నాగ దోషం ఎలా వస్తుంది ? తొలగించుకోవడానికి ఏం చేయాలి ?

పాము కనిపించగానే.. వామ్మో అంటూ.. ఆమడదూరం పరుగుపెడతారు. విషపూరితమైన సరీసృపం కావడమే ఇందుకు కారణం. ఎక్కడ కాటేస్తుందో అని కొందరు భయపడితే. మరికొందరు దాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. పాముల గురించి అనేక నమ్మకాలు, కథలు, అపోహాలు ప్రజల్లో అనాదిగా పాతుకుపోయాయి. నాటువైద్యం, మంత్రాల పేరుతో మరికొందరు అమాయకుల నుంచి అడ్డంగా దోచుకుంటున్నారు.

నాగ దోషంజాతకంలో కాల సర్పదోషం ఉన్నటువంటి వారు.. పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారైన అయి ఉండాలి లేదా వివిధ మంత్ర ఔషదులతో పాములను బంధించినవారు.. పుట్టలను త్రవ్వినవారు.. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టి నివసించేవారికి వ్యక్తి గత జాతకంలో సర్ప దోషం కలవారు వివాహం సంతానం.. కుటుంబం వ్యవహార అభివృద్ధిలో ఆరోగ్య.. విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి బాధిస్తుంది. జాతక చక్రంలో నాగదోషం వల్ల ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉన్నా నాగదోషం (సర్పదోషం) అంటారు. ఆలస్య వివాహాలు, ఎప్పుడు ఏదో విధమైన వైరాగ్యం, మోసపోవటం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం, కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పిన తప్పుగా అర్ధం చేసుకోవటం, భార్య భర్తల మధ్య తగాదాలు, విడిపోవటం కూడా జరుగుతాయి.

నాగ దోషంజాతకచక్రంలో పంచమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుంటే సంతానం ఆలస్యం కావటం, సంతానం లేకపోవటం, అబార్షన్స్ కావటం జరుగుతుంది. పంచమంలో రాహువు ఉంటే నాగ దోషం ఉంటుంది. దీని నివారణకు నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగ దేవతా ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది. వ్యామోహాలకు లొంగిపోతారు. ప్రేమలో మోసపోతారు.

నాగ దోషంభార్యా భర్తల మధ్య అనవసరమైన అపోహలు, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి. జాతకచక్రంలో అష్టమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న అనారోగ్య సమస్యలు, తిండి సరిగా తినకపోవటం, దురుసుగా మాట్లాడ్తం, పాము కలలు రావటం జరుగుతుంది.

నాగ దోషం“అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే ఆభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్ సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహమ్” నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషం వల్లనే ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి. నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాల నుంచి బయటపడవచ్చు.

నాగ దోషంనాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారం, ఆదివారం విశిష్టం. అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణ పక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంత వరకు శుక్ల పక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వం గాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహంలో అరిష్టాలు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుంది. దోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిష్కారం ఉంటుంది.

నాగ దోషం తీవ్రంగా ఉన్నట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి మరుసటి రోజు శివదర్శనం చేసుకొని రాహుకేతువుల పూజా దానాలు చేస్తే నివారణ జరుగుతుంది.

ఆరు ముఖాలు, ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించడం శుభం.

ప్రతీ శుక్లపక్ష పాడ్యమి అమావాస్య తిధులల్లో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టడం, పక్షులకు ఆహారం పెట్టడం వల్ల కూడా నివారణ జరుగుతుంది.

నాగ దోషంనాగ ప్రతిమ ( సుబ్రహ్మణ్య )స్వామికి 27రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానం చేయడం చేత నివారణ జరుగుతుంది.

ప్రతీ సోమవారం రాహుకాలంలో నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయడం వల్ల కూడా నివారణ జరుగుతుంది.

నవగ్రహాలకు ఇరవైఒక రోజులు ప్రదక్షిణలు చేయడం వల్ల శుభం జరుగుతుంది. రాహు కాలంలో రాహుకాల దీపాలు పెట్టటం వల్ల కూడా నివారణ జరుగుతుంది.

ప్రతీ ఆదివారం ఉపవాసముంటు నాగదేవతాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తూ లలితా సహస్రనామావళి గాని, దుర్గా సప్తసతి పఠిస్తే శుభం జరుగుతుంది.

అధిక ప్రభావం ఉన్నవారు దేవాలయంలో సుబ్రహ్మణ్య లేదా నాగదేవతా విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం వల్ల పూర్తి దోష నివృత్తి అవుతుంది.

నాగ దోషంఅప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వల్ల కూడా దోషం నివారణ జరుగుతుంది.

నిత్యం దేవి సప్తశతి పారాయణం చేయడం వల్ల కూడా శాంతి కలుగుతుంది. మంగళవారం రోజు గాని ఆదివారం రోజు గాని ఉపవాసం ఉన్న దోష నివారణ అవుతుంది.

రాహు కేతువులకు మూలమంత్ర జపాలు తర్పణంలు హోమం దానం చేయడం వల్ల కూడా దోష నివారణ జరుగుతుంది.

ప్రతీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం అభిషేకించడం కూడా సత్ఫలితాలనిస్తుంది.

మినుములు , నువ్వులు, ఉలువలు, బెల్లం ప్రతీ మంగళవారం గోవుకు ఆహారంగా దానం చేస్తూ ఉంటే నివృత్తి జరుగుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR