5 Videos Which Went Viral After Corona Outbreak In India But Are Fake – Here’s Proof

చైనాలో మొదలై…ఆ తరువాత రెండు వందల దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ ని అందరు ఒక వైరస్ లనే చూసారు. కానీ ఎప్పుడు అయితే మన దేశం లోకి అడుగు పెట్టిందో ఈ కరోనా వైరస్ కి మనవాళ్ళు మతం రంగుని పులిమారు. అక్కడితో ఆగలేదు మీ వెళ్లే అంటే మీ వల్లే అంటూ హిందూ-ముస్లిమ్స్ ఏకంగా సోషల్ మీడియా లో సోషల్ వార్ మొదలు పెట్టారు.

ఇక ఇలాంటి ఫేక్ సందేశాలు, వీడియోస్ ని ఆపడానికి గవర్నమెంట్ అండ్ వాట్సాప్ లాంటి సంస్థలు ఏకంగా స్టేటస్ నిడివి ని, ఫార్వర్డ్ చేసే ఆప్షన్స్ ని తగ్గించాయి. చాల మంది నిజం అనుకుని షేర్ చేసిన వీడియోస్ వంద శాతం ఫేక్ ఎహ్…ఇందులో కొన్ని వీడియోస్ మన ఇండియా లోనే కాదు

మరి ఆలా షేర్ చేసిన ఫేక్ వీడియోస్ ఎక్కడివి…ఎంటివి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి…!

ఓ అయిదు fake వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి . వాటిని గురించి కొంత చేస్తే , వాటిలోని నిజానిజాలు ఇవి .

వీడియో 1 : ఓ పది మంది కలిసి ఖాళీ ప్లేట్లను , స్పూన్లను నాకుతూ దేశoలో కరోనా వ్యాపిస్తున్నారు అని వ్యాఖ్యానం జోడిస్తూ ప్రచారం చేస్తున్నారు .

నిజం : ఇది 2018 సంవత్సరపు వీడియో . ట్విట్టర్ లో వుంది . షియా ముస్లిం మతంలోని ఒక సంప్రదాయంలో భాగంగా , దేవుడిచ్చిన ఒక్క మెతుకును కూడా waste చేయకూడదు అనే భావనలో తమ సమిష్టి భోజనంలో ప్లేట్లు , స్పూన్లను క్లీన్ గా నాకుతున్న వీడియో ఇది . ఇది పాత వీడియో . దీన్ని అలా వ్యాఖ్యానించడం దారుణం . ఇది fake video దీనికి కరోనా వ్యాప్తికి సంబంధం లేదు .

వీడియో 2 : రోడ్డు మీద తోపుడు బండి మీద ఒక ముస్లిం వృద్ధుడు ఆరెంజ్ పండ్లను అమ్ముకుంటూ , అలవాట్లలో భాగంగా తన ఆరెంజ్ పండ్లను చేతి వెళ్ళ తడితో కౌంట్ చేస్తున్నాడు . అతను ఇలా కరోనాను వ్యాప్తి చేస్తున్నాడు
అని వ్యాఖ్యానిస్తూ వీడియోను ప్రచారం చేస్తున్నారు .

నిజం : ఆ వీడియో కరోనా వ్యాప్తి చెందని కాలం వీడియో . ఈ విషయం మధ్యప్రదేశ్ పోలీసులకు కూడా తెలిసిన విషయం . అతని మానసిక అనారోగ్యం వల్ల డబ్బులు కౌంట్ చేస్తున్నట్లుగా చేస్తుంటాడు . logic ఏంటంటే : వీడియోలో మాస్కులు ఏ ఒక్కరికీ లేవు . జన సమూహం ఉంది . ముఖ్యంగా కార్లు , ఆటోలు నడుస్తున్నాయి . సాధారణ రోజులలాగా వరుసగా దుఖానాలు ఓపెన్ వున్నాయి . ఇది క్లియర్ గా పాత వీడియో అని ఆలోచిస్తే తెలుస్తుంది . కానీ , వాళ్ళేమో “ చూడండి ఈ వృద్ధుడు తన ఉమ్ము తడితో కరోనా ను వ్యాపింప చేస్తున్నాడు అని ప్రచారం చేసి , చిన్న చిన్న బిజినెస్ లు చేసుకునే వాళ్ళ మీద నెగెటివ్ ప్రచారానికి పూనుకుంటున్నారు . ఇది fake video దీనికి కరోనా వ్యాప్తికి సంబంధం లేదు .

వీడియో 3 : పోలీసులు ఓ ఖైదీని పోలీసు వ్యానులో తీసుకెళ్తుంటారు . ఓ కానిస్టేబుల్ కు అతనికి ఏం తగాదా వచ్చిందో , ఆ పోలీసు మీద ఉమ్మెస్తాడు . ముస్లింలు ఈ విధంగా అతను కరోనా వ్యాపిస్తున్నారు అనే అర్థంలో వ్యాఖ్యానిస్తూ ప్రచారం చేస్తున్నారు .

నిజం : ఆ వీడియో పాతది . కరోనా ఆంక్షలు లేని కాలంలోనిది . బొంబాయి లోని ఓ ఖైదీ వీడియో . అది times of India వాళ్ళు publish చేసిన వీడియో . పోలీసుల మీద కరోనాను ఇలా వ్యాపిస్తున్నారు అని రెచ్చగొట్టే వ్యాఖ్యానాన్ని జోడిస్తూ ప్రచారం చేస్తున్నారు . ఇది fake video దీనికి కరోనా వ్యాప్తికి సంబంధం లేదు .

వీడియో 4 : అట్లానే ఇంకో పాత వీడియోలో వారి ప్రార్థనలలో సమిష్టిగా, బలంగా శ్వాసను తుమ్ము లా వదిలె వీడియోని తీసుకుని కరోనాకు లింక్ ఇస్తున్న వ్యాఖ్యానంతో ప్రచారం చేస్తున్నారు .

నిజం : ఇది పాకిస్తాన్ కు సంబంధించిన పాత వీడియో . అలా శ్వాస వదులుతూ, తల ఊపడం అనేది వారి సంప్రదాయంలో భాగంగా సూఫీ లోని జికర్ అనే ఆచారం . ఇది India today లో కూడా పబ్లిష్ అయింది . అది ఓ ఓ పాత వీడియో. ఇది fake video దీనికి కరోనా వ్యాప్తికి సంబంధం లేదు .

వీడియో 5: ముస్లిం లాగా వున్న ఒకతను పాప కార్న్ లాంటి ఫూడ్ ప్యాకెట్ లో , నోటితో గాలి ఊదుతూ ఉంటాడు . దీన్ని కూడా కరోనా వ్యాపిస్తున్న ముస్లిములు అనే వ్యాఖ్యానంతో ప్రచారం చేస్తున్నారు .

నిజం : ఇది కూడా ఓ పాత వీడియో . మలేషియా దేశంలో 1st May -2019 న రిలీజ్ అయిన వీడియో . నెట్ లో అప్పటినుండి వుంది . ఇది fake video దీనికి కరోనా వ్యాప్తికి సంబంధం లేదు .

ఇంకా ఇట్లాంటివి ఇంకొన్ని వీడియోలు సర్క్యులేటు అవుతున్నాయి . వెంటవెంటనే ఇవి fake వీడియోలు అని చెప్పండి . ఈ కష్ట కాలంలో మనం నమ్మకాన్ని , పరస్పర విశ్వాశాన్ని పోగొట్టుకోవద్దు . సత్యం కోసం ఓపిక పడదాం .

సమాజంలోని పెద్దలంతా ముందుకు వచ్చి మిగిలిపోయిన వారికి , వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి , టెస్ట్ లు చేయించాలి . పొరపాట్లు జరుగుతుంటాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR