రాముడి ఇచ్చిన వరం వలన సత్యభామ,జాంబవతిని పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు!

0
1397

పూర్వం సత్రాజిత్తు అనే రాజు సూర్య వరంతో శమంతకమణిని సంపాదించి, ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణుని దర్శించేందుకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనిని మర్యాద చేసి, ‘ఆ మణిని ‘ ఇమ్మన్నాడు. అది రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇచ్చేదని చెప్పాడు. ఇలాంటి మణిని ఎలాంటి బుద్ధిహీనుడైనా ఇస్తాడా? అని ప్రశ్నించాడు.

సత్రాజిత్తుఒకనాడు సత్తాజిత్తు తమ్ముడు ప్రసేనుడూ ఆ మణిని కంఠానికి ధరించి వేట కోసం అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసంముక్క అనుకోని , ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని తీసుకుపోతుండగా, ఒక భల్లూకం ఆ సింగాన్ని హతమార్చి మణిని తీసుకొని తమ కుమార్తెకు ఆట వస్తువుగా ఇచ్చింది. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముని మరణ వార్త విని ‘మణి ఇవ్వలేదని కృష్ణుడే నా సోదరుని చంపి, రత్నాన్ని అపహరించాడని నగరంలో చాటింపు వేయించాడు.

Sri Krishnaశ్రీకృష్ణుడు అది విని వినాయక చవితి నాడు పాలలో చంద్రబింబాన్ని చూసిన దోష ఫలం అని భావించాడు. ఈ అపవాదను తొలగించుకునేందుకు బంధువులతో కలిసి అరణ్యానికి వెళ్ళి వెదికాడు. ఒకచోట ప్రసేన కళేబరం, సింగం కాలి జాడలు పిదప భల్లూకం కాలి గుర్తులు కనిపించాయి.ఆ దారిన వెళుతుండగా ఒక పర్వతగుహ ద్వారం చూసి, పరివారాన్ని అక్కడ విడిచి పెట్టి కృష్ణుడు గుహ లోపలికి వెళ్ళాడు. అక్కడ బాలిక ఉయ్యాలపై కట్టి ఉన్న మణిని చూసి అక్కడికి వెళ్ళి, ఆ మణి చేతితో తీసుకొని వస్తుండగా, ఉయ్యాలలోని బాలిక ఏడ్వడం ప్రారంభించింది. కృష్ణుని చూసి వింత మనిషి వచ్చాడనుకొని కేకలు వేసింది.

Sri Krishnaజాంబవంతుడు కోపంతో వచ్చి శ్రీకృష్ణునిపై పడి అరుస్తూ, గోళ్ళతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ, ఘోరంగా యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుడు జాంబవంతుని పడతోసి, వృక్షాలతో రాళ్లతో, చివరికి ముష్టిఘాతాలతో రాత్రింబవళ్లు ఇరువై ఎనిమిది రోజులు యుద్ధం చేశారు. జాంబవంతుని బలం తగ్గి శరీరం మొత్తం బాధలు వచ్చి భయంతో తన బలాన్ని హరించిన పురుషుడు రావణ సంహారి శ్రీరామచంద్రుడే అని గుర్తుపట్టాడు. అంజలి ఘటించి, ‘దేవాది దేవ నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకున్నాను. ఆ కాలంలో నా మీద వాత్సల్యం చేత నన్ను వరం కోరుకోమంటే బుద్ధిలేక ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. ఇప్పుడు నా కోరిక నెరవేర్చారు. నా శరీరమంతా శిథిలమైంది. ప్రాణాలు అరచేతిలో ఉన్నాయి. జీవితం మీద కోరిక నశించింది. నా అపరాధాలు క్షమించి కాపాడుమని ప్రార్ధించాడు. శ్రీకృష్ణుడు దయాళుడై, జాంబవంతుని శరీరమంతా తన చేతితో నిమిరి భయం తొలగించి, ‘భల్లూకేశ్వరా! శమంతకమణిని దొంగతనం చేసానని నామీద ఆరోపించిన అపనింద తొలగించడానికే ఇలా వచ్చానని, మణిని ఇవ్వు. నేను వెళతానన్నాడు.

4 Rahasyavaani 742జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తమ కుమార్తె జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు. కన్యారత్నంతో, మణితో శ్రీకృష్ణుడు ఇంటికి చేరి సత్రాజిత్తును పిలిపించి, విషయం అంతా చెప్పాడు. శమంతకమణిని సత్రాజిత్తుకు అందజేశాడు. ‘అయ్యో! లేనిపోని నింద మోపి తప్పు చేశానని’ మణి సహితంగా తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమించమని వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను తీసుకొని మణి వద్దని తిరిగి ఇచ్చాడు. అలా స్వీకరించిన సత్యబామను, జాంబవతిని శ్రీకృష్ణుడు శుభ ముహూర్తంలో పెళ్ళి చేసుకొన్నాడు.