అయిదు వృక్షాలకు ఆనుకోని ఉన్న దర్శించదగ్గ కొన్ని పుణ్య స్థలాలు

0
391

పంచవటి అనగా ఐదు వృక్షాలు గల స్థలం అని చెబుతారు. ఈ అయిదు వృక్షాలకు ఆనుకోని అక్కడ కొన్ని పుణ్య స్థలాలు కూడా ఉన్నాయి. అందులో చెప్పుకోదగ్గ ప్రదేశం

సీతగుంఫా :

సీతగుంఫాపంచవటి శ్రీ సీతారామలక్ష్మణులతో ముడిపడి ఉన్న ప్రధాన ప్రాంతం- ‘సీతాగుంఫా’ అనగా సీత దేవి గుహ. వటవృక్షం వద్దే ఉంది. బయటకు మామూలు ఇంటిలా ఉంది. ఇందులోనే వనవాస సమయంలో కొంత కాలం శ్రీ సీతారామలక్ష్మణులు నివసించినట్లు, ఇక్కడినుంచే రావణాసురుడు సీతాదేవిని అపహరించినట్లు చెబుతారు. ముందు వరండా, అందులోనుంచి సుమారు 20 అడుగుల లోతులో గుహ ఉంది. దీని లోపలకు దిగగానే శ్రీ సీతారామలక్ష్మణ విగ్రహాలు, ఆ గదికి ఎడమవైపు గదిలో శివలింగం దర్శనమిస్తారు. పూర్వం ఈ శివలింగానికి సీతారాములు అర్చనలు, అభిషేకాలు చేసినట్టు స్థల ప్రాణం చెబుతోంది

రామకుండ్ :

రామకుండ్పంచవటి నుంచి ముందుకెడితే రామకుండ్ వుంది . ఇక్కడే అతి ప్రాచీనమైన గోదావరి మాత ఆలయం వుంది. ఇక్కడే గోదావరి పుట్టిన ప్రదేశం. కుంభ మేళా కూడా ఇక్కడే జరుగుతుంది. గోదావరి ప్రవహించే స్నాన ఘట్టాలను రామకుండ్ అనే పేరుతొ పిలుస్తారు. శ్రీరాముడు దశరధుని శ్రాద్ద కర్మలు ఇక్కడే చేసాడు. ఈ గోదావరి మాత ఆలయాన్ని ఒక్క కుంభమేళా జరిగే సమయంలో మాత్రమే తెరుస్తారుట.

శ్రీ కపాలేశ్వర మందిరం:

శ్రీ కపాలేశ్వర మందిరంరామకుండానికి ఎదురుగా చిన్న గుట్టపైన ఆలయం ఉంది. బ్రహ్మదేవుడు తనను తూలనాడుతూ వుండడంతో కోపాద్రిక్తుడైన శివుడు బ్రహ్మదేవుడి తలను నరికివేశాడు. అందువల్ల తనకు సోకిన బ్రహ్మ హత్యాపాతకాన్ని తొలగించుకునేందుకు వివిధ ప్రాంతాలలో తిరుగుతూ ఇక్కడికి చేరుకుని గోదావరీనదిలో స్నానమాచరించి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకుని శ్రీ మహావిష్ణువు మాట ప్రకారం శ్రీ కపాలేశ్వరుడుగా ఇక్కడ కొలువుదీరినట్లు కథనం.

గోరారామ్ ఆలయం :

గోరారామ్ ఆలయంగోదావరీ తీరం నుంచి పంచవటికి వెళ్లే ప్రధాన రహదారిలో కుడివైపున వున్న ఈ ఆలయంలో స్వామివారు తెల్లగా వుంటాడు కనుక దీనికి ‘గోరారామ్’ ఆలయం అనే పేరు. సీత రాములు ఈ ప్రాంతంలో కూర్చుని పూజలు, దైవప్రార్థనలు చేసేవారని కథనం. అందుకు చిహ్నంగా ఆలయ నిర్మాణం జరిగింది. వీటితోపాటు నాసిక్‌లో గోదావరి ఆవలితీరంలో శ్రీ సుందరనారాయణస్వామి ఆలయం, నాసిక్ రైల్వేస్టేషన్ దగ్గరలో ముక్త్ధిమ్‌గా పిలువబడే బిర్లామందిర్, నాసిక్‌కు 30 కి.మీదూరంలో వున్న జ్యోతిర్లింగ క్షేత్రం ‘త్రయంబకం’లను భక్తులు దర్శించుకోవచ్చు.

SHARE