు. శ్రీ పంచముఖి హనుమంతుడు, ఆంజనేయుడి తాంత్రిక రూపంగా భావిస్తారు.

పంచముఖ హనుమాన్ కి అర్ధం ఏంటంటే, తూర్పు ముఖముగా హనుమంతుడు పాపాలను హరించి , చిత్తశుద్ధిని కలుగ చేస్తాడు. దక్షిణముఖంగా కేరాళ ఉగ్రనరసింహ స్వామి శత్రుభయాన్ని పోగొట్టి , విజయాన్ని కలుగజేస్తాడు. పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి దుష్ట ప్రభావలను పోగొట్టి , శరీరానికి కలిగే విష ప్రభావల నుండి రక్షిస్తాడు. ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి , అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు. ఊర్థ్వంగా ఉండే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని , జయాన్ని , మంచి జీవన సహచరిని బిడ్డలను ప్రసాదిస్తాడు.

ఇక హనుమంతుడి శనివారం రోజున పూజించాలని చెబుతుంటారు. దీని వెనుక ఒక కథ వెలుగులో ఉంది. ఒకసారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా , స్వామి అతడిని తలక్రిందులుగా పట్టి ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా , స్వామి తనను , తమ భక్తులను ఎప్పుడు పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయస్వామి ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి , శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ , గురు , శనివారాలలో ఏ రోజైన స్వామిని పూజ చేసుకోవచ్చని చెబుతారు.

Exit mobile version