మొవ్వ శ్రీ వేణుగోపాలస్వామి ఇసుక విగ్రహం గురించి కొన్ని నిజాలు

0
7229

ప్రతి దేవాలయంలోని గర్భగుడిలోని స్వామివారి లేదా అమ్మవారి విగ్రహాలు రాతితో చేయబడిన విగ్రహాలను మనం చూస్తాం. కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారి విగ్రహం ఇసుకతో చేయబడి ఇప్పటికి అదే విగ్రహం పూజలనందుకొనుచున్నది అని ప్రతీతి. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయానికి సంబంచిన పురాణం ఏం చెబుతుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gopaludiఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా లో దివిసీమయందుగల మొవ్వ గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. ఈ గర్బాలయంనందు శ్రీ మువ్వ వేణుగోపాల స్వామి కొలువై ఉండగా, గర్బాలయంనకు ఇరువైపులా శ్రీ రాజ్యాలక్షిదేవి, గోదాదేవి ఆలయాలలున్నాయి. వాయువ్యం వైపున శ్రీ కడ్గంజనేయస్వామి ఆలయం కలదు.

gopaludiఇక ఈ ఆలయ స్థల పురాణానికి వెళితే, ఒకప్పుడు ఈ ప్రాంతం అంత అరణ్యంగా ఉండేది. ఆ అరణ్యంలో మౌద్గల్య మహాముని తపస్సు చేస్తుండేవాడు. అతడు తపం చేసుకొనుటకు అక్కడ ఉన్న ఇసుకతో ఒక వేణుగోపాలస్వామి విగ్రహాన్ని సృజించి అచట ప్రతిష్టించి ఆరాధించుచుండేవాడు. ఆ కాలంలో ఆలయానికి దగ్గరలో ఒక బ్రాహ్మణా పల్లె ఉండేది. ఆ పల్లెలో వరదయ్య అనే బ్రాహ్మణా బాలకుడు ఒకడుండేవాడు.

gopaludiఇతడు అన్నమాచార్యుల తరువాత కాలంవాడు. వరదయ్య యవ్వనకాలం వరకు అల్లరిచిల్లరగా ఉండేవాడు. ఆ ఊరిలోవారు అందరు కూడా వరదయ్యని తేలికగా చూసేవారు. ఒకరోజున మౌద్గల్య మహాముని వరదయ్యని చూసి అతడిలో అంతర్లీనంగా గొప్ప తేజస్సు ఉందని గ్రహించి అతనికి ఒక మంత్రం ఉపదేశించాడు. ఆ రోజునుండి వరదయ్యలో ఒక గొప్ప మార్పు వచ్చినది.
వరదయ్య కొద్దీ కాలంలోనే గొప్ప వాగ్గేయకారుడయ్యాడు. మువ్వ గోపాలుని మీద అనేక శృంగార పదకవితలు వ్రాసి, స్వామికి అంకితం చేసాడు. అయన తనని తాను గోపికగా భావిస్తూ రసభక్తితో పదాలు సృష్టించాడు. ఆ పదాలు పాడుతూ అనేక క్షేత్రాలు తిరిగేవాడు. అలా ఆయనకు క్షేత్రయ్య అన్న పేరు స్థిరపడిపోయింది.

gopaludiవేణుగోపాల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. స్వామి వెనుక వున్న మకరతోరణం పై దశావతారాలు ఉన్నాయి. స్వామి ప్రక్కన రుక్మిణీ సత్యభామలు కూడా దర్శనమిస్తారు. చేతిలో వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం దెబ్బతిన్నది.

gopaludiఇంతటి విశేషం గల ఈ ఆలయానికి చుట్టూ పక్కల గ్రామాల నుండి, దూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు తరలి వచ్చి ఆ మువ్వ వేణుగోపాలస్వామిని దర్శించుకొని తరిస్తారు.

6 isukatho nirmithamaina movva gopaludi vigraham