పార్వతి పరమేశ్వరులే ఆచరించమని చెప్పిన నోము ప్రాముఖ్యత

సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులే ఆచరించమని చెప్పిన నోము గనుకనే మారేడు దళాల నోముకి అంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది. పూర్వం ఒకానొక దేశపు రాజకుమారుడు ఆయువు తీరి చనిపోయాడు. రాజపీనుగు తోడులేకుండా పోకూడదు కాబట్టి నా కుమారుని శవానికి తోడుగా పోవడానికి ఎవరినైనా తీసుకు రావలసిందని మృతుని తండ్రియైన మహారాజు భటులను పంపాడు. ఆ భటులు ఎంతగా తిరిగినా చచ్చిన వాడికి తోడుగా పోవాడానికి గానీ, తమ వారిని తోడుగా పంపించడానికి గాని ఏ ఒక్కరూ అంగీకరించలేదు.

maredu dalam nomuధనం మీద ఆశ ఉన్న ఒక బ్రాహ్మణ వనితా తన సవతి బిడ్డను ఎత్తుకు ఎత్తు ధనం తీసుకొని పంపించడానికి అంగీకరించినది. ఆమె కోరిన ప్రకారం ధనమిచ్చి రాజు భటులు పిల్లను తీసుకొని వెళ్ళారు. అలా తీసుకొని వచ్చిన ఆ పిల్లను రాకుమారుని శవంతోపాటు కట్టి స్మాశానానికి తీసుకొని వెళ్తున్నారు. ఆకస్మికంగా చీకట్లు కమ్ముకుని పెద్ద వర్షం కురిసింది. ఆ వర్షంలో, చీకట్లో ముందుకు పోలేక శవాన్ని శివాలయం ముందు దింపి వారంతా ఇళ్లకు వెళ్ళారు. ఆ బాలిక కట్లు వూడదీసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆలయం లోపలికి వెళ్లి పార్వతీ పరమేశ్వరుల ముందు కూర్చుని తన దుస్థితికి పరితపిస్తూ భోరుభోరున ఏడ్వసాగింది.

maredu dalam nomuకరునామయులైన ఆ దంపతులు ఆమెను అనుగ్రహించి అక్షతలు, జలాన్ని ఇచ్చి రాకుమారుని శవంపై చల్లమన్నారు. మారేడు దళం నోము చేయమని చెప్పారు, ఆ ఆది దంపతుల ఆదేశానుసారం ఆ అమ్మాయి మారేడు దళాల నోమును నోచి శవం పై మంత్ర జలాన్ని సంప్రోక్షించి అక్షింతలు వేసింది. రాకుమారుడు నిద్రమేల్కొన్నట్టు సజీవుడై లేచి కూర్చున్నాడు.

maredu dalam nomu ఇంతలో తెల్ల వారింది. రాజు తాలుకు జనాలు శవదహన సంస్కారం చేయడానికి వచ్చారు బ్రతికి వున్న రాకుమారుడిని చూసి ఆశ్చర్య పడ్డారు. వారిని అంతఃపురానికి తీసుకువెళ్ళారు. రాజ దంపతులు ఎంతగానో ఆనందించి ఆ బాలికతో తమ కుమారునికి వివాహం చేసారు.

maredu dalam nomuఉద్యాపన: మారేడు దళాలను వెండితోను, బంగారం తోను చేయించి మారేడు దళాలను మూడింటిని కలిపి మూడు దోసిళ్ళ బియ్యంతో శివునికి పూజచేసి నిరుపేదలకు అన్న దానం చేయాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR