Home Unknown facts Facts about Triyuginarayan Temple, wedding place of lord shiva

Facts about Triyuginarayan Temple, wedding place of lord shiva

0

మాహాశివుడు పార్వతి దేవిని వివాహం చేసుకుని ఆ తరువాత అర్ధనారీశ్వర అవతారంతో దర్శనమిచ్చారు. అయితే శివపార్వతుల వివాహం జరిగింది ఈ ఆలయంలోనే అని, ఇక్కడ ఉన్న పీఠం పైన వారి వివాహం జరిగిందని పురాణాలూ చెబుతున్నాయి. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది?  ఆ ఆలయానికి సంబంధించి స్థల పురాణం ఎం చెబుతుందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

lord shiva and parvati in wedding

ఉత్తరాఖండ్ రాష్ట్రం, సొన్ ప్రయాగకు పడమరగా సుమారు 5 కి.మీ. దూరంలో త్రియుగీ నారాయణ్ అనే ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన పవిత్ర పుణ్య స్థలం. ఈ ఆలయం లో రెండు అడుగుల ఎత్తు గల శ్రీలక్ష్మీనారాయణుల విగ్రహ మూర్తులు ఉన్నాయి. ఈ ఆలయం ప్రాంగణంలోనే 3 కుండములు వరుసగా ఉన్నాయి. వీటిని బ్రహ్మ కుండం, విష్ణు కుండం, సరస్వతి కుండం అని అంటారు.

అయితే శ్రీ మహావిష్ణువు యొక్క నాభి వద్ద నుండి సరస్వతి నది జన్మించి, ఈ సరస్వతి కుండంలో కలుస్తుందని స్థల పురాణం చెబుతుంది. ఈ జలం ప్రత్యేకత ఏంటంటే మహిళలను సంతానవంతులుగా చేస్తుందని చెబుతారు. ఇక్కడ విశేషం ఏంటంటే, బ్రహ్మ కుండంలోని నీరు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. ఈ కుండం లో బంగారు రంగుతో ఉండే రెండు చిన్న పాములు ఉంటాయి. ఇవి ఎవరిని ఎం చేయవని చెబుతారు.

ఇక ఈ ఆలయం బయట గోడలు  లేకుండా నాలుగు మూలాల రాతిస్థంబాలు, రాతి పైకప్పు మాత్రం ఉండి, మందిరం మధ్యలో ఒక నేలమీద నుండి నాలుగు అంగుళాల ఎత్తులో, సుమారు 3 అడుగుల ఉన్న రాతిపలక పానవట్టం లాగ ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం ఉంటుంది. అయితే శివపార్వతులు వివాహం ఈ పీఠం పైన జరిగిందని స్థల పురాణం చెబుతుంది.

దీనికి గుర్తుగా ఆలయం లోపల గర్భాలయానికి ముందువైపున ఉన్న ఒక మండపంలో పెద్ద పెద్ద కొయ్య దుంగలతో ఒక మంట నిరంతరం మండుతూనే ఉంటుంది. మూడు యుగముల నుండి ఆ మంట ఆరిపోకుండా నిరంతరం మండుతూనే ఉందని చెబుతారు. ఇలా మూడు యుగముల నుండి మంట నిరంతరం అలాగే మండుతూ ఉండగా దీనికి నారాయణుడే సాక్షి అని ఈ స్వామికి త్రియుగీ నారాయణ్ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది.

ఇచట శివపార్వతుల కళ్యాణం సత్యయుగంలో జరిగింది. ఇప్పటికి ఇక్కడ వెలుగుతున్న వాహనకుండ్ జ్యోతి సమక్షంలో శివపార్వతుల వివాహం జరిగినట్లు చెబుతారు. ఈ అగ్ని నుండి వచ్చే బూడిద ధిపతుల వివాహ బంధాన్ని ఆశీర్వదిస్తుందని చెబుతారు.

Exit mobile version