Home Entertainment This Fan’s Heartfelt Ode To SP Balasubramanyam Garu Will Make You Shed...

This Fan’s Heartfelt Ode To SP Balasubramanyam Garu Will Make You Shed A Tear

0

గాన గంధర్వుడు ‘బాలు’కి చిన్న నివాళిగా…..

నేను పుట్టకముందే మీరు పుట్టారు.. మీరేంటి..? మీ పాట కూడా పుట్టేసింది. మీ పాటకి ఉన్న వయసులో నా వయస్సు సగం ఉంటుందేమో..! ఎన్నో అద్భుతమైన అలాంటి పాటల్లో మీ గొంతు ప్రపంచానికి తెలిసి చాలా కాలమైంది. మీ గొంతు విశేష ప్రజాదరణ, ఎన్నో గౌరవాలు, ఎన్నో పురస్కారాలు, ఎన్నో పొగడ్తలు, ఎంతో మంది అభిమానుల ప్రేమ సంపాదించుకుంది. ఇవన్నీ నేను పుట్టక ముందే జరిగిపోయాయి. నేనేంటి.. నాలాంటి ఎంతో మంది పుట్టారు, పెరిగారు, మీ పాటలకి అభిమానులు అయ్యారు. మరి అదేంటి..? ఇవన్నీ జరిగాక ఎన్నో ఏళ్లకు పుట్టిన నేను.. మీ పాట వినడానికే పుట్టా అన్నట్లు అంతగా ఎలా దగ్గరైపోయాను..? ఆ మాటకి వస్తే మేము దగ్గరవ్వలేదు.. మీ గొంతే అలా మమ్మల్ని కట్టిపడేసింది. మీకు ఉన్న కోటానుకోట్ల సంగీత అభిమానుల్లో నేనూ ఒకడిని బాలూ..!

మీ ఆకారం లాగే మీ పేరు కూడా శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం అని పెద్దగా పెట్టుకున్నా.. సంగీత సామ్రాట్, గాన గంధర్వుడు అని దేశం మొత్తం మిమ్మల్ని మెచ్చుకున్నా.. అవేవీ మాకు పెద్దగా పట్టవు. మాకు మీరు మా బాలూనే. మీ వయసుకి, మీ ప్రతిభకి మిమ్మల్ని అలా పిలవడం క్షమించరాని తప్పు అయినా సరే.. మీరు మమ్మల్ని తిట్టుకున్నా సరే.. మీరు మా ‘బాలు’డే. మీ పాటలు వింటూ పెరిగాం. మీరు తెరపై నటించిన పాత్రలను చూసి మీలో ఒక మంచి నటుడు కూడా ఉన్నాడా అని ఆశ్చర్యపోయాం. మీరు గొంతు అరువిచ్చి డబ్బింగ్ చెప్పిన ఎన్నో పాత్రల్లో కూడా మీరే మాకు కనబడ్డారు. ఇలా ఒక్కటేమిటి..? మీరు ‘పాడుతా తీయగా’ అంటూ సరిగమలు పలికించిన ఎంతో మంది ఒకప్పటి చిన్నారులు ఈ రోజు మంచి గాయకులుగా ఇండస్ట్రీలో నిలబడి ఇదంతా మీరు పెట్టిన భిక్షే అని సంబరపడుతున్నారు. వీటితో పాటు సంగీత దర్శకుడిగా, నిర్మాతగా మీ ప్రతిభ గురించి ఏమని చెప్పగలం..? ఎంతని చెప్పగలం…? అంత ధైర్యం మాకు లేదు బాలూ..!

మోసం చేశావు బాలూ.. మమ్మల్ని అందరినీ చాలా మోసం చేశావు..

  • నువ్వు ఏ హీరోకి పాడినా, అరే అచ్చం ఆ హీరోనే సొంతంగా పాడుకున్నాడా అని మేము నమ్మేలా బాగానే మోసం చేశావ్..
  • ఏ పాత్రలో నటించినా, ఇక ఈ పాత్రలో వేరే వాళ్లను చూడలేమేమో అనుకునేలా మళ్లీ మోసం చేశావ్..
  • ఏ నటుడికి డబ్బింగ్ చెప్పినా.. ఎంత అద్భుతంగా ఉంది, ఈ పాత్రకి ఈ గొంతే కరెక్ట్ అనుకునేలా పెద్ద మోసం చేశావ్…
  • నీ సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చి, అవి మళ్లీ మళ్లీ వినేలా పిచ్చోళ్లని చేసి భలే మోసం చేశావ్….
  • ‘పాడుతా తీయగా’ అనే గొప్ప కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేసి.. అంత చిన్నపిల్లలు ఎక్కడ నొచ్చుకుంటారేమో అని సున్నితంగా ఒక్కొక్క అక్షరం, స్వరం విడమర్చి చెప్పి వాళ్ల భవిష్యత్తుకి ఒక దారి చూపించి ఇంత మహా గాయకుడు కల్మషం అనేదే లేకుండా ‘బాలు’డిలా ఇలా కూడా ఒదిగి ఉండగలడా అనుకునేలా మమ్మల్ని మళ్లీ మళ్లీ మోసం చేశావ్..

అయినా మాకు నీ చేతిలో మోసపోవడం ఇష్టమేలే..!

నువ్వు ఇలా ఇన్ని సార్లు మమ్మల్ని మోసం చేస్తున్నా.. అది తెలిసి కూడా మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నాం..!
నీ ప్రేమకి దాసోహం అవుతూనే ఉన్నాం..!!

నిన్ను తలవకుండా మాకు ఒక్కరోజైనా గడుస్తుందా బాలూ..!

వద్దని అనుకున్నా ఏ టీవీలోనో, ఏ సంగీత కార్యక్రమంలోనో, ఏ ఎఫ్ఎంలోనో వినిపించి నేను కూడా ఉన్నా మీ జీవితంలో అని మాకు గుర్తు చేస్తూనే ఉంటావ్. అంతలా మాలో కలిసిపోయావ్ బాలూ… నీ పాట వినకుండా, నీ గొంతు తలవకుండా మాకు పూట గడవదు. నువ్వు మా జీవితాల్లో అంతలా ఇమిడిపోయావ్. మరి ఏంటి బాలూ..! నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావని అందరూ అంటున్నారు.. నీ పాట టీవీలో వచ్చినప్పుడల్లా విని మైమరచిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. నువ్వు ఏ సినిమాలో అయినా కనిపిస్తే, అయ్యో ఇంతటి మనిషి లేకుండా పోయాడే అని గుండె బరువు చేసుకుంటున్నారు.. ఇక నీ స్థానంలో ఎవరూ రాలేరు, నీలాంటి గొప్ప గాయకుడు మళ్లీ పుట్టలేడు అని అంతా చెప్పుకుంటున్నారు.. ఎలా బాలూ..? నీ తర్వాత ఇంకొకరు ఎలా రాగలరు..? అసలు నువ్వంటూ లేకుండా పోతేనే కదా..! అది ఎన్నటికీ జరగని పని. నువ్వెప్పుడూ మా గుండెల్లోనే ఉన్నావుగా బాలూ.. ఉంటావ్ కూడా. మా గుండె కూడా కాలి బూడిద అయ్యేవరకు అందులో ఉన్న నువ్వు నీలాగే ఉండిపోతావు.. నీ స్థానం నీదే.

బాలూ.. చివరగా ఒక్క మాట. మళ్లీ బుడిబుడి అడుగులు వేసుకుంటూ ‘బాలు’డివై మా కోసం తిరిగి రావా..!
సంగీత సామ్రాజ్యం ఒంటరిదై నీ కోసం ఎదురుచూస్తోంది.

కొన్ని అరుదైన ‘బాలు’ జ్ఞాపకాలు

1. ఎస్పీబీ

1.SP Balasubramanyam Garu rare pics

2. నూనూగు మీసాల కుర్రాడు

3. కుటుంబం (భార్య సావిత్రి గారు, కొడుకు ఎస్పీ చరణ్, కూతురు పల్లవి)

4. జీవిత భాగస్వామితో..

5. అప్పటి తమిళనాడు సీఎం జయలలిత గారి నుండి ‘నంది’ అందుకుంటూ..

6. బిగ్ బీ అమితాబ్, ధర్మేంద్ర, హేమా మాలిని, ఎల్ఆర్ ఈశ్వరి గారితో..

7. మాజీ సీఎం నీలం సంజీవరెడ్డి గారితో..

8. కేవీ మహదేవన్, సుశీలమ్మతో..

9. క్రికెటర్లతో..

10. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్..

11. ఓ పార్టీలో అల్లరి చేస్తూ..

12. లెజెండరీ సింగర్ వాణీ జయరాం గారితో..

13. గాయని స్వర్ణలతతో..

14. జానకమ్మ, ఇళయరాజాలతో..

15. ఒకే ఫ్రేములో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ గారు, ఇళయరాజా గారితో బాలు

16. ఈ ఫోటో మన ‘బాలు’డు ఎక్కడ..?

17. కే. విశ్వనాథ్ గారు, ఆమనితో ‘దేవస్థానం’ మూవీ షూట్..

18. ఒక సాంగ్ రికార్డింగ్ టైంలో నవ్వుతూ..

19. సతీమణిని ఆట పట్టిస్తున్న ‘బాలు’డు

20. అన్న ఎన్టీఆర్ తో..

21. దిగ్గజ నటులు శివాజీ గణేశన్ గారితో..

22. పద్మభూషణ్ అందుకుంటూ..

23. ఏసుదాసు గారు, చిత్రమ్మతో..

Exit mobile version