కృష్ణుడు అనాధల మరణించడానికి గల కారణం

కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన తరువాత హస్తినాపురంలో ధర్మరాజుకు అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకానికి యుద్ధంలో తమ వెన్నంటే ఉండి గెలిపించిన శ్రీకృష్ణుడిని అతిధిగా ఆహ్వానించారు పాండవులు. అయితే కన్న కొడుకులను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న గాంధారి దాన్ని భరించలేకపోయింది. యుద్ధం ఆపగలిగే శక్తి ఉన్నా కురువంశ వినాశనాన్ని చుసిన కృష్ణుడిపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది.

Facts About Sri Krishna deathఏ విధంగా వంద మంది కొడుకులను పోగొట్టుకొని తాను దుఃఖసాగరంలో మునిగిపోయిందో అదేవిధంగా కృష్ణుడు ఏలే ద్వారకా నగరం కూడా అలాగే సముద్రంలో మునిగిపోతుందని శపించింది గాంధారి. ఆ క్షణంలో ఆమె ఆవేశంలో అన్నప్పటికీ పతివ్రత అయిన గాంధారి మాటలు శాపం తప్పబోదని మాధవుడికి తెలుసు. అందుకే తన కళ్ళముందే ద్వారకా నగరం సముద్రగర్భంలో కలిసిపోవడం చూడలేక తపోవనానికి వెళ్ళిపోయాడు.

Facts About Sri Krishna deathఎక్కడో ద్వారక. దానికి చాలా దూరంలో తపోవనం. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. ఆ కార్యక్రమం ముగిసాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త చెప్పాలని వెతుక్కుంటూ తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు.

Facts About Sri Krishna deathమొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు. కానీ ప్రాణం లేకుండా అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు. అర్జునిడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా అక్కడున్న ఇద్దరు ముగ్గురు అర్జునుడిని ఓదార్చారు. అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి.

Facts About Sri Krishna deathఆ మృతదేహాన్ని కూడా ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేసాడు. ఏ ఆర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా. అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు. కృష్ణుడికి అంత బలగం ఉన్నా అంత్యక్రియలు చేయడానికి అర్జునుడు తప్పా ఎవరు లేకుండా పోయారు.

Facts About Sri Krishna deathసరిగ్గా ఈ లాక్ డౌన్ సమయంలో కూడా చాలామందికి అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా ఈ లాక్డౌన్ సమయంలో ప్రాణం విడిస్తే ఎవ్వరూ రాలేని పరిస్థితి. అంతిమయాత్ర పట్టుమని పదిమంది కూడా లేకుండా ముగించేశారు. అయినా పరమాత్ముడికి తప్పలేదు మానవ మాత్రులం మనమెంత!

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR