ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా దర్శనమిచ్చే సర్పరాజు ఆలయం గురించి తెలుసా?

హిందూపురాణాలలో నాగుపాముకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పరమశివుడు తన మెడలో నాగుపాముని ధరించగా, శ్రీ మహావిష్ణువు సర్ప రాజైన ఐదు తలలు కలిగిన ఆదిశేషువుపై పవళిస్తాడు. ప్రతి సంవచరం నాగులచవితి నాడు భక్తులు నాగుపాముని పూజించి వారి భక్తిని చాటుకుంటారు. మన దేశంలో ఎన్నో నాగక్షేత్రాలు అనేవి ఉండగా ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేనివిధంగా ఈ ఆలయంలో విగ్రహం దర్శమిస్తుండగా, ఈ ఆలయాన్ని సంవత్సరంలో నాగపంచమి రోజు మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. మరి ఎన్నో అద్భుత విషయాలు దాగి ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం గురించి మరిన్ని ఆశ్చర్యకర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

sarparjuమధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఉజ్జయిని ప్రాంతంలో ఈ ఆలయం కలదు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. అనగా ఈవిగ్రహం ముఖం దక్షివైపు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సాంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంటుంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగం.

sarparjuఇక ఈ ఆలయంలోని మూడవ అంతస్థులో ఉన్నదే నాగచంద్రేశ్వర ఆలయం. ఈ ఆలయంలో పడగ విప్పిన పాముని ఆసనంగా చేసుకొని కూర్చొని ఉన్న శివపార్వతులు భక్తులకి దర్శనంఇస్తుంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ప్రపంచం మొత్తంలో ఎక్కడ లేనివిధంగా శివుడు శయన రూపంలో దర్శనమిస్తుండగా, శివపార్వతులతో పాటు వినాయకుడు కూడా భక్తులు దర్శమిస్తుంటాడు. అయితే శ్రావణ శుక్ల పంచమి అంటే నాగపంచమి రోజు మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. సర్పరాజుగా భావించే తక్షుడు నాగపంచమి రోజున ఈ ఆలయంలో ఉంటాడని నమ్మకం.

sarparjuఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, సర్పరాజు ఇక్కడ శివుడి కోసం ఘోర తపస్సు చేయగా, అప్పుడు శివుడు సర్పరాజు భక్తికి మెచ్చి అతడికి అమరత్వాన్ని ప్రసాదించాడట. ఈ ఆలయాన్ని దర్శిస్తే సర్పదోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఇక మహాకాళేశ్వరాలయం విషయానికి వస్తే, ఇక్కడ నిత్యం శ్మశానం నుంచి తెచ్చిన బూడిదతో స్వామికి భస్మ హారతి ఇస్తారు. ఇంకా ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకి ఇక్కడ జరిగే చితాభస్మాభిషేకం ఒక అపురూప దృశ్యం. నమక చమకాలతో ఈ భస్మాభిషేకం సుమారు 2 గంటల పాటు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో రోజు శవ భస్మం తో జరిగే చితాభస్మాభిషేకం చుస్తే అకాల మృత్యు బాధలు ఉండవని చెబుతారు.

sarparjuఈ విధంగా సంవత్సరంలో ఒకరోజు మాత్రమే తెరిచే ఈ ఆలయానికి నాగపంచమి రోజున కొన్ని లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR