సతీదేవి యొక్క కళ్ళు పడిన ప్రదేశం గురించి మీకు తెలుసా ?

0
6960

సతీదేవి కళ్ళు పడిన పవిత్ర పుణ్యక్షేత్రం ఇదేనని చెబుతారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే అమ్మవారి మూర్తి పిండరూపంలో ఉంటుంది. మరి ఈ ఆలయ స్తల పురాణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ammavari Murthi Pindarupamlo

హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి అనే ప్రదేశంలో నైనాదేవి ఆలయం ఉంది. ఆనందపూర్ సాహెబ్ కు ఉత్తరంగా 15 కి.మీ. దూరంలో ఈ నైనాదేవి ఆలయం ఒక చిన్న కొండ మీద ఉంది. కొండ క్రింద నైనాదేవి అనే పేరుతోనే ఒక చిన్న గ్రామం కూడా ఉంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం సతీదేవి యొక్క కళ్ళు ఈ ప్రదేశంలోనే పడ్డాయట. అందువల్ల ఇక్కడ ఉన్న ఈ అమ్మవారి పేరు నయనాదేవి అని పిలువబడుతుంది. ఈ దేవి కండ్లకి స్వస్థత కలిగించే దేవిగా ప్రసిద్ధిచెందింది.

Ammavari Murthi Pindarupamlo

ఈ ఆలయ పురాణానికి వస్తే, ఈ అమ్మవారి ఆలయం ఉన్న కొండ కింద ఉన్న గ్రామంలో పశువులను మేపుకునే గొల్లవారిలో నైనా అనే పేరుగల ఒకతను ఉండేవాడు. ఆ నైనా తన పశువులను ఈ కొండపైన ఉన్న అడవిలోకి మేపడానికి తీసుకువచ్చాడు. అతని మందలోని ఒక ఆవు ప్రతి రోజు ఒక చెట్టు కింద నిలబడి పొదుగులో నుంచి పాలు కిందకి వదులుతూ ఉండేది. ఇంటికి వెళ్లిన తరువాత పాలు సరిగా ఇచ్చేది కాదు.

Ammavari Murthi Pindarupamlo

అప్పుడు నైనకి అనుమానం వచ్చి ఒక రోజున రహస్యంగా ఆవు చేస్తున్న పని చూసి అతను వెళ్లి ఆ చెట్టు కింద పడి ఉన్న ఆకులు తీసి చూడగా వాటి అడుగున ఒక గుండ్రని శిల కనబడింది. అప్పుడు అతనికి అర్ధం కాక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అతని కలలో దుర్గాదేవి కనబడి తానూ ఆ చెట్టు కింద పిండరూపంలో ఉన్నానని చెప్పింది. ఆ మరుసటి రోజు నైనా ఊరందరికి చెప్పగా వారందరు ప్రతి రోజు వచ్చి పిండరూపంలో ఉన్న అమ్మవారిని అర్చించి వెళుతుండేవారు. అమ్మవారు మొదటగా దర్శనం ఇచ్చిన నైనా పేరు మీద ఈ అమ్మవారు నైనాదేవి అని పిలువబడింది.

Ammavari Murthi Pindarupamlo

ఈవిధంగా అమ్మవారు వెలసిన రావిచెట్టు కిందనే ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆలయం అనుకోని అమ్మవారు వెలసిన రావిచెట్టు ఇప్పటికి అలాగే ఉంది. ఈ ఆలయంలోని నైనాదేవి అమ్మవారి మూర్తి గుండ్రాయి రూపంలో ఉండి, బంగారు రేకులతో అలంకరించిన కళ్ళు మాత్రం కనబడతాయి.