శివుడికి ఇష్టమైన ఈ నగరాన్ని కలియుగ అంతంలో కూడా శివుడు కాపాడుతాడట!!!

ఆధ్యాత్మికత అంటే ఇష్టపడేవారంతా జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్లాలనుకుంటారు. గతంలో ముసలితనం రాగానే కాశీ వెళ్లి అక్కడే తనువు చాలించేవారు. అలా చేస్తే మళ్లీ జన్మ అనేది ఉండదని నమ్మేవారు. ఇప్పటికీ హిందువులకు కాశీ అంటే ముక్తికి ముఖద్వారం. కాశీకి ఇంత ప్రాధాన్యత ఎందుకని వచ్చింది? క్షేత్ర(రేఖా)గణిత పరంగా, కాశీ క్షేత్రం, అండాండం బ్రహ్మాండాల సంగమానికి ప్రతిరూపం. ఇక్కడ మానవ శరీరంలో నాడుల సంఖ్యకు సమానంగా 72,000 మందిరాలు నిర్మించారు. అక్కడ ఉండటం అంటే విశ్వ శరీరంతో మానవదేహం సంబంధం ఏర్పరచుకోవటం. అందుకే కాశీ వెళితే తిరిగి రావాలని అనిపించదు. అన్నిటికి మించి ఒక గొప్ప విశిష్టత ఈ నగరానికి ఉంది ఇదేమిటో తెలుసుకుందాం…

kashiమన దేశంలో ఆ పరమశివునికి ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అటువంటి పురాతన, ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో వారణాసి కూడా ఒకటి అని చెప్పవచ్చు.

భారతదేశంలోని అతి ప్రాచీన నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వారణాసిని హిందువులు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. పురాణాల ప్రకారం దాదాపు 5000 సంవత్సరాల క్రితం సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ వారణాసిని స్థాపించాడని తెలుస్తోంది.

shiva lingaఈ ఆలయంలో కొలువై ఉన్న శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు ఆ పరమ శివుడే స్వయంగా ఇక్కడ కొలువై ఉన్నాడని ఇక్కడి ప్రజల విశ్వాసం.

వారణాసిలో ఉన్నటువంటి గంగానదిలో స్నానమాచరించడం వల్ల గతజన్మ పాపాలు సైతం తొలగిపోతాయని, పాపాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అదేవిధంగా దక్షుడు యాగంలో ఆత్మార్పణం చేసిన పార్వతి దేవి చెవి పోగు ఈ వారణాసి ప్రాంతంలో పడటం వల్ల ఈ ప్రాంతం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

kashiఈ విధంగా చెవిపోగు పడిన ప్రాంతంలోనే విశాలాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన వారణాసిలోని గంగా నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు. మన పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా పాండవులు పాప విముక్తి కోసం కాశీకి వచ్చారని తెలుస్తోంది. అదేవిధంగా వారణాసిలో చనిపోయినా, గంగానది తీరంలో దహన సంస్కారాలు నిర్వహిస్తారు. వారికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని భావిస్తారు.

crematoriumఈ విధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన వారణాసి ఎటువంటి ప్రళయం వచ్చినా ఏ మాత్రం చెక్కుచెదరని చెబుతారు. సాక్షాత్తు ఆ పరమశివుడు వారణాసిని సృష్టించడం వల్ల ఎటువంటి ప్రళయాలు కానీ, విపత్తులు కానీ కాశీ నగరాన్ని నాశనం చేయలేవు.

pandavas at shiva lingకల్పాంతం తర్వాత ఈ యుగం అంతమై తర్వాత యుగం ప్రారంభమవుతుంది అయినప్పటికీ వారణాసిని ఆ పరమేశ్వరుడు సృష్టించడం వల్ల ఎటువంటి ప్రళయ సమయంలో కూడా నాశనం కాకుండా పరమేశ్వరుడు తన త్రిశూలం పై వారణాసి నగరాన్ని నిలబెడతాడని నమ్మకం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR