ఉమాసోమేశ్వర జనార్దన స్వామి ఆలయ విశేషాలు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడి ప్రాంతంలోని శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి ఆలయం పంచారామక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ప్రాచీన దేవాలయం. శాపగ్రస్థుడైన చంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి శాపవిముక్తుడైనట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. బోళా శంకరుడైన శివయ్య ఇక్కడ ‘సోమేశ్వరస్వామి’ పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు. ఇక్కడి శివలింగం పౌర్ణమి రోజుకి తెలుపు రంగులోకి అమావాస్య నాటికి నలుపు రంగులోకి మారుతూ వుంటుంది. చంద్రుడు ప్రతిష్టించిన కారణంగానే, ఆయనని అనుసరిస్తూ ఈ శివలింగం రంగుమారుతూ ఉంటుందని చెబుతుంటారు. మరి ఇలా మారడనికి అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం.

ఉమాసోమేశ్వర జనార్దన స్వామిచంద్రుడికి సోముడన్న పేరు ఉన్న విషయం తెలిసిందే. అందువల్లే ఈ క్షేత్రాన్ని సోమారామం అని సోమేశ్వర క్షేత్రమని కూడా పిలుస్తారు. ఇక ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని సోమేశ్వరుడని పిలుస్తారు.ఇక్కడున్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే, మామూలు రోజుల్లో తెలుపు రంగు లో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులో మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు స్థితికి వచ్చేస్తుంది.ఇది శతాబ్దకాలంగా జరుగుతోందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను గమనించాలంటే అమావస్యతో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

ఉమాసోమేశ్వర జనార్దన స్వామిఈ విశేషాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా ఇక్కడి తరలి వస్తుంటారు. ఇక్కడ గల స్వామి వారిని చంద్రుడు ప్రతిష్టించినాడని ప్రతిథి. ఇక ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించడం వెనుక కూడా ఓ పురాణ కథ వుంది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ, అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ ఉంటారు.ఇక్కడి అమ్మవారు ‘అన్నపూర్ణ’గా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.

ఉమాసోమేశ్వర జనార్దన స్వామిదేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా ధ్వజస్తంభం దగ్గర మరో నంది ఉంటుంది. అటు పై ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది.అందువల్లే ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పేరు. ఇదిలా ఉండగా ఆలయం ముందు భాగాన ఉన్న కోనేరు గట్టున రాతి స్తంభం పై ఉన్న నందీశ్వరుడి నుంచి గర్భాలయంలోకి చూస్తే శివలింగం కనిపిస్తుంది. ముందున్న రాతి గట్టు నుంచి చూస్తే మాత్రం శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. మొత్తం రెండు అంతస్తుల ఉన్న దేవాలయంలో మూలవిరాట్ అయిన సోమేశ్వరుడు కింది అంతస్తులో ఉంటాడు.

ఉమాసోమేశ్వర జనార్దన స్వామిఈ క్షేత్రంలోని ‘చంద్ర పుష్కరిణి’ లో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తూ వుంటారు. తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. ఈ దేవాలయానికి ప్రాకారాలను గోపురాన్ని నిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి.అందువల్లే ఈ క్షేత్రానికి భీమారామం అనే పేరు కూడా ఉంది.

ఉమాసోమేశ్వర జనార్దన స్వామిప్రతి ఏడాది ఇక్కడ ‘మహా శివరాత్రి’ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు ఐదు రోజులపాటు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు కొన్ని లక్షల మంది వస్తుంటారు. అలాగే ‘దేవీనవరాత్రులు’ కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతూ వుంటుంది. ఈ పర్వదినాల్లో ఆదిదంపతులను దర్శించడంవలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఉమాసోమేశ్వర జనార్దన స్వామివిజయవాడ మరియు ఏలూరు నుండి భీమవరానికి చాలా బస్సులు ఉన్నాయి. గుణిపుడి గతంలో చిన్న గ్రామం, కానీ ఇప్పుడు భీమవరంలో భాగం. భీమవరం చేరుకున్న తరువాత గునిపూడికి ఆటోలో వెళ్ళవచ్చు.భీమవరం రైల్వే స్టేషన్ సోమేశ్వర ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంచరామాలలో రెండవదైన సోమారామము రాజమండ్రి కి 59 కి.మీ. దూరంలో, విజయవాడకు 91 కి.మీ. దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా బీమవరం పట్టణానికి 2 కి.మీ. దూరంలో ఉన్న గునిపూడి లో ఉంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR