దేశంలోనే అరుదైన నవనీత బాలకృష్ణస్వామి ఆలయం గురించి తెలుసా?

మన దేశంలో శ్రీకృష్ణుడి ఎన్నో అద్భుత ఆలయాలు అనేవి ఉన్నవి. శ్రీకృష్ణుడి అరుదైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడి శ్రీకృష్ణుడి విగ్రహం మిగత ఆలయాలలో ఉన్న విగ్రహాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే శ్రీకృష్ణుడు నవనీత బాలకృష్ణస్వామి ఇక్కడ పూజలను అందుకుంటున్నాడు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

venna mudhaఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, కొండవీడు కి దగ్గరలో ఉన్న  సింగనసాని పేట లో శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో బాలకృష్ణుడు కొలువై ఉన్నాడు. ఆలయంలోని మూలవిరాట్టు 2.5 అడుగుల ఎత్తు, 3 అడుగుల పొడవు కలిగి కుడిచేతి లో వెన్నముద్ద , ఎడమచేతిలో వెన్నగిన్నె తో దర్శనమిచ్చే నవనీత బాలకృష్ణుని రూపం ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది చాలా అరుదైన విగ్రహం.

venna mudhaఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, కొండవీటి కొండని అక్కడి రాజుల నుండి బహుమనీ సుల్తానులు ఆక్రమించుకోగా వారి నుండి కోటని స్వాధీనం చేసుకోవడానికి శ్రీకృష్ణదేవరాయలు తన సైన్యంతో దండెత్తాడు. అయితే తానూ ఆ కోటని స్వాధీనం చేసుకుంటే శ్రీకృష్ణుడికి ఒక ఆలయాన్ని నిర్మిస్తానని భావించాడు. అలా తన సైన్యంతో దండెత్తిన శ్రీకృష్ణదేవరాయలు కొన్ని రోజుల్లోనే శత్రువులని ఓడించి కోటను స్వాధీనం చేసుకున్నాడు. అలా విజయం సాధించిన తరువాత మొక్కు ప్రకారం శ్రీకృష్ణుడికి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాలని భావించాడు.

venna mudhaఅయితే అప్పటి వారి రాజధాని అయినా హంపి నుండి తనకి ఎంతో ఇష్టమైన వెన్నముద్ద బాలకృష్ణుడి విగ్రహాన్ని అక్కడి నుండి తెప్పించి కొండ దిగువన కత్తుల బావి ప్రతిష్టించి ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత ఈ కోట గోల్కొండ నవాబుల నుండి ఫ్రెంచ్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. అయితే 1712 లో ఈ ప్రాంతపు యజమాని కత్తుల బావి ఆలయాన్ని తవ్వించి అందులో దొరికిన విగ్రహాలను తన ఇంటిలో పెట్టుకోవాలని భావించాడు. బాలకృష్ణుడి విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలను తీసుకొని వెళ్దాం అని భావించగా అప్పటికే చీకటి పడటంతో ఉదయం వెళ్దాం అని భావించి రాత్రి అక్కడే పడుకోగా, ఆ జమిందారీ కలలో శ్రీకృష్ణుడు కనిపించి నాకు ఈ ప్రదేశమే బాగా నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడి పున్నాగ చెట్టు కింద లక్ష్మి నరసింహస్వామి విగ్రహం ఉన్నది ఆ విగ్రహాన్ని నీ భవంతిలో ప్రతిష్టించుకోమని చెప్పాడట. మరుసటి రోజు స్వామి ఆజ్ఞ ప్రకారం  శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి ని ఇక్కడే ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించాడట.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR