చిన్న పిల్లల్లో జ్వరాలు… ఈ జాగ్రత్తలు తీసుకోండి!

వర్షాలు పడుతున్నాయంటే వాటితో పాటు దోమలూ వచ్చేస్తాయి. దోమల వల్ల మలేరియా, డెంగీ వంటి జ్వరాలు వచ్చే సంగతి మనకు తెలుసు. అలాగే చిత్తడితో కలుషితమైన నీళ్ల కారణంగా డయేరియా, నీళ్ల విరేచనాలు మొదలుకొని టైఫాయిడ్‌ వరకూ జబ్బులు చుట్టుముడతాయి. ఇదే సమయంలో సీజనల్‌గా వచ్చే ఫ్లూ ఎప్పుడూ కాచుకుని ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఏ చిన్న జ్వరం వచ్చినా అది కరోనానే అనే ఆందోళన జనాల్లో ఉంది.

feverప్రతి జ్వరమూ కరోనా కాకపోవచ్చు. సాధారణంగా ఈ సమయంలో జ్వరాలూ, జబ్బులు ముసిరే సీజన్‌. ఈ సమయంలో అనేక సీజనల్‌ వ్యాధులు వచ్చే టైమిది. అందుకే ప్రతి జ్వరాన్నీ కోవిడ్‌–19గా అనుమానించనక్కర్లేదనీ, అలా అనుమానించి ఆందోళన చెందక్కర్లేదని వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. కానీ ఈ సమయంలో చిన్నారులకు జ్వరం వచ్చిందంటే అది కరోనానెమో అనే సందేహాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తాయి.

chicken poxసహజంగానే ఇంట్లో చిన్న పిల్లలుంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. వాళ్లకు ఏదైనా అయితే.. తెగ హైరానా పడిపోతాం. కొంచెం ఒళ్లు వేడెక్కితే చాలు జ్వరం వచ్చిందని టెన్షన్ పడిపోతాం. హాస్పిటల్లాకు పరుగులు పెట్టేస్తాం. పిల్లలకు కాస్త ఒళ్లు వెచ్చ చేసిందంటే పెద్దలకు కంటిమీద కునుకు ఉండదు. వేడి ఎంత ఉందో చెక్‌చేయడం, ఏమి తినిపించాలో ఆలోచించడం, ఇలా పిల్లలకు జ్వరం తగ్గేంత వరకు పెద్దలకు నిద్రపట్టదు. ఇక కరోనా సీజన్లో అంటే ఆ భయం, జాగ్రత్తలు మరింత ఎక్కువగా తీసుకుంటారు.

maskపైగా పిల్లలకు ఈ సీజన్‌లో వచ్చే జబ్బు మలేరియా, డెంగీ, డయేరియా, టైఫాయిడ్, ఫ్లూ ఏదైనా సరే… మొదట కనిపించే లక్షణం జ్వరమే. దాంతోపాటు పిల్లల్లో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, ఒళ్లునొప్పులు, కడుపు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇక ఫ్లూ అయితే దాదాపుగా కరోనానే పూర్తిగా పోలి ఉంటుంది. పైగా అది కరోనా మాదిరిగానే నీటితుంపర్లతోనే వ్యాప్తి చెందుతుంది. అందువల్ల వచ్చే జ్వరం ఏదైనా లేదా కరోనా వల్లనే అయినా తొలిరోజుల్లో జ్వరాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు.

stomach acheసాధారణంగా పిల్లల్లో 90 శాతం వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ జర్వాలే వస్తాయి. ఇవి అంత ప్రమాదకరమైనవి కావు. మిగిలిన 10 శాతం మంది పిల్లల్లో బ్యాక్టీరియల్‌, ప్యారాసైట్‌ ఇన్‌ఫెక్షన్‌ బ్లడ్‌ క్యానర్స్ ఉండొచ్చు. అవికాస్త ప్రమాదకరమైనవి. అయితే చిన్నగా జ్వరం వచ్చినా డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. కాస్త సంయమనం పాటించాలి. ఒళ్లు వెచ్చచేసిన తర్వాత మొదటి 24 – 48 గంటల పాటు డాక్టర్ను కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే, పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్లడం మంచిది. పిల్లలకు గొంతునొవ్స్, చెవిపోటు, శరీరంపై ర్యాషెస్ రావటం లాంటివి ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను కన్సల్ట్ అవ్వాలి.

throat painవ్యాక్సిన్ వేయించిన తర్వాత సహజంగానే పిల్లలకు జ్వరం వస్తుంది. ఆ జ్వరం రెండు రోజుల వరకు కూడా తగ్గకపోతే మాత్రం కచ్చితంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. పిల్లల్లో జ్వరం ఎక్కువైతే ఫిట్స్‌ రావడం జరుగుతుంది. సాధారణ ఫిట్స్‌ అయితే ప్రమాదకరం కాదు. వీటి వల్ల పిల్లల్లో ఎదుగుదల్లో వచ్చే లోపాలు కానీ, మెదడు పై ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువ. వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మెదడు వాపు వ్యాధి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వాటిని గుర్తించి తగిన చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.

జ్వరం వస్తే.. పిల్లలు ముఖ్యంగా డిహైడ్రేషన్‌కు గురి అవుతుంటారు. శరీరం నుంచి వాటర్‌ అనేది వెళ్లిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వారితో నీరు తాగించాలి. తేలికపాటి ఆహారం పెట్టాలి ఎందుకుంటే కొంత మంది పిల్లలకు ఆహారమనేది అరగకపోవచ్చు. అవసరాన్ని బట్టి మందులు వేయడం, డాక్టర్‌ని సంప్రదించడం చేయాలి. ఇక ఆయుర్వేదంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది.

waterపీతలు 250గ్రాలు తెచ్చి శుభం చేసి భాగా దంచి అంటే నుజ్జు నుజ్జు చేసి లవంగాలు, యాలకలు, దాల్చిని చెక్క, జిలకర ఇలా అన్ని సుగంధ ద్రవ్యాలతో మసాలా అన్నీ సుమారు ఒక 1 లీటర్ నోట్లో వేసి భాగా ఉడికించాలి. ఈ రసం బాగా మరిగి 500మిల్లీ మిగిలేలా చూసుకొని ఈ రసాన్ని చిన్నారులకి ఒక్కొసారికి 50మిల్లీ చొప్పున త్రాగించండి. ఇలా చేయడం వల్ల జ్వరం పారిపొతుంది, జ్వరం మాత్రమే కాకుండా టైఫాయిడ్, చికెన్ గున్యా, మలేరియా వంటి కటినమైన సమస్యలు కూడా తగ్గిపోతాయి.

crabఈ రసాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి మరుసటి రోజు కూడా తాగించవచ్చు. ఇలా చిన్నప్పుడు పిల్లలకి పీతలతో చేసిన కాషాయం త్రాగించడం వల్ల మెండితనం, మెద్దుతనం, మంకుతనం, హుసారుగా వుండకపొవడం, ఎక్కువగా రోగాలు రావడం లాంటి సమస్యలు తగ్గి ఆరొగ్యంగా వుంటారు. ముఖ్యంగా మెదడు చురుకుగా ఉంటుంది. ఈ కాషాయం పెద్దవారు సుమారు 150మిల్లీ చొప్పున వాడుకొవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR