తిరుపతిలో వెలసిన శ్రీ వేంకటేశ్వరునికి ఈ శ్రీనివాసుడు పెద్దన్న అని అంటారు ఎందుకు ?

0
5027

తిరుమల తిరుపతి దేవస్థానము ఎంత గొప్ప ఆలయంలో ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిన విషయమే. అయితే తిరుమలలో కొలువున్న శ్రీ వేంకేటేశ్వరునికి అన్నగా ఒక దేవుడిని కొలువడమే కాకుండా అక్కడ ఉన్న ఆలయానికి ఒక విశిష్టత ఉంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? శ్రీ వేంకేటేశ్వరునికి పెద్దన్న అని ఎవరిని అంటారు? ఆలయం లో ఉన్న విశేషాలు ఇప్పుడు మనం తెల్సుకుందాం.

naivedyamమనం ఏదైనా దేవాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడి స్వామి వారిని దర్శనం చేసుకునేప్పుడు నైవేద్యం సమర్పిస్తుంటాం. అయితే విచిత్రంగా ఇక్కడి ఆలయంలో నైవేద్యంలో అసలు ఉప్పుని వేయకుండా స్వామికి సమర్పిస్తారంట

naivedyamతమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో తిరునాగేశ్వరానికి సుమారు కిలోమీటర్ దూరంలో, కుంభకోణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఒప్పిలియప్పన్ దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రములలో ఒకటి అని చెప్పుతారు. ఇచట భూదేవి లేకుండా స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని బయటికి కదిలించరు. ఈ దేవాలయ గర్భగుడి పైన ఉన్న విమానాన్ని సుధానందం అంటారు. ఇచట భూదేవి మార్కండేయునికి తులసివనంలో కనిపించినందువల్ల ఈ క్షేత్రాన్ని తులసివనం అని కూడా అంటారు.

naivedyamఇక స్థల పురాణానికి వస్తే, పూర్వము మార్కండేయ మహాముని ఉప్పుని విసర్జించి కాయలు, పళ్ళు స్వీకరిస్తూ ఇక్కడ తపస్సు చేసుకునేవాడు. ఒకనాడు తన ఆశ్రమం దగ్గర ఒక అందమైన బాలిక కనిపించింది. దేవుని వర ప్రసాదంగా భావించి ఆ బాలికను తీసుకువచ్చి భూదేవి అని పేరు పెట్టి పెంచి పెద్ద చేసాడు. భూదేవికి యుక్తవయసు రాగ, తగిన వరుణ్ణి వెతకడం ప్రారంభించాడు. ఒక రోజున ఒక వృద్ధుడు వచ్చి ఆమెను వివాహం చేసుకుంటానన్నాడు. తన కుమార్తెకు వంట రాదని, ఉప్పుని ఉపయోగించడం అసలు తెలియదని, ఆశ్రమంలో ఉప్పు విసర్జించానని మార్కండేయ మహాముని ఆ వృధ్దినితో చెప్పాడట.

naivedyam అప్పుడు ఆ వృద్ధుడు దానికి అంగీకరించి భూదేవిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ వృద్ధుడు సామాన్యుడు కాదని మార్కండేయుడు అనుకున్నాడు. భూదేవి కూడా ఆ వృద్ధిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడింది. ఇక ముహూర్తం దగ్గరికి వస్తుండగా ఆ వృద్ధుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తన నిజ రూపంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మార్కండేయుని ఆనందానికి అవధులు లేవు. వారిద్దరికీ వివాహం జరిపించి ఆ ఆశ్రమంలోనే నెలకొని, ఆ ప్రదేశం విష్ణువు పేరుతో వర్ధిల్లాలని మార్కండేయుడు కోరగా, అందుకు అంగీకరించి ఆ స్వామి భూదేవితో కలసి ఇచట వెలిశాడు.

naivedyamఅక్కడ వెలసిన విష్ణువే ఉపాల్పియప్పన్ అంటే “ఉప్పు ఇల్లే అప్పన్” అని స్వామి భక్తుల పూజలందుకొనుచున్నాడు. ఆనాటి నుండి ఈ స్వామికి పెట్టె నైవేద్యంలో ఉప్పు నిషేధించబడింది.

6 ikkadi alayamlo naivedyamlo uppu nishedinchadam venuka daiva rahasyamసంస్కృతంలో ఈ స్వామిని లవనవిసర్నినిత శ్రీ వేంకటేశ్వరుడు అంటారు. కలియుగదైవం తిరుపతిలో వెలసిన శ్రీ వేంకటేశ్వరునికి ఈ శ్రీనివాసుడు పెద్దన్న అని అంటారు. తిరుపతి స్వామి మొక్కులను కూడా ఇక్కడ తీర్చుకునే ఆనవాయితీ ఉంది.

7 ikkadi alayamlo naivedyamlo uppu nishedinchadam venuka daiva rahasyamఈవిధంగా ఇక్కడ వెలసిన శ్రీ మహా విష్ణువుని శ్రీ వేంకేటేశ్వరునికి పెద్దన్నగా ఇక్కడి భక్తులు కొలుస్తున్నారు.

8 ikkadi alayamlo naivedyamlo uppu nishedinchadam venuka daiva rahasyam