ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?

0
1441

మనదేశంలోని శైవ క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా చెపుతారు. ఇక్కడ శివుడు జ్యోతి రూపంలో లింగాలలో వెలుగుతూ ఉంటారని విశ్వాసం. అలాంటి పవిత్ర పుణ్య క్షేత్రాలలో మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం ఉజ్జయిని నుంచి సమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Omkareshwara Jyotirlinga Templeఅన్ని నదులు తూర్పు వైపుగా ప్రవహించి సముద్రం లో కలిస్తే ఇక్కడ నర్మదా నది పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇదే ఈ క్షేత్రం యొక్క విశేషం. అయితే నర్మదా నది ఇక్కడ రెండు పాయలుగా చీలి నర్మదా, కావేరిగా ప్రవహిస్తుంది. ఈ రెండు చీలికల మధ్యన ఉన్న ప్రాంతాన్ని శివపురిగా పిలుస్తారు. ఓంకారేశ్వర లింగానికి తల పైన ఉన్న చీలిక లో నుంచి అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్ర పరుస్తుందని భావిస్తారు.

Omkareshwara Jyotirlinga Templeనర్మదా నది రెండు కొండల మధ్యలో నుంచి ప్రవహిస్తుంటే పైన ఆకాశం లో నుండి చూస్తే “ఓం” కారం రూపంలో ఈ నది కనిపిస్తుంది. అందుకే ఈ స్వామికి ఓంకారేశ్వరుడిగా పేరు వచ్చింది. ఓంకారేశ్వర ఆలయంలో ఆదిశంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాసారు.

Omkareshwara Jyotirlinga Templeఇక్కడ గౌరీ సోమనాధ మందిరంలో శివ లింగ దర్శనం చేస్తే పునర్జన్మ ఉంటుంది అని రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయని భక్తుల నమ్మకం.