సంవత్సరంలో ఒకరోజు మాత్రమే తెరిచే ఆలయాలు ఏంటి?

మనదేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉన్నవి. ఇప్పటికి కొన్ని పురాతన ఆలయాలలో ఉన్న కొన్ని విశేషాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అయితే అన్ని ఆలయాలకు భిన్నంగా దేశంలో ఉన్న ఈ కొన్ని ఆలయాలను సంవత్సరంలో ఒకరోజు మాత్రమే తెరుస్తారు. మరి సంవత్సరంలో ఒకరోజు మాత్రమే తెరిచే ఆ ఆలయాలు ఏంటి? ఎక్కడ ఉన్నాయి? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1.హాసనంబా ఆలయం:

Famous temples only once a open

కర్ణాటక రాష్ట్రం, హాసన్ అనే ప్రాంతంలో హాసనంబా ఆలయం ఉంది. ఈ ఆలయం క్రీ.శ. 12 శతాబ్దంలో నిర్మించబడినదిగా చెబుతారు. ఈ ఆలయంలో హాసనంబా అనే దేవత పూజలను అందుకుంటుంది. అయితే ఈ ఆలయాన్ని దీపావళి రోజున మాత్రమే తెరిచి అమ్మవారికి పూజలు చేసి, దీపావళి అర్ధరాత్రి ఆలయాన్ని మూసివేస్తారు. ఇలా సంవత్సరం పాటు ఆలయాన్ని మూసివేసి మరల దీపావళి రోజు ఉదయాన్నే తెరుస్తారు. ఇక్కడ ఆశ్చర్యకర విశేషం ఏంటంటే, దీపావళి రోజు అర్ధరాత్రి గర్భగుడిలో అమ్మవారి ముందు వెలిగించిన అమ్మవారి దీపాలు మల్లి సంవత్సరం తరువాత దీపావళి రోజు తెరిచేంతవరకు వెలుగుతూనే ఉంటాయి. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే గర్భగుడిలో వెలిగించిన దీపాలలో పొసే నెయ్యి లేదా నూనె మూడు లేదా నాలుగు రోజులకి వెలగడానికి సహాయపడవచ్చు కానీ సంవత్సరం పాటు ఆ దీపాలు ఎలా వెలుగుతున్నాయనేది ఇప్పటికి ఎవరికీ అంతుపట్టలేదు. ఇది ఆ క్షేత్రం యొక్క మహత్యం అని చెబుతారు.

2. మంగళదేవి ఆలయం:

Famous temples only once a open

కేరళ, తమిళనాడు బార్డర్ లో మంగళదేవి ఆలయం ఉంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ ఆలయం వేలసంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. ఈ ఆలయం సముద్రమట్టానికి 1330 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయాన్ని మే నెలలో వచ్చే చిత్ర పౌర్ణమి నాడు మాత్రమే చూడటానికి అనుమతి అనేది ఉంది. అష్ట లక్ష్మి దేవతలలో ఒకరిగా చెప్పబడే మంగళదేవి కోరిన కోరికలు తీర్చే దేవతగా సంవత్సరంలో ఒకరోజు మాత్రమే భక్తులకి దర్శనం ఇస్తుంది.

3. నాగచంద్రేశ్వర ఆలయం

Famous temples only once a open

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఉజ్జయిని ప్రాంతంలో ఈ ఆలయం కలదు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. ఈ ఆలయం మూడవ అంతస్థులో గల నాగచంద్రేశ్వర ఆలయం ఉంది. ఇక్కడి నాగచంద్రేశ్వర ఆలయాన్ని శ్రావణ శుక్ల పంచమి అంటే నాగపంచమి రోజు మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. సర్పరాజుగా భావించే తక్షుడు నాగపంచమి రోజున ఈ ఆలయంలో ఉంటాడని నమ్మకం. ఈ ఆలయంలో పడగ విప్పిన పాముని ఆసనంగా చేసుకొని కూర్చొని ఉన్న శివపార్వతులు భక్తులకి దర్శనంఇస్తుంటారు. ఇంకా ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ప్రపంచంలో ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ శివుడు శయన రూపంలో దర్శనం ఇస్స్తుండటం విశేషం.

4. అళగర్‌ కోవిల్‌

Famous temples only once a open

తమిళనాడు రాష్ట్రంలోని, మదురై జిల్లా, మధురై కి దగ్గరలో అళగర్‌ కోవిల్‌ ఉంది. ఇక్కడ వెలసిన విష్ణుమూర్తిని అజాగర స్వామి అని పిలుస్తారు. ఈ స్వామి ఈ ఆలయంలో మూడు భంగిమల్లో అంటే కూర్చొని, నిలుచొని, పరుండియున్న మూడు ఆకారాలలో దర్శనం ఇస్తారు. తమిళనాడు రాష్ట్రంలోని, మదురై జిల్లా, మధురై కి దగ్గరలో అళగర్‌ కోవిల్‌ ఉంది. ఇక్కడ వెలసిన విష్ణుమూర్తిని అజాగర స్వామి అని పిలుస్తారు. ఈ స్వామి ఈ ఆలయంలో మూడు భంగిమల్లో అంటే కూర్చొని, నిలుచొని, పరుండియున్న మూడు ఆకారాలలో దర్శనం ఇస్తారు. ఆలయంలోని ఆ స్వామి ఉగ్రరూపాన్ని సామాన్యులు చూడలేరు కనుక గుడి ఆలయం తలుపులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుస్తారని తెలుస్తుంది.

5. తాళేజు భవాని ఆలయం

Famous temples only once a open

నేపాల్ లో తాళేజు భవాని ఆలయం ఉంది. 14 వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని సంవత్సరంలో దసరా సమయంలో మాత్రమే తెరుస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR