Home Health పెదవులు సహజ ప్రకాశాన్ని పొందడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో తెలుసా ?

పెదవులు సహజ ప్రకాశాన్ని పొందడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో తెలుసా ?

0

అమ్మాయిలు ఎంత మేకప్ చేసుకున్నా పేదలకు లిప్‌స్టిక్‌ పెట్టకపోతే అది పూర్తవదు. ప్రతి ఒక్కరూ చాలా మృదువైన మరియు అందమైన పెదాలను కోరుకుంటారు. కానీ మేకప్‌ విషయానికి వస్తే లిప్‌స్టిక్‌ కంటే మహిళలు పెదవుల సంరక్షణపై దృష్టి పెట్టడం తక్కువ. ఇది పెదవులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

Fantastic tips for beautiful lipsపెదవులు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి వాతావరణ మార్పుల కారణంగా త్వరగా ఎండిపోతాయి. ఇది పెదవులకు మరింత చిరాకు చేస్తుంది. అంతేకాదు పెదవులు నల్లబడి, దాని సహజ ప్రకాశాన్ని కోల్పోతాయి. అయితే పెదవులు సహజ ప్రకాశాన్ని పొందడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం…

కొంతమందికి పెదవులు కొరికే అలవాటు ఉంటుంది. ఇది పెదాలను చాలా పొడిగా, పగుళ్లతో మరియు కొన్నిసార్లు రక్తస్రావం చేస్తుంది. ఇది పెదవులకు హాని కలిగిస్తుంది. అందువల్ల దీనిని నివారించాలి.

పెదవులపై సూర్యరశ్మి పడితే చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి ఎండ కోసం బయటికి వెళ్లవలసి వచ్చినప్పుడు లిప్ బామ్ ను ఉపయోగించండి.

పెదవుల అందాన్ని సంరక్షించేందుకు వారానికి ఒకసారైనా సహజమైన స్క్రబ్ ని ఉపయోగించాలి. దీని కోసం ఆలివ్ ఆయిల్ షుగర్ ఉపయోగించి స్క్రబ్ చేయవచ్చు. స్క్రబ్ చేసిన తరువాత పెదవులపై వెన్న లేదా మాయిశ్చరైజర్ రాయాలి.

పెదాల కోసం ఏ రసాయనాలు వాడకుండా ఇంట్లో తయారుచేసిన స్క్రబ్ వాడడం మంచిది. బాదం నూనె మరియు తేనె కలిపి రాత్రిపూట పెదవులపై రాసి మసాజ్ చేసి పెదవులపై అలాగే ఉండనివ్వండి. మరుసటి రోజు ఉదయం చల్లని నీళ్లతో కడగండి.

పెదవులకు నిమ్మరసం మరియు గ్లిసరిన్ కలిపి రాత్రి పడుకునే ముందు రాస్తే పెదాలను రిఫ్రెష్ చేస్తుంది.

పొడి మరియు పగిలిన పెదవుల కోసం ఆలివ్ నూనెను వాసెలిన్‌తో కలిపి రోజుకు 3-4 సార్లు పెదవులకు రాయాలి.

Exit mobile version