వేములవాడ ఆలయంలోని ధర్మగుండం యొక్క విశేషం

ప్రాచీన కాలానికి సంబంధించిన సంస్కృతీ-సాంప్రదాయాలు, ఆచారాలు, కళలు ఉట్టిపడేలా ఇప్పటికీ దేశంలో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. అటువంటి కట్టడాల్లో వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కూడా ఎంతో విశేషమైనది. చాళుక్యులు ఎంతో వైభవంగా నిర్మించిన ఈ క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. ఉత్తర తెలంగాణాలో ఎటువంటి శుభకార్యం తలపెట్టాలన్నా ముందుగా వేములవాడ రాజన్న దర్శనం జరగాల్సిందే. ముఖ్యంగా చుట్టుపక్కల అన్ని జిల్లాలవారు వివాహానికి ముందు, వివాహం తరువాత పెళ్ళైన కొత్త జంటలు రాజన్న ఆశీర్వాదం కోసం వస్తారు. చిన్న పిల్లలకు మొదటగా వేములవాడలోనే పుట్టు వెంట్రుకలు తీయడం చుట్టుపక్కల అన్ని జిల్లాలవారి ఆచారం.

వేములవాడ ఆలయంవందల సంవ్సతరాల చరిత్ర గల వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి పుణ్య క్షేత్రానికి ప్రసిద్ది ఇక్కడికి వచ్చే భక్తజనంతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది . కరీంనగర్ జిల్లాలో ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందింది. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం. ఇక్కడ పరమశివుడు రాజరాజేశ్వర స్వామి పేరుతో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో శివుడు పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై లింగరూపంలో వెలిశాడు.

వేములవాడ ఆలయంవేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడెమొక్కు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కల్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, ఆకుల పూజ, పల్లకిసేవల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దర్శనానికి వచ్చిన భక్తులు తప్పకుండ కోనేట్లో స్నానం చేస్తారు.

వేములవాడ ఆలయంరాజరాజనరేంద్రుడు అనే చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతం చేరుకొన్నాడు. ఇప్పుడు నేలకొని ఉన్న దక్షిణామూర్తి ప్రాంతములో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది. ఇక్కడ బస చేయడానికి అనువైన ప్రాంతంగా ఉందని బోధి చెట్టు క్రింద సేద తీర్చుకున్నాడు.

వేములవాడ ఆలయం ఉదయాన్నే స్నానమాచరించడానికి ప్రక్కనే ఉన్న కోనేరు లో దిగగానే ఒక్కసారిగా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగు లోపలి లాగేసింది. చక్రవర్తి కోనేరు అడుగు భాగం నుండి కొంత సమయం తరువాత సంపూర్ణ ఆరోగ్యంతో తన వ్యాధి నయం అయి బయటకు వచ్చాడు. అంతే ఆ రాజు బోధి వృక్షం క్రింద గల దక్షిణామూర్తి ( శివలింగం ) కు పుజ చేసి, నమ్మలేని నిజాన్ని చూసి నివ్వర పోతు, ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ చెట్టు క్రింద వాలి పోయాడు.

వేములవాడ ఆలయంకొద్ది సేపటి తరువాత జనం అలజడికి మేల్కొని చూడగా అక్కడ ఒక మహాముని కూర్చున్నాడు. వ్యాధి గ్రస్తులయిన వారికి కోనేటి నీటితో వైద్యం చేస్తూ కనిపించాడు. ఆ మహామునికి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అనే చక్రవర్తిని. నాకు అతిబయంకర కుష్టు వ్యాధి వచ్చింది. ఎన్నో ప్రదేశాలు తిరిగాను, ఎన్నో పుణ్యనదులలో స్నానమాచరించాను. కానీ ఈ కోనేటి లో మునగగానే నా వ్యాధి దూరమైంది ఎలా? నా సందేహం నివృతి చేయండి స్వామి అంటూ ప్రాధేయ పడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధంగా చెప్పాడు. ఈ కోనేటి అడుగు భాగంలో అష్టదిక్కుల కాలబైరవ జ్వలముఖి బహుముఖి దేవత లు కొలువు తీరి ఉన్నారు. అందుకే ఈ కోనేటి కి కలియుగాంతం వరకు దాని మహిమ అలానే ఉంటుందని చెప్పాడు. అంతకు ముందు నుండే కోనేరు ఎంతో ప్రాశస్త్యమైనది, కానీ రాజరాజ నరేంద్ర చక్రవర్తి దర్శించిన తరువాత ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.

వేములవాడ ఆలయంఇప్పటికీ గుండం లో నీరు తిసి వేస్తే మనకు ఆ విగ్రహాలు కనిపిస్తాయి. ఇకనుంచి ఈ చరిత్ర నలుగురి తో పంచుకుని ఆధారాలతో కనిపించే పుష్కరిణి పవిత్రతను కాపాడుకోవాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR